మోడీ ఇలా చేస్తావా? కేసీఆర్ ఘాటు స్పందన

ప్రధాని మోడీపై కేసీఆర్ లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. సీరియస్ గా ఇదేంటి మోడీజీ అని కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం విషయంలో కోతలు పెడుతున్న తీరు చూసి కేసీఆర్ ఘాటుగా స్పందించారు. ఇప్పటివరకు జీఎస్టీ పరిహారంపై కేరళ సీఎం విజయన్ మాత్రమే సీరియస్ అయ్యారు. కేరళ ముఖ్యమంత్రి అయినా కాస్త గట్టిగానే మోడీని నిలదీశాడు. కమ్యూనిస్టు కాబట్టి ఆ మాత్రం ధైర్యం చూపారు. కానీ మన తెలుగు రాష్ట్రాల సీఎంలకు ఏం […]

Written By: NARESH, Updated On : September 1, 2020 4:53 pm
Follow us on

ప్రధాని మోడీపై కేసీఆర్ లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. సీరియస్ గా ఇదేంటి మోడీజీ అని కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం విషయంలో కోతలు పెడుతున్న తీరు చూసి కేసీఆర్ ఘాటుగా స్పందించారు.

ఇప్పటివరకు జీఎస్టీ పరిహారంపై కేరళ సీఎం విజయన్ మాత్రమే సీరియస్ అయ్యారు. కేరళ ముఖ్యమంత్రి అయినా కాస్త గట్టిగానే మోడీని నిలదీశాడు. కమ్యూనిస్టు కాబట్టి ఆ మాత్రం ధైర్యం చూపారు. కానీ మన తెలుగు రాష్ట్రాల సీఎంలకు ఏం అలిగేషన్స్ ఉన్నాయో కానీ ఇద్దరూ యాంటిమెంట్ పూసినట్టు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు చెలరేగాయి.

దీంతో ఎట్టకేలకు కేసీఆర్ సార్ బయటపడ్డాడు. జీఎస్టీ పరిహారం చెల్లింపులో అన్యాయంపై ప్రధాని మోడీకి కేసీఆర్ ఘాటు లేఖ రాశారు. చట్ట ప్రకారం రెండు నెలలకోసారి బకాయిలు చెల్లించాలని కేసీఆర్ స్పష్టం చేశారు. లాక్ డౌన్ తో ఏప్రిల్ లో రాష్ట్ర ఆదాయం 83శాతం పడిపోయిందని లేఖలో కేసీఆర్ పేర్కొన్నారు. ఆదాయం తగ్గడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని.. వేతనాలు, ఖర్చులు అప్పులపై ఆధారపడాల్సి వస్తోందని సీఎం చెప్పారు. రాష్ట్రాలు అప్పులు తీసుకోమనడంపై కేసీఆర్ కరెక్ట్ కాదన్నారు.

కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో రాష్ట్రాలకు కేంద్రం అదనంగా సాయం చేయాల్సింది పోయి కోత పెడుతారని అని లేఖలో కేసీఆర్ ప్రశ్నించారు. రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం వృద్ధిలోకి వస్తుందని హితవు పలికారు.కేంద్రానికి ఆర్థికపరమైన వెసులుబాటు ఉంటుందని తెలిపారు.

ఈ క్రమంలోనే తెలంగాణ సహా రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం మొత్తాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. దీంతో కేరళ సీఎం తర్వాత మోడీని ప్రశ్నిస్తూ జీఎస్టీ విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కాస్త ఘాటుగానే స్పందించాడు.