KCR Meets Undavalli Arun Kumar: రాజకీయాల్లో అవసరాలు మాత్రమే ఉంటాయి. ఆ అవసరాలు తీరాకా శత్రుత్వాలు పెరుగుతాయి. ఆశతృత్వం కాస్త ప్రజల్లోకి వెళ్లి జాతి వైరంగా మారుతుంది. శత్రుత్వానికి ఆజ్యం పోసిన నాయకులు జాతిపితలుగా వెలుగొందుతారు. నాటి రాజుల కాలం నుంచి నేటి నవీన ప్రజాస్వామ్య యుగం వరకు జరిగింది. జరుగుతున్నది ముమ్మాటికీ ఇదే! క్రీస్తు పూర్వం నుంచి క్రీస్తు శకం దాకా.. దశకాల నుంచి మిలీనియల్ తరం దాకా.. ఈ సువిశాల భారతదేశం ఎన్నో ఉద్యమాల్ని, ఎన్నో ఉద్రేకాలను, ఎన్నో ఉద్వేగాలను చవిచూసింది. వాటిల్లో లో ముఖ్యంగా దక్షిణాది చరిత్రలో తెలంగాణ తొలి,మలి దశల్లో సాగిన ఉద్యమం చిరస్థాయిగా నిలిచిపోతుంది. తొలిదశ కంటే మలిదశలో సాగిన ఉద్యమం అనేక పంథాలను అనుసరించింది. ఎన్నో కుట్రలు మరెన్నో కుయుక్తులను తట్టుకొని నిలబడింది. ప్రస్తుతం స్వీయ పాలన సాగుతున్న తెలంగాణ రాష్ట్రంలో నాడు ఎవరైతే విభజనను అడ్డుకున్నారో నేడు వారు పాలకులకు అత్యంత ప్రీతిపాత్రులు అవడం గమనార్హం.

శాశ్వత శత్రువులు ఉండరు
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు అని ఒక నానుడి. ఇప్పుడు తెలంగాణలో కూడా అదే జరుగుతోంది. బీఆర్ఎస్ పేరుతో జాతీయ పెట్ట పార్టీ పెట్టాలని ఉవ్విళ్లూరతున్న కేసీఆర్కు ఇప్పుడు తెలంగాణ ఏర్పాటును అడుగడుగునా అడ్డుకున్న ఉండవల్లి అరుణ్ కుమార్ అవసరం వచ్చిపడింది. కేసీఆర్ స్టైల్ తెలుసు కదా తనకు అవసరం ఉంటే వంద మెట్లు కిందికి దిగి వచ్చి ఎదుటి వ్యక్తిని ఆలింగనం చేసుకుంటాడు. ఆ తరహాలోనే ఇటీవల ఉండవల్లి అరుణ్ కుమార్ కు ప్రగతి భవన్ నుంచి ఆహ్వానం అందింది. సుమారు ఎనిమిది గంటల పాటు ఇద్దరి మధ్య చర్చలు జరిగాయి. ఆ తర్వాతఅరుణ్ కుమార్ బయటకు వచ్చి కెసిఆర్ జాతీయ రాజకీయాలపై చాలా ఫోకస్డ్గా ఉన్నారని వ్యాఖ్యానించారు. కానీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఇటీవల నిర్వహించిన ప్రెస్ మీట్ లో చాలా వ్యాఖ్యలు చేశారు. వాటిని ఒకసారి మననం చేసుకుంటే..
Also Read: Uttarandhra Cashew Nut: జీడిపప్పు ఉత్తరాంధ్ర ఎందుకు ఫేమస్ అయ్యింది
టెక్నికల్ గా ఆంధ్రప్రదేశ్ ఇంకా విడిపోలేదు।
మోడీ ని కేసీఆర్ ఎలా బెదిరిస్తున్నాడో చూసి నేర్చుకో జగన్..
ఆంధ్రాకి విలన్ గా ఉంటేనే తనకి మంచిదని కేసీఆర్ నమ్ముతున్నాడు.
కేసీఆర్ కి తిట్టడం తప్ప మరేమీ రాదు !
దేశ ప్రధానిని ఉద్దేశించి ఒక ముఖ్యమంత్రి అలా మాట్లాడతారా ?
కేసీఆర్ జగన్ లో ప్రగతి భవన్ లో ప్రేమించుకున్నారు ! ఇంకా ఈ నాటకాలెంటి ? ఇవి ఉండవల్లి అరుణ్ కుమార్ నోటి నుంచి జాలువారిన ఆణిముత్యాలు.
ఉండవల్లి ప్రేమించుకోవడానికే వెళ్లారా?
ప్రగతి భవన్ ఉంది ప్రేమించుకోవడానికి అని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అరుణ్ కుమార్ తిరిగి ఆయన కూడా అదే ప్రగతి భవన్కు వెళ్లడం ఆశ్చర్యం కలుగుతోంది. రాజకీయ నాయకుల మాటలు నీటి మీద మూటలు అని సామెత ఆయన చర్యల ద్వారా మరోసారి నిజమని నిరూపితమవుతున్నది.
శల్య సారధ్యం గురుంచి మహాభారతం లో చదువుకున్నాం.. ఇప్పుడు ఉండవల్లిని చూస్తే అదే నిజం అనిపిస్తుంది. ఇంతకీ రాష్ట్ర విభజన మీద సుప్రీమ్ కోర్టు లో మీరు వేసిన పిటిషన్ ని వెనక్కి తీసుకునే విషయం మీద కేసీఆర్ తో ఒక ఒప్పందానికి వచ్చారా ?
సౌత్ బ్లాక్ లో టాక్ ఏమిటంటే తలుపులు వేసి,కరెంట్ తీసేసి బలవంతంగా రాష్ట్ర విభజన చేసింది నిజమే అని హోమ్ శాఖ సుప్రీమ్ కోర్టులో ఒప్పుకుంటే అప్పుడు మీరు వేసిన పిటిషన్ కి బలం చేకూరుతుందని అదే సమయంలో మళ్ళీ రాష్ట్ర విభజన బిల్లు మరోసారి పెట్టాల్సి వస్తుందని అప్పుడు మళ్ళీ ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయని అని ఇలా ఇన్ని టాక్ లు వినపడుతున్నాయి ఏతావాతా ముందు కేసీఆర్ నష్టపోతాడాని అందుకే మీరు ప్రగతి భవన్ లో ప్రేమ ముచ్చట్లు పెట్టారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఆస్తులను కాపాడుకోవడం కోసమే నా
ఉండవల్లి అరుణ్ కుమార్ సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో కలవడం వెనుక ఉద్దేశం ఆస్తులు కాపాడుకోవడమే నా? అంత దీనికి అవుననే చెబుతున్నాయి పొలిటికల్ వర్గాలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండవల్లి అరుణ్ కుమార్ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కి అతి సన్నిహితంగా ఉండేవారు. అప్పట్లో అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష టీడీపీ పై విరుచుకు పడేవారు. అసెంబ్లీలో రోశయ్య, బయట ఉండవల్లి అరుణ్ కుమార్ పదునైన మాటలతో టిడిపికి చుక్కలు చూపించారు. అప్పట్లో హైదరాబాద్ జవహర్ నగర్ చెత్త కాల్చివేత కాంట్రాక్ట్ రామ్కీ అనే కంపెనీకి దక్కడంలో ఉండవల్లి అరుణ్ కుమార్ కీలకపాత్ర పోషించారని ఇప్పటికి ఆరోపణలు ఉన్నాయి. రామ్కీ కి కాంట్రాక్టు దక్కించుకున్న లో కీలక పాత్ర పోషించిన ఉండవల్లి అరుణ్ కుమార్ కు ఆ సంస్థ భారీగానే ముట్ట చెప్పిందని, వాటితోనే హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో భారీగా ఆస్తులు కూడబెట్టారని ఆ పార్టీ నాయకులు చెబుతుంటారు. తెలంగాణ ఏర్పాటైన శివారు ప్రాంతాల్లో భూముల ధరలు అమాంతం పెరగడంతో ఉండవల్లి అరుణ్ కుమార్ ఆస్తుల విలువ భారీగా పెరిగింది. తెలంగాణ ఇచ్చిన తర్వాత 2014లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని భావించిన అరుణ్ కుమార్ కేసీఆర్ పై విమర్శలు చేసేవారు. కానీ జనం రెండుసార్లు కాంగ్రెస్ను తిరస్కరించడంతో ఉండవల్లి అరుణ్ కుమార్ కు తత్వం బోధపడింది. ఇటీవల చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో అరుణ్ కుమార్ పై టిఆర్ఎస్ నేతలు గుర్రుగా ఉండడంతో మధ్యేమార్గంగా ఆయన ప్రగతి భవన్ కు వెళ్లి వచ్చారని సమాచారం. అందులో భాగంగానే కేసీఆర్ త్వరలో ప్రారంభించే బి ఆర్ ఎస్ పార్టీ విధివిధానాల గురించి మాట్లాడదామని బయటకు వచ్చి విలేకరులతో వెల్లడించారు. అదే సమయంలో తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తూ మీరు సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు కదా ఇప్పుడు ఎలా కేసీఆర్ని కలుస్తారు అని విలేకరులు ప్రశ్నిస్తే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు అని ప్రకటించారు. అలాగే దేశం మీద కేసీఆర్ కొండంత నాలెడ్జ్ ఎవరికీ లేదని ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించడం గమనార్హం.
Also Read:Imran Khan: పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ హత్యకు సి.ఐ.ఎ ప్లాన్ వేసిందా?