Black Panther: పిల్లి అనుకొని చేరదీసింది… పెంచి పెద్దచేసి షాక్‌ అయ్యింది.. వైరల్‌ వీడియో!

రష్యాకు చెందిన మహిళ విక్టోరియా జంతు ప్రేమికురాలు. జంతువులను దత్తత కూడా తీసుకుంటుంది. ఆమె ఒక కుక్కను ఇంట్లో పెంచుకుంటోంది.

Written By: Raj Shekar, Updated On : September 26, 2023 2:16 pm

Black Panther

Follow us on

Black Panther: పెట్స్‌ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. ముఖ్యంగా మహిళలు పెట్స్‌ను ఇష్టపడతారు. ఇంట్లో ఉండే వారు కాలక్షేపం కోసం కుక్కలు, పిల్లులు, పక్షులను పెంచుతుంటారు. పెట్స్‌ మనుషులతో అనుబంధాన్ని పెంచుకుంటాయి. మనం ప్రేమ చూపితే అవి రెట్టింపు ప్రేమ చూపుతాయి. అవి దూరమైతే చాలా బాధపడతారు. ఇలాగే ఓ మహిళ కూడా రోడ్డు పక్కన పడి ఉన్న ఓ కూనను చూసి పిల్లి పిల్ల అనుకుని ఇంటికి తీసుకెళ్లింది. పెంచి పెద్దచేసింది. కానీ చివరకు అది పెద్దయ్యాక చూసి షాక్‌ అయింది.

రష్యాలో ఓ మహిళ..
రష్యాకు చెందిన మహిళ విక్టోరియా జంతు ప్రేమికురాలు. జంతువులను దత్తత కూడా తీసుకుంటుంది. ఆమె ఒక కుక్కను ఇంట్లో పెంచుకుంటోంది. ఒకరోజు రోడ్డుపక్కన నడుచుకుంటూ వెళ్తుండగా ఓ కూన చెట్ల పొదల్లో కనిపించింది. జంతు ప్రేమికురాలు అయిన విక్టోరియా దానిని చూసి జాలిపడింది. చేత్తులోకి తీసుకుని చూసింది. అది అచ్చ పిల్లి పిల్లలా అనిపించింది దీంతో వెంటనే ఇంటకి తీసుకెళ్లి శుభ్రం చేసి పెంచుకోవాలని నిర్ణయించింది. తన కుక్కతోపాటు ఈ పిల్లను కూడా పెంచింది.

రెండూ ఆడుతూ పాడుతూ..
విక్టోరియా కుక్కతోపాటు ఇంటకి తెచ్చిన నల్లరంగు కూడా కూడా పెరగడం ప్రారంభించింది. ఆరోగ్యంగా తయారైంది. విక్టోరియా రెండింటికీ సమాన ప్రాధాన్యత ఇస్తూ పెంచింది. అవి కూడా ఆడుతూ పాడుతూ పెరిగాయి. ఇంతలో ఏడాది గడిచింది. పిల్లి అనుకున్న ఆ నల్లని కూడా పెద్దయ్యాక బ్లాక్‌ పాంథర్‌(నల్ల చిరుతపులి) అని తెలుసుకుంది. ఈ విషయం తెలిసి షాక్‌ అయింది.

ఒక ధృఢ నిర్ణయం..
అయినా విక్టోరియా భయపడలేదు. తన కుక్క, బ్లాక్‌ పాంథర్‌ మధ్య ఉన్న అనుబంధాన్ని దూరం చేయడానికి ఇష్టపడలేదు. వాటిని విడదీయొద్దని నిర్ణయించుకుంది. దీంతో రెండూ కలిసే పెరుగుతున్నాయి. తాజాగా ఆ రెండూ మంచులో ఆడుకుంటున్న వీడియోను విక్టోరియా సోషల్‌ మీడియాలో పోస్టు చేసింది. బ్లాక్‌ పాంథర్‌ కూడా తాను చిరుత అన్న విషయం మరిచిపోయి సాదుజంతువులా మారింది. దానికి వేట, క్రూరంగా ప్రవర్తించడం తెలియకపోవడంతో ఎలాంటి ప్రమాదం లేదని పర్యావరణ వేత్తలు అంటున్నారు. అయితే దానిని అడవిలో వదలడమే మేలని జంతు ప్రేమికులు సూచిస్తున్నారు.