Homeజాతీయ వార్తలుCM KCR: సారూ.. ఇది న్యాయమేనా? తెలంగాణ ప్రజల సొమ్ముతో పార్టీ పనులు చేస్తున్న కేసీఆర్‌..!

CM KCR: సారూ.. ఇది న్యాయమేనా? తెలంగాణ ప్రజల సొమ్ముతో పార్టీ పనులు చేస్తున్న కేసీఆర్‌..!

CM KCR: ‘కేసీఆర్‌.. నీకు జాతీయ రాజకీయాలపై మోసు కలుగొచ్చు.. ప్రధాని కావాలన్న ఆకాంక్ష నీలో పుట్టొచ్చు.. అందుకోసమే జాతీయ పార్టీ పెడ్డి ఉండవచ్చు.. అందుకోసం దేశవ్యాప్తంగా పార్టీ కార్యాలయాలు పెట్టుకోవచ్చు.. దీనికి ఎవరూ అడ్డుచెప్పరు.. కానీ ఎవడబ్బ సొమ్మని నీ పార్టీకి ప్రజాధనం ఖర్చు పెడుతున్నవ్‌.. తెలంగాణ ఏమన్నా నీ జాగీరా.. నీ అయ్య జాగీరా.. తల్లికి అన్నం పెట్టనోడు పిన్నమకు బంగారు గాజులు చేయిస్తానన్నాడట.. అట్టుంది నీ యవ్వారం. తెలంగాణలో పంటలు నీటమునిగి నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వడానికి చేతులురాని నీకు తెలంగాణ ప్రజల సొమ్ముతో పారీ పనులు చేసుకునే అధికారం ఎక్కడిది.. ఎవడిచ్చాడు. దొరా.. ఇది న్యాయమేనా..? అని ప్రశ్నిస్తోంది తెలంగాణ సమాజం. జాతీయ రాజకీయాల కోసం టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చిన కేసీఆర్‌ ఈనెల 14న ఢిల్లీలో పార్టీ కేంద్ర కార్యాలయం ప్రారంభించనున్నారు. ఈమేరకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేక విమానాలు బుక్‌చేశారు. ఇందుకు ఖర్చుపెట్టేదంతా తెలంగాణ ప్రజల సొమ్మే.

CM KCR
CM KCR

 ప్రజాధనంతో పార్టీ పనులు..
తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావు సోమవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీలో కొత్తగా నిర్మించిన జాతీయ పార్టీ బీఆర్‌ ఎస్‌ కార్యాలయాన్ని ఆయన ఈ నెల 14వ తేదీన అట్టహాసంగా ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఆయన బయల్దేరారు. పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి తెలంగాణ నుంచే కాకుండా.. కర్ణాటక, తమిళనాడు, బిహార్, యూపీల నుంచి కూడా పలువురు కీలక నేతలను కేసీఆర్‌ ఆహ్వానించారు. పార్టీ కార్యాలయంలో హోమం నిర్వహించేందుకు భారీగా ఏర్పాట్లు చేశారు. ఢిల్లీ నగరాన్ని గులాబీ ఫ్లెక్సీలతో నింపేశారు. ఈ పనులన్నీ ఎంపీ సంతోష్, మంత్రి ప్రశాంత్‌రెడ్డి పర్యవేక్షిస్తున్నారు.

నేతల కోసం ప్రత్యేక ఫ్లైట్లు..
బీఆర్‌ఎస్‌ కేంద్ర కార్యాలం ప్రారంభోత్సవానికి ఆహ్వానించిన నేతలు ఢిల్లీకి రావడానికి, వారు ఢిల్లీలో బస చేయడానికి అవసరమయ్యే ఖర్చులు కూడా కేసీఆర్‌ పెట్టుకుంటున్నారు. నేతలు ఢిల్లీ ప్రత్యేకంగా విమానాలనే బుక్‌ చేసినట్టు ప్రగతి భవన్‌వర్గాలు చెబుతున్నాయి. కర్ణాటక నుంచి ఒకటి, తెలంగాణ నుంచి 13వ తేదీ మధ్యాహ్నం ఒకటి, తమిళనాడు నుంచి అదే రోజు ఉదయం ఒక ప్రత్యేక విమానం ఢిల్లీ వెళ్లనుందని సమాచారం. దీనిలో ఎంపిక చేసిన కొందరు జాతీయ నాయకులు, సీపీఐ నేతలు కూడా వెళ్తున్నారని తెలుస్తోంది. వీరికి రాను పోను ఖర్చులతోపాటు.. ఢిల్లీలో ప్రత్యేక వసతి ఏర్పాట్లు చేసినట్టు ప్రగతి భవన్‌ వర్గాలు తెలిపాయి. ఇదంతా బీఆర్‌ఎస్‌ పార్టీ సొమ్మో కేసీఆర్‌ కష్టపడి సంపాదించిందో కాదని తెలిసింది. ఇదంతా తెలంగాణ ఖజానా నుంచే ఖర్చు చేస్తున్నారు.

యాగానికి భారీగా ఏర్పాట్లు..
కేసీఆర్‌కు పూజలు, యాగాలపై నమ్మకం ఎక్కువ. ఏదైనా కొత్త పని ప్రారంభించే ముందు యాగం చేయడం ఆయనకు అలవాటు. ఈ క్రమంలో ఢిల్లీలోని సర్దార్‌ పటేల్‌మార్గ్‌లో పార్టీ కార్యాలయ ప్రారంభం సందర్భంగా యాగం నిర్వహించనున్నారు. ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ సంతోష్‌ కుమార్, వాస్తు సలహాదారు సుద్దాల సుధాకర్‌ తేజ తదితరులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. భారీగా ఏర్పాట్లుల చేస్తున్నారు. మూడు యాగాలు కేసీఆర్‌ నిర్వహిస్తారని తెలిసింది. 14వ తేదీ యాగంతో పాటు ప్రారంభోత్సవానికి చెందిన ఏర్పాట్లు, కార్యాలయంలో అవసరమైన ఫర్నీచర్‌ వంటి వాటిని పరిశీలించారు. ఇక, అదేరోజు లేదా తెల్లవారి కేసీఆర్‌ జాతీయ మీడియాతో మాట్లాడనున్నట్టు తెలుస్తోంది.

CM KCR
CM KCR

ఢిల్లీ పర్యటనకు వెళ్లిన కేసీఆర్‌.. రాష్ట్ర ప్రభుత్వ పనుల కోసం కాదు. తన సొంత పార్టీ పనుల మీదనే వెళ్లటం తెలిసిందే. టీఆర్‌ఎస్‌ ను బీఆర్‌ఎస్‌ గా మార్చిన నేపథ్యంలో.. పార్టీ ఢిల్లీ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు ఆయన ఢిల్లీ వెళ్లారు. సోమవారం సాయంత్రం బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో భార్య, మనమడితో ఢిల్లీ వెళ్లారు. మరి.. పార్టీ పని మీద ఢిల్లీకి వెళ్లినప్పుడు.. అందునా ప్రత్యేక విమానంలో అయినప్పుడు ఆ ఖర్చు ఎవరి ఖాతాలోది? అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular