కేసీఆర్‌‌ సిక్‌ లీవ్‌లు అందుకేనా..? : కేంద్ర సమావేశాలపై ఇంట్రస్ట్‌ లేదా..!

ఎన్నో పోరాటాలు.. మరెన్నో ఉద్యమాల తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కల సాకారమైంది. కొత్త రాష్ట్ర ఏర్పడినా తెలంగాణ ప్రజల బతుకుల్లో మాత్రం ఎలాంటి మార్పు కనిపించడం లేదు. ఇది ప్రజల నుంచి వస్తున్న విమర్శనే. దీనికితోడు ముఖ్యమంత్రి కేసీఆర్‌‌ కూడా పాలన పట్ల సరైన శ్రద్ధ చూపడం లేదు. అందుకే కేంద్ర ప్రభుత్వం నిర్వహించే కీలక సమావేశాలకు కూడా అటెండ్‌ అవ్వడానికి ఆయన పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. Also Read: తెలంగాణ ప్రజలకు షర్మిల […]

Written By: Srinivas, Updated On : February 21, 2021 4:56 pm
Follow us on


ఎన్నో పోరాటాలు.. మరెన్నో ఉద్యమాల తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కల సాకారమైంది. కొత్త రాష్ట్ర ఏర్పడినా తెలంగాణ ప్రజల బతుకుల్లో మాత్రం ఎలాంటి మార్పు కనిపించడం లేదు. ఇది ప్రజల నుంచి వస్తున్న విమర్శనే. దీనికితోడు ముఖ్యమంత్రి కేసీఆర్‌‌ కూడా పాలన పట్ల సరైన శ్రద్ధ చూపడం లేదు. అందుకే కేంద్ర ప్రభుత్వం నిర్వహించే కీలక సమావేశాలకు కూడా అటెండ్‌ అవ్వడానికి ఆయన పెద్దగా ఆసక్తి చూపించడం లేదు.

Also Read: తెలంగాణ ప్రజలకు షర్మిల ‘ఓదార్పు’

అనారోగ్యం పేరుతో కేంద్ర ప్రభుత్వం సమావేశాలకు దూరంగా ఉండేందుకే ఆయన ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రధాని అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ సమావేశానికి కూడా కేసీఆర్ సిక్ లీవ్ పెట్టేశారు. తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్‌పల్లి వినోద్ కుమార్ ఆ బాధ్యత తీసుకున్నారు. సీఎస్ సోమేష్ కుమార్ కూడా పాల్గొన్నారు. సమావేశం ముగిసిన తర్వాత ఇద్దరూ వెళ్లి వివరాలు చెప్పారు. స్వల్ప అనారోగ్యం కారణంగా కేసీఆర్ సమావేశంలో పాల్గొనలేదని సీఎంవో వర్గాలు చెబుతున్నాయి.

Also Read: మంథనిలో పాతికేళ్లుగా లీగల్ వార్.. హత్యకు కారణం అదే..

కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లొచ్చిన తర్వాత ఓ సారి గడ్కరీ మీటింగ్‌ నిర్వహించారు. ఆ సమావేశానికి కేసీఆర్ వర్చ్యువల్‌గా హాజరు కాలేదు. తెలంగాణ తరపున హాజరైన ప్రతినిధులు.. తమ సీఎంకు అనారోగ్యం అని అందుకే రాలేదని గడ్కరీకి చెప్పారు. దాంతో గడ్కరీ ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అప్పటి వరకూ కేసీఆర్‌కు అనారోగ్యమనే విషయం ఎవరికీ తెలియదు. గడ్కరీకి తెలియదమో కానీ అది.. సమావేశానికి డుమ్మా కొట్టేందుకు దొరికిన సిల్లీ రీజన్‌ అని కొంత మంది సైటెర్లు వేశారు.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

నిజానికి నీతి ఆయోగ్ సమావేశం వల్ల పైసా ప్రయోజనం ఉండదని ముఖ్యమంత్రుల భావన. గతంలో పంచవర్ష ప్రణాళిక ఉండేది. అప్పట్లో నిధులు నేరుగా రాష్ట్రాలకు ఇచ్చేవారు. ప్రణాళికల స్థానంలో నీతి ఆయోగ్‌ను తీసుకొచ్చారు. నీతి ఆయోగ్‌కు.. ఎలాంటి ఆర్థిక అధికారాలు లేవు. ఈ కారణంగా ఏదైనా మంచి పనులు చేసినప్పుడు సిఫార్సులు మాత్రమే నీతి ఆయోగ్ చేయగలుగుతుంది కానీ నిధులు విడుదల చేయడం లేదు. తెలంగాణకు సంబంధించినంత వరకు మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయాలని నీతి ఆయోగ్ సిఫార్సు చేసింది. కానీ.. కేంద్రం రూపాయి కూడా ఇవ్వలేదు. అందుకే వీటన్నింటి నేపథ్యంలో ఈ సమావేశంలో ఉపయోగం ఏమీ ఉండదని డిసైడ్‌ అయి కేసీఆర్‌‌ దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది.