ఈటల కుమారుడిని వదలని కేసీఆర్

తెలంగాణ కేబినెట్ నుంచి భూకబ్జా ఆరోపణలతో ఈటల రాజేందర్ ను సీఎం కేసీఆర్ తొలగించేశారు. ఆ తర్వాత మాటల యుద్ధాలు నడిచాయి. అయితే ఈటల చాపకింద నీరులా కేసీఆర్ వ్యతిరేకులు, ప్రతిపక్షాలను కలిసి కూటమి కట్టేదిశగా ప్రయత్నాలు చేస్తుండడంతో కేసీఆర్ , టీఆర్ఎస్ సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. పైగా ఇటీవల హుజూరాబాద్ నియోజకవర్గంలో మంత్రులు గంగుల, హరీష్ రావులు ప్రవేశించి టీఆర్ఎస్ శ్రేణులను ఈటలకు దూరం చేయడం చిచ్చు పెట్టింది. దీనిపైనా ఈటల తీవ్ర వ్యాఖ్యలు […]

Written By: NARESH, Updated On : May 23, 2021 12:19 pm
Follow us on

తెలంగాణ కేబినెట్ నుంచి భూకబ్జా ఆరోపణలతో ఈటల రాజేందర్ ను సీఎం కేసీఆర్ తొలగించేశారు. ఆ తర్వాత మాటల యుద్ధాలు నడిచాయి. అయితే ఈటల చాపకింద నీరులా కేసీఆర్ వ్యతిరేకులు, ప్రతిపక్షాలను కలిసి కూటమి కట్టేదిశగా ప్రయత్నాలు చేస్తుండడంతో కేసీఆర్ , టీఆర్ఎస్ సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది.

పైగా ఇటీవల హుజూరాబాద్ నియోజకవర్గంలో మంత్రులు గంగుల, హరీష్ రావులు ప్రవేశించి టీఆర్ఎస్ శ్రేణులను ఈటలకు దూరం చేయడం చిచ్చు పెట్టింది. దీనిపైనా ఈటల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఇక ఎంతమాత్రం ఈటలను వదిలిపెట్టకూడదని కేసీఆర్ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే తాజాగా ఈటల రాజేందర్ కుమారుడిని కేసీఆర్ టార్గెట్ చేశారు. ఈటల కుమారుడు నితిన్ రెడ్డిపై సీఎం కేసీఆర్ కు ఫిర్యాదు అందగా.. ఆగమేఘాలపై స్పందించి దానిపై విచారణకు ఏకంగా సీఎస్ సోమేశ్, ఏసీబీ విజిలెన్స్ ను ఆదేశించడం సంచలనమైంది. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.

తన భూమిని ఈటల కుమారుడు నితిన్ రెడ్డి కబ్జా చేశారని మేడ్చల్ జిల్లా రావల్ కోల్ వాసి మహేష్ ఏకంగా సీఎం కేసీఆర్ కు ఫిర్యాదు చేయడమే ఇక్కడ ట్విస్ట్. ఎవరైనా స్థానిక పోలీసులు, రెవెన్యూ అధికారులను కలిసి కబ్జాపై ఫిర్యాదు చేస్తారు. కానీ కేసీఆర్ కే స్వయంగా బాధితుడు ఫిర్యాదు చేయడం.. కేసీఆర్ స్పందించడం చూస్తుంటే ఇదంతా టీఆర్ఎస్ పక్కా ప్రణాళికతో ఈటలను దెబ్బతీసే స్కెచ్ గా అభివర్ణిస్తున్నారు.

ఇప్పటికే మెదక్ జిల్లాలోని అచ్చంపేట భూములు కబ్జా చేశారని ఈటలను మంత్రివర్గం నుంచి కేసీఆర్ తొలగించేశాడు. ఇప్పుడు ఆయన కుమారుడిపై కూడా భూకబ్జా ఆరోపణలతోనే విచారణ చేస్తుండడంతో ఈటలను కేసీఆర్ టార్గెట్ చేసినట్టుగా రాజకీయవర్గాల్లో ప్రచారం సాగుతోంది.