https://oktelugu.com/

చేతులెత్తేసిన తెలంగాణ హై కోర్టు..! అక్కడికి వెళ్ళమని కేసీఆర్ కి సలహా

ఆంధ్ర-తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదం రోజు రోజుకీ ముదిరి పెద్దదవుతున్న నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు కేసీఆర్ ప్రభుత్వానికి భారీ షాక్ ఇచ్చింది. ఇది రెండు రాష్ట్రాలకు సంబంధించిన విషయం కాబట్టి దీనిలో తాము ఎలాంటి జోక్యం చేసుకోలేము అని చెప్పిన హైకోర్టు ఈ విషయంపై సుప్రీంకోర్టుని సంప్రదించవలసినదిగా కోరారు. జగన్…. కేసీఆర్ ఒకరిపై ఒకరు కంప్లైంట్ చేసుకోవడం తో చివరికి ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాల్సిన అవసరం వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ […]

Written By: , Updated On : September 1, 2020 / 06:00 PM IST
Follow us on

ఆంధ్ర-తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదం రోజు రోజుకీ ముదిరి పెద్దదవుతున్న నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు కేసీఆర్ ప్రభుత్వానికి భారీ షాక్ ఇచ్చింది. ఇది రెండు రాష్ట్రాలకు సంబంధించిన విషయం కాబట్టి దీనిలో తాము ఎలాంటి జోక్యం చేసుకోలేము అని చెప్పిన హైకోర్టు ఈ విషయంపై సుప్రీంకోర్టుని సంప్రదించవలసినదిగా కోరారు. జగన్…. కేసీఆర్ ఒకరిపై ఒకరు కంప్లైంట్ చేసుకోవడం తో చివరికి ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాల్సిన అవసరం వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ లోపల ఈ వివాదంలో పైచేయి సాధించేందుకు కేసీఆర్ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా కోర్టు వారు ఈ విధంగా చెప్పారు.

తమ నిర్ణయానికి ఊతంగా గతంలో జరిగిన ఒక పరిణామాన్ని గుర్తుచేస్తూ పంజాబ్ కి చెందిన నదీ జలాన్ని రాజస్థాన్ కు సుప్రీం కోర్టు జోక్యం ద్వారా మళ్ళించారని తెలిపారు. ఇకపోతే రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు ఏపీలో నిర్మాణం జరిగితే దక్షిణ తెలంగాణ ప్రాంతం అంతా ఎడారిగా మారిపోతుందన్నది తెలంగాణ ప్రభుత్వం వాదన. అయితే జగన్ ప్రభుత్వం మాత్రం వారికి కృష్ణ నది నుండి న్యాయబద్ధంగా రావాల్సిన నీటినే తాము ఈ ప్రాజెక్ట్ ద్వారా తీసుకుంటున్నామని చెబుతున్నారు.

తెలంగాణ వారేమో ఆంధ్రప్రదేశ్ 40వేల క్యూసెక్కుల నీటిని రాయలసీమకు తీసుకుంటుందని…. ఇది తమకు అన్యాయం చేసినట్లేనని వాదిస్తుంటే…. ఏపీ ప్రభుత్వం మాత్రం ఇదేమీ కొత్త పథకం కాదని… పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ నుండి ఎలాంటి నిబంధనలను ఉల్లంఘించకుండా తమ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం ఈ నీటిని తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇక ఈ విషయమై కృష్ణ నదీ జలాల బోర్డు వారు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, కేంద్రం కి చెందిన అపెక్స్ కౌన్సిల్ మధ్యర్తిత్వానికి పూనుకున్నా…. అన్నీ విఫలయత్నాలే అయ్యాయి. చివరికి సుప్రీంకోర్టు చొరవతో అయినా ఈ విషయం కొలిక్కి వస్తుందేమో చూడాలి.