KCR New Schemes: ప్రచారం చేసుకోవడంలో టీఆర్ఎస్ తరువాతే ఎవరైనా. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి చేరవేయడంలో కీలక భూమిక పోషిస్తూ దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో మహిళా దినోత్సవం రోజును తమకు అనుకూలంగా మలుచుకోవాలని భావిస్తున్నారు. దీంతో సీఎం మహిళల కోసం నిర్వహిస్తున్న కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, డ్వాక్రా సంఘాలకు రుణాలు తదితర అంశాలను తమ ఘనతగా చెప్పుకుంటూ మార్చి 6 నుంచి 8 వరకు వేడుకలు జరపాలని నిర్ణయించింది.
ఇందులో భాగంగా మహిళల కోసం చేపడుతున్న పథకాలతో వారి అభ్యున్నతే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు చెప్పుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు చెబుతున్నారు. దీంతో మహిళా ఓటు బ్యాంకును తమకు అనుకూలంగా మార్చుకోవాలని భావిస్తున్నారు.ఈ క్రమంలో మహిళా దినోత్సవాన్ని ఇలా ఉపయోగించుకునేందుకు ప్రభుత్వం ఇలా ప్లాన్ వేయడం సంచలనం కలిగిస్తోంది.
Also Read: విద్యారంగంలో జగన్ మార్పులు.. ఏపీ భవిష్యత్తును మార్చుతుందా? కూల్చుతుందా?
మహిళల ఇళ్లకు వెళ్లి వారికి సన్మానాలు చేయడం తరువాత వారితో ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రచారం సాగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మహిళా సంక్షేమ కార్యక్రమాల అమలుపై ప్రచారం చేసేందుకు తయారవుతోంది. దీంతో మహిళల కోసం ప్రభుత్వం మరిన్ని కార్యక్రమాలు చేపడుతుందని చెప్పేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం.
కల్యాణ లక్ష్మి ద్వారా పది లక్షల మంది ఆడపిల్లల పెళ్లిళ్లు చేసిన ఘనత తమదేనని చెప్పుకునేందుకు నిర్ణయించుకుంది. భవిష్యత్ లో మరిన్ని సంక్షేమ పథకాలు తీసుకొచ్చి వారి ఆదరణ, అభిమానాలు సంపాదించాలని చూస్తోంది. దీనికి గాను టీఆర్ఎస్ ప్రచార ఆర్భాటాలు ఘనంగా చేసేందుకు సంకల్పించింది. నేతలు ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు.
Also Read: వివేకా హత్య కేసు: ఏ క్షణమైనా చార్జి షీట్