KCR- BRS: తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ మూడో కూటమి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మొదటి అడుగుగా పార్టీ పేరును ప్రకటించారు. భారత్ రాష్ట్ర సమితిగా నామకరణం చేశారు. ఇక మీదట ఢిల్లీ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించనున్నట్లు చెబుతున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. బీజేపీకి ప్రత్యామ్నాయంగా కూటమి ఏర్పాటుకు కొద్ది కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో బాగంగానే దసరా రోజున భారత రాష్ట్ర సమితి ప్రకటించడంతో టీఆర్ఎస్ నేతల్లో హర్షం వ్యక్తమవుతోంది.

పార్టీ ఏర్పాటులో న్యాయపరమైన చిక్కులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందుకే కేవలం పార్టీ పేరు మాత్రమే ప్రకటించారు. పార్టీ జెండాపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. టీఆర్ఎస్ జెండా తెలంగాణ మ్యాప్ తో ఉంటుంది. అదే జాతీయ స్థాయిలో తెలంగాణ మ్యాప్ ఉంటే అందరు నవ్వుకుంటారనే ఉద్దేశంతో జాతీయ స్థాయి పార్టీలో జెండా, ఎజెండా ప్రత్యేకంగా ఉండాలని భావిస్తున్నారు. ఎన్నికల నాటికి అన్ని సమకూర్చుకుని పోటీలో నిలవాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నట్లు సమాచారం. దీంతో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని శత విధాలా ప్రయత్నాలు చేస్తున్నారు.
Also Read: AP Three Capitals Issue: ప్రజల్లో తేలిపోతున్న మూడు రాజధానుల ముచ్చట
పార్టీ పేరు మార్పునే ప్రధానంగా తీసుకుని కేసీఆర్ ముందుకు వెళ్తున్నారు. పేరును రిజిస్టర్ చేయించుకుని తద్వారా కార్యకలాపాలు నిర్వహించాలని చూస్తున్నారు. ఇందుకు గాను ఇప్పటికే పలువురు రాష్ట్రాల నేతలను కలిసి తన అభిప్రాయం వెల్లడించారు. దీంతో తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, పశ్చిమబెంగాల్, బిహార్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో పర్యటించి వారిని ఒప్పించినట్లు సమాచారం. దీంతో బీజేపీని నిలువరించాలని యోచిస్తున్నారు. కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో టీఆర్ఎస్ వర్గాలు సంబరాలు చేసుకున్నాయి. ఊరువాడా ర్యాలీలు నిర్వహించి దేశ్ కీ నేత కేసీఆర్ అంటూ నినాదాలు చేయడం గమనార్హం.

భారత ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని భారత రాష్ట్ర సమతి పార్టీ ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ తో దేశ రాజకీయాలనే మార్చాలనే ముందుకు నడుస్తున్నారు. అందరిని కలుపుకుని పోయేందుకు రెడీ అయ్యారు. ఎన్నికల సంఘం గుర్తింపు ఇచ్చాక పార్టీ విధివిధానాలు ఖరారు చేయాలని చూస్తున్నారని సమాచారం. పార్టీ గుర్తు కూడా కారు ఉండాలనే చూస్తున్నారని తెలుస్తోంది. కానీ ఎన్నికల సంఘం ఏది కేటాయిస్తే దాన్ని ఎన్నికల్లో గుర్తుగా పెట్టుకోవాలి. అంతేకాని మన ఇష్టం వచ్చిన దాన్ని పెట్టుకునే అవకాశం ఉండదు. అందుకే కేసీఆర్ న్యాయపరమైన చిక్కులు ఉండకుండా చూసుకునేందుకు వ్యూహాత్మకంగా కదులుతున్నట్లు చెబుతున్నారు.
Also Read: Impact Of BRS In AP: కేసీఆర్ బీఆర్ఎస్.. ఏపీ, జగన్ పై ప్రభావమెంత?