Third Front: దేశంలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ప్రయత్నాలు ముమ్మరం అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ దిశగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చురుకుగా కదులుతున్నట్లు సమాచారం. బీజేపీని గద్దె దించడమే ధ్యేయంగా ఆయన ముందుకు వెళ్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల నేతలను కలిసిన ఆయన మూడో కూటమి ప్రాధాన్యతను వివరిస్తున్నారు.అందరిని ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. దేశ ప్రజలు కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెబుతూ అన్ని పార్టీలను ఏకం చేసేందుకు సమాయత్తమవుతున్నారు.
ఈ నేపథ్యంలోనే తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, బిహార్ తదితర రాష్ట్రాలకు చెందిన నేతలు స్టాలిన్, విజయన్, ఉద్ధవ్ ఠాక్రే, తేజస్వి యాదవ్ లను కలిసి తన అభిప్రాయం చెప్పారు. ఇప్పటికే బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పలుమార్లు సమావేశమైన కేసీఆర్ త్వరలో ఢిల్లీ వెళ్లి అందరితో సమావేశం నిర్వహించేందుకు నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
దీంతో కేసీఆర్ ప్రజాఫ్రంట్ పేరుతో ఏర్పాటు చేయబోయే దీనికి అందరి ఆమోదం కూడగట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. బీజేపీని టార్గెట్ చేసుకుని కేసీఆర్ చేస్తున్న సందర్భంలో ఏమేరకు విజయం సాధిస్తారో అనే సందేహాలు అందరిలో వస్తున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ని గద్దె దించడమే ధ్యేయంగా కేసీఆర్ కంకణం కట్టుకున్నా అది నెరవేరుతుందా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి.
Also Read: Kcr New Political Party:కేసీఆర్ కొత్త పార్టీపై సర్వేలు..! ప్రజలేమనుకుంటున్నారు..?
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా హైదరాబాద్ కు రానున్నారు. కేసీఆర్ తో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మూడో కూటమి ఏర్పాటుపై చర్చలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో కేసీఆర్, మమత మధ్య పలు అంశాలపై కూలంకశంగా చర్చించనున్నట్లు సమాచారం.
దేశంలో ప్రజాఫ్రంట్ ఏర్పాటుకు బీజాలు పడే అవకాశం ఉంటున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్ పరిణామాల నేపథ్యంలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు అందరిని కూడగట్టే ప్రయత్నంలో బీజేపీ యేతర రాష్ట్రాల సీఎంలతో ఇప్పటికే చర్చలు జరిపిన సందర్భంలో ప్రస్తుతం వారందరిని ఏకం చేసేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీని కోసమే అందరు ఐక్యంగా ఉద్యమించాల్సిన ఆవశ్యకతను వివరిస్తున్నారు.
Also Read: BJP War With KCR: కేసీఆర్ తో యుద్ధానికి బీజేపీ సిద్ధం..రె‘ఢీ’