ఆ విషయంలో మోదీని ఫాలో అవుతున్న కేసీఆర్

కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు తప్పడం లేదు. గతంలో కాంగ్రెస్ నేతలు చేసిన తప్పులను ప్రత్యర్థులు నేడు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ చెందిన ముఖ్యనేతలను ఇతర పార్టీలు తమ నాయకుడిగా మలుచుకుంటున్నా ధైర్యంగా తిప్పికొట్టలేని ధైన్యస్థితిలో కాంగ్రెస్ అధిష్టానం వెళ్లడం శోచనీయంగా మారింది. భారత తొలి ఉప ప్రధాని, హోంమంత్రి వల్లభాయ్ పటేల్, మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుల ఇమేజ్ లను కాంగ్రెస్ పార్టీ సరైన విధంగా వాడుకోకపోవడం ప్రత్యర్థులకు వరంలా మారింది. Also […]

Written By: Neelambaram, Updated On : July 25, 2020 7:05 pm
Follow us on


కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు తప్పడం లేదు. గతంలో కాంగ్రెస్ నేతలు చేసిన తప్పులను ప్రత్యర్థులు నేడు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ చెందిన ముఖ్యనేతలను ఇతర పార్టీలు తమ నాయకుడిగా మలుచుకుంటున్నా ధైర్యంగా తిప్పికొట్టలేని ధైన్యస్థితిలో కాంగ్రెస్ అధిష్టానం వెళ్లడం శోచనీయంగా మారింది. భారత తొలి ఉప ప్రధాని, హోంమంత్రి వల్లభాయ్ పటేల్, మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుల ఇమేజ్ లను కాంగ్రెస్ పార్టీ సరైన విధంగా వాడుకోకపోవడం ప్రత్యర్థులకు వరంలా మారింది.

Also Read: కేసీఆర్ పై కోదండరాం పైచేయి సాధిస్తారా?

బీజేపీ కేంద్రంలోకి అధికారంలోకి వచ్చాక ప్రధాని మోదీ తన ప్రచారంలో ఎక్కువగా వల్లభాయ్ పటేల్ ప్రస్తావన తీసుకొచ్చేవారు. వల్లభాయ్ పటేల్ ఇమేజ్ ను మోదీ వాడుకున్నంతగా మరే నాయకుడు కూడా వాడుకోలేదనే చెప్పొచ్చు. గుజరాత్లోని నర్మదా నదీతీరంలో వల్లభాయ్ పటేల్ భారీ విగ్రహాన్ని ఆవిష్కరించి మోదీ అందరి దృష్టిని ఆకర్షించారు. కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబానికి చెందిన నాయకులకు తప్ప మరేవరికీ ప్రాధాన్యం ఇవ్వదనే సంకేతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు. ఇలా మొత్తంగా వల్లభాయ్ పటేల్ ఇమేజ్ ను మొత్తాన్ని బీజేపీ హైజాక్ చేసింది. తమ పార్టీ నాయకుడిని బీజేపీ అంతలా వాడుకుంటున్నా కాంగ్రెస్ ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలోకి వెళ్లింది.

తాజాగా సీఎం కేసీఆర్ కూడా మోదీ బాటలోనే వెళుతున్నారు. మోదీ ఏవిధంగానైతే వల్లభయ్ పటేల్ ను కాంగ్రెస్ దూరంచేసి లబ్ధిపొందేరో సేమ్ టూ సేమ్ కేసీఆర్ అదే ప్లాన్ వర్కౌట్ చేస్తున్నారు. తెలంగాణ బిడ్డ పీవీ నర్సింహారావును కేసీఆర్ భుజాన వేసుకుంటున్నారు. పీవీ శతజయంతి ఉత్సవాలను ఏడాదిపాటు నిర్వహిస్తామంటూ కేసీఆర్ ప్రకటించారు. అంతేకాకుండా పీవీ కూతురుకు ఎమెల్సీ పదవీ కట్టబెట్టి పీవీ నర్సింహారావుపై తనకున్న చిత్తశుద్ధిని చాటాలనుకుంటున్నారు. జాతీయ నాయకుడైన పీవీని కేసీఆర్ ఒన్ చేసుకోవడం ద్వారా తెలంగాణతోపాటు జాతీయ స్థాయిలో టీఆర్ఎస్ కు అడ్వాంటేజ్ కానుంది.

Also Read: రాజధాని రైతులపై పవన్ కి చిత్తశుద్ధి ఉందా?

ఈ పరిణామాలను స్థానిక నేతలు కాంగ్రెస్ అధిష్టానం దృష్టికెళ్లారు. దీంతో తాజాగా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీలు సైతం పీవీ కాంగ్రెస్ నాయకుడని, ఆయనను కొనియాడుతూ తెలంగాణ పీపీసీకి లేఖరాశారు. దీనిని ఉత్తమ్ కుమార్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ చదివి విన్పించారు. తెలంగాణవాడైన పీవీని ప్రధాని చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని స్థానిక నేతలు చెబుతుండగా టీఆర్ఎస్ నేతలు మాత్రం పీవీకి కాంగ్రెస్ సరైన గౌరవం ఇవ్వలేదని అంటున్నారు.

ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ తమ నాయకులపట్ల చేసిన నిర్లక్ష్యం ఇప్పుడు ఆ పార్టీకి శాపంగా మారుతోంది. దీంతో కాంగ్రెస్ చెందిన వల్లభయ్ పటేల్, పీవీ నర్సింహారావులు ఇతర పార్టీలకు ఆరాధ్యులుగా కాంగ్రెస్ కు విలన్లుగా మారుతున్నారు. మోదీ, కేసీఆర్ లు కాంగ్రెస్ నేతలను తమకు అనుకూలంగా మలుచుకుంటూ ఆపార్టీకే చెక్ పెడుతుండటం గమనార్హం. ఒకే దెబ్బకు రెండుపిట్టలంటే ఇదే కాబోలు..!