ఒక్క చుక్క కృష్ణా నీళ్లు పోకుండా.. కేసీఆర్ స్కెచ్

ఆంధ్రప్రదేశ్ అనుమతులు లేకుండా ప్రాజెక్టులు నిర్మించి నీటిని తీసుకెళ్తోందని తెలంగాణ ఆరోపిస్తోంది. కృష్ణాబోర్డు చెప్పినా పనులు ఆపడం లేదని చెబుతోంది. తెలంగాణతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూపించడానికి చర్యలు చేపట్టింది. కృష్ణ నీరు దిగువకు రాకుండా బ్యారేజీలు, ఎత్తిపోతల పథకాలు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. కృష్ణానదిపై ఆనకట్ట నిర్మాణానికి సర్వే చేయడానికి ఉత్తర్వులిచ్చింది.దీంతో తెలంగాణ నిర్ణయంపై ఏపీ ఆందోళన చెందుతోంది. ఎగువన ప్రాజెక్టులు చేపడితే మా పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తోంది. నారాయణపేట జిల్లా కుసుమర్తి వద్ద కాల్వ […]

Written By: Srinivas, Updated On : June 25, 2021 7:13 pm
Follow us on

ఆంధ్రప్రదేశ్ అనుమతులు లేకుండా ప్రాజెక్టులు నిర్మించి నీటిని తీసుకెళ్తోందని తెలంగాణ ఆరోపిస్తోంది. కృష్ణాబోర్డు చెప్పినా పనులు ఆపడం లేదని చెబుతోంది. తెలంగాణతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూపించడానికి చర్యలు చేపట్టింది. కృష్ణ నీరు దిగువకు రాకుండా బ్యారేజీలు, ఎత్తిపోతల పథకాలు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది.

కృష్ణానదిపై ఆనకట్ట నిర్మాణానికి సర్వే చేయడానికి ఉత్తర్వులిచ్చింది.దీంతో తెలంగాణ నిర్ణయంపై ఏపీ ఆందోళన చెందుతోంది. ఎగువన ప్రాజెక్టులు చేపడితే మా పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తోంది. నారాయణపేట జిల్లా కుసుమర్తి వద్ద కాల్వ నిర్మాణం చేపట్టి రోజుకు ఒక టీఎంసీ నీటిని తరలించేలా ప్రణాళికలు రచిస్తోంది.

గద్వాల, ఆలంపూర్ ప్రాంతాల్లోని రెండు లక్షల ఎకరాలకు నీరిందించేందుకు సుంకేశుల జలాశయం వద్ద ఎత్తిపోతల పథకం చేపట్టేందుకు సర్వే చేస్తోంది. కల్వకుర్తి ప్రాజెక్టు కింద జలాశయాల సామర్థ్యాన్ని20 టీఎంసీలకు పెంచేందుకు నిర్ణయించింది. నల్గొండ జిల్లాలోని 2 లక్షల ఎకరాల కోసం పులిచింతల వద్ద ఎత్తిపోతల పథకం చేపట్టాలని భావిస్తోంది. సర్వేకు ప్రభుత్వం అనుమతి ఇఛ్చింది.

కృష్ణానదిలో తుంగభద్ర కలిసే చోట నలభై టీఎంసీల సామర్థ్యంతో ఆనకట్ట నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం సర్వేకు అనుమతించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలుచుకుంటే ఏమైనా చేస్తామని చెప్పకనే చెబుతోంది. దిగువ రాష్ర్టం ప్రాజెక్టులు కట్టుకుంటే తాము చూస్తూ ఊరుకోబోమని పేర్కొంది. నిజంగా తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టులు పూర్తి చేస్తే రాయలసీమ ఎడారి అయ్యే ప్రమాదం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేసీఆర్ దూకుడుకు అడ్డుకట్ట వేసేలా చూడాలని కోరుతున్నారు.