Early Elections In Telangana: తెలంగాణలో రాజకీయ పార్టీల్లో ముందస్తు జ్వరం పట్టుకుంది. ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వచ్చే డిసెంబర్ లో అసెంబ్లీని రద్దు చేసి మార్చిలో ఎన్నికలకు వెళతారని జోస్యం చెప్పడంతో ఆ దిశగా అందరు ఆలోచనలో పడ్డారు. దీంతో రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల ఊహాగానాలు జోరందుకున్నాయి. ఇందులో నిజమెంతో కానీ ప్రతిపక్షాల్లో మాత్రం ముందస్తు ఎన్నికలకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో పార్టీలు కూడా ఆ దిశగా ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం.

అధికార పార్టీ టీఆర్ఎస్ ను ఎదుర్కొనే క్రమంలో పాటించాల్సిన వ్యూహాలపై కసరత్తు చేస్తున్నాయి. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర ఆలోచిస్తున్న క్రమంలో ముందస్తుకు వెళ్లరనే అభిప్రాయం కొంతమంది నేతల్లో వస్తోంది. అయితే చాలా మంది కేసీఆర్ ముందస్తుకు వెళతారనే వాదన తెస్తున్నారు. దీంతోనే తెలంగాణలో రాజకీయ పరిణామాలు మారనున్నట్లు పరిస్థితులు కనిపిస్తున్నాయి.
రాబోయే రోజుల్లో ఇంకా ఎలాంటి మార్పులు వస్తాయోననే సందేహం అందరిలో వస్తోంది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో సమావేశమైన తరువాత కేసీఆర్ వైఖరిలో స్పష్టమైన మార్పులు వచ్చినట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగానే ముందస్తుకు వెళతారనే ఊహాగానాలకు బలం చేకూరుస్తోంది. కానీ కేసీఆర్ మాత్రం ముందస్తుకు వెళ్లే ధైర్యం చేయరనే అభిప్రాయం అందరిలో వస్తోంది.

2018లో అనుసరించిన వ్యూహాన్నే అమలు చేస్తారనే విషయం అందరిలో వస్తోంది. దీంతో ముందస్తు కోసం బీజేపీ సైతం ఆలోచన చేస్తోంది. టీఆర్ఎస్ ను ఎదుర్కోవాలని పావులు కదుపుతోంది. రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ అనే వాదన ఎప్పటి నుంచే చేస్తోంది. కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాటలతో పార్టీ భవితవ్యం అగమ్యగోచరంగా మారిన పరిస్థితుల్లో పోటీ ప్రధానంగా టీఆర్ఎస్, బీజేపీ మధ్యే ఉండనుందని తెలుస్తోంది.
[…] Telangana Budget Session 2022: తెలంగాణ శాసనసభ నిర్వహణ గవర్నర్ ప్రసంగం లేకుండా చేయడంతో అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ తన పంతం నెగ్గించుకునే క్రమంలో గవర్నర్ ను సభకు ఆహ్వానించకపోవడంపై అందరిలో విమర్శలు వస్తున్నాయి. సీఎం కేసీఆర్ నిర్ణయంపై సర్వత్రా ఆగ్రహం కలుగుతోంది. ఇన్నాళ్ల కాలంలో ఎప్పుడు కూడా గవర్నర్ లేకుండా శాసనసభ వ్యవహారాలు ప్రారంభం కాలేదని తెలుస్తోంది. కానీ ఈసారి మాత్రం గవర్నర్ ను సభకు రాకుండా చేయడంతో కేసీఆర్ అప్రదిష్టను మూటగట్టుకున్నారని పలువురు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. […]