https://oktelugu.com/

కేసీఆర్ ట్విస్ట్.. మేనిఫెస్టోలో ‘ఫిల్మ్ సిటీ’..!

తెలంగాణలో జీహెచ్ఎంసీ ఎన్నికల వేడిరాజుకుంది. సీఎం కేసీఆర్ జీహెచ్ఎంసీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. 110 టీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని టీఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈనేపథ్యంలో ఫిల్మ్ సిటీ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం టీఆర్ఎస్ వైపు ఆశగా చూస్తోంది. Also Read: కాంగ్రెస్ కు షాక్.. గ్రేటర్ లో బీజేపీ తరుఫున విజయశాంతి ప్రచారం సీఎం కేసీఆర్ గతంలోనే ఫిల్మ్ సిటీని ఆధునాతన హంగులతో హైదరాబాద్లో నిర్మిస్తామని ప్రకటించారు. […]

Written By:
  • NARESH
  • , Updated On : November 23, 2020 / 11:45 AM IST
    Follow us on

    తెలంగాణలో జీహెచ్ఎంసీ ఎన్నికల వేడిరాజుకుంది. సీఎం కేసీఆర్ జీహెచ్ఎంసీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. 110 టీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని టీఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈనేపథ్యంలో ఫిల్మ్ సిటీ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం టీఆర్ఎస్ వైపు ఆశగా చూస్తోంది.

    Also Read: కాంగ్రెస్ కు షాక్.. గ్రేటర్ లో బీజేపీ తరుఫున విజయశాంతి ప్రచారం

    సీఎం కేసీఆర్ గతంలోనే ఫిల్మ్ సిటీని ఆధునాతన హంగులతో హైదరాబాద్లో నిర్మిస్తామని ప్రకటించారు. అయితే అది నేటివరకు కార్యరూపం దాల్చలేదు. కరోనా నేపథ్యంలో టాలీవుడ్ ఇండస్ట్రీ తీవ్ర సంక్షోభంలో పడింది. ఈక్రమంలోనే పలుమార్లు ఫిల్మ్ సిటీ అంశం తెరపైకి వచ్చింది. ఇటీవల హైదరాబాద్ లో వరదలు వచ్చిన సందర్భంగా ప్రభుత్వానికి టాలీవుడ్లో పెద్దలు సాయాన్ని ప్రకటించారు.

    Also Read: బీజేపీ ఆకర్ష్‌ కు కాంగ్రెస్ ఖాళీయేనా?

    ఈక్రమంలోనే ఇటీవల మెగాస్టార్ చిరంజీవి.. కింగ్ నాగార్జున తదితరులు సీఎం కేసీఆర్ ను కలిసి వరద సాయం చెక్కులను అందజేశారు. ఈసందర్భంగా వారి మధ్య ఫిల్మ్ సిటీ నిర్మాణంపై చర్చ జరిగినట్లు సమాచారం. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. కాగా నిన్న కూడా సీఎం కేసీఆర్ టాలీవుడ్ పెద్దలు చిరంజీవి.. నాగార్జునతో భేటి కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

    జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలోనే సినిమా పరిశ్రమకు రాయతీలు.. మినహాయింపులపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. కాగా ఫిల్మ్ సిటీ అంశాన్ని టీఆర్ఎస్ మెనిఫెస్టోలో సీఎం కేసీఆర్ చర్చనున్నారనే టాక్ విన్పిస్తోంది. టాలీవుడ్ పెద్దల చొరవతో టీఆర్ఎస్ మెనిఫెస్టోలో ఫిల్మ్ సిటీ అంశం చేరితే అది కార్యరూపం దాల్చక తప్పదు. ఇది గనుక జరిగితే ఈ రంగంపై ఆధారపడిన వారికి మంచి రోజులు వచ్చినట్లే..!