TRS: అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రస్తుతం పార్టీపైన ఫుల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో అధికార టీఆర్ఎస్ పార్టీకి ఎదురైన ఓటములను సమీక్షించుకుని, క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కారు ఆరు స్థానాల్లో జోరు చూపింది. అయితే, వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి మరింత జోరు కనబర్చాలని పార్టీ నేతలకు సీఎం సూచించినట్లు వినికిడి. ఇటీవల కాలంలో టీఆర్ఎస్‌పై ప్రజల్లో క్రమంగా వ్యతిరకత పెరుగుతున్నదని, అందులో భాగంగానే అధికార పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని పలువురు సీఎం వద్ద అభిప్రాయపడినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చేందుకుగాను కేసీఆర్ వ్యూహాలను రచిస్తున్నట్లు తెలుస్తోంది.

టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర ఇంపార్టెంట్ లీడర్స్ అందరూ ఇక నుంచి ఎప్పుడూ జనంలోనే ఉంటూ, జనం మధ్య తిరగాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు సమాచారం. అవసరమయితే తప్ప హైదరాబాద్‌కు రావొద్దని, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించాట. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయమే ఉందని, ఈ క్రమంలోనే ప్రజల్లో టీఆర్ఎస్ పార్టీపైన నమ్మకం క్రియేట్ చేయాల్సిన అవసరముందని ఈ నిర్ణయం తీసుకున్నారట. అందులో భాగంగానే సొంత పార్టీ ఎమ్మెల్యేలు, నేతలపైన పింక్ పార్టీ చీఫ్ కేసీఆర్ నిఘా పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి.
Also Read: KCR Rythu Bandhu: రైతుబంధు తమ ఘనతగా చెప్పుకుంటున్న కేసీఆర్.. లాభం మాత్రం ఎవరికి?
ఇటీవల కాలంలో ఎదురైన ఓటముల వల్ల గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ గుబులు చెందారని కూడా చాలా కాలం నుంచి వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సొంత పార్టీ నేతలపైన కేసీఆర్ నిఘా పెట్టడం చూస్తుంటే మళ్లీ రాజకీయ అధికారంలోకి రావడం కోసం కేసీఆర్ తనదైన ఎత్తులు వేసేందుకు మొగ్గుచూపుతున్నారని అర్థమవుతున్నదని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు భయపడిపోతున్నారు. ఈ రెండేళ్ల పాటు నియోజకవర్గంలో జరిగే ప్రతీ కార్యక్రమానికి హాజరు కావాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ రెండేళ్ల కాలంలో ఎమ్మెల్యేల పనితీరును బట్టే మళ్లీ టికెట్ ఇచ్చే అవకాశాలుంటాయి. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేలు నిరంతరం ప్రజల్లో ఉండే చాన్సెస్ ఉంటాయని టీఆర్ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి. చూడాలి మరి.. ఎమ్మెల్యేలు జనంలో ఉన్న వ్యతిరేకతను ఎలా సానుకూలంగా మార్చుకుంటారో..
Also Read: Telangana cabinet expansion: త్వరలోనే తెలంగాణ కేబినెట్ విస్తరణ.. మంత్రి రేసులో ఆ ముగ్గురు?