KCR- Aasara Pensions: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇన్నాళ్లుగా వేచి చూసిన పింఛన్ల పథకంలో కొత్తగా పేర్లు చేర్చుకున్న వారికి ఇచ్చేందుకు ఓకే చెప్పింది. ఈ మేరకు సీఎం కేసీఆర్ ప్రకటన చేశారు. దీంతో రాష్ట్రంలో రాజకీయాలు మారనున్నాయని తెలుస్తోంది. ఈమేరకు పరిణామాలు మారనున్నాయని సమాచారం. దీంతో రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లడం ఖాయమనే వాదనలు కూడా వస్తున్నాయి. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం రోజు కొత్త పింఛన్లు అందజేస్తామని చెబుతున్నారు.

ఈ సారి కొత్తగా డయాలసిస్ రోగులకు కూడా ఆసరా పింఛన్లు ఇచ్చేందుకు సీఎం అంగీకరించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డయాలసిస్ పేషెంట్లకు ఈ నెల నుంచి ఆసరా పింఛన్లు రానున్నాయి. ఈ నేపథ్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేదిక మీద ఎమ్మెల్యేలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీంతో సీఎం కేసీఆర్ మునుగోడు ఉప ఎన్నికపై ముందస్తుకు వెళతారా? అనే దానిపై ప్రశ్నలు వస్తున్నాయి. ఇందు కోసమే కొత్త పింఛన్ల పంపిణీ చేసేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం.
Also Read: MP Gorantla Madhav Issue: గోరంట్ల మాధవ్ పై చర్యలకు మీనమేషాలు ..వైసీపీకి తప్పదు భారీ మూల్యం
కొత్తగా వచ్చే పింఛన్లకు వయసు 57 సంవత్సరాలుగా నిర్ణయించారు. దీంతో కొత్తగా 10 లక్షల మందికి కొత్తగా పింఛన్లు అందనున్నాయి. ఇప్పటికే 36 లక్షల మందికి పింఛన్లు అందుతుండగా ఈ కొత్తగా వచ్చే 10 లక్షల మందితో మొత్తం 46 లక్షల మంది లబ్ధిదారులు కానున్నారు. బోధకాలు రోగులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికురాళ్లు, వృద్ధులు, వికలాంగులకు పింఛన్లు అందుతున్నాయి. కొత్తగా డయాలసిస్ పేషెంట్లకు కూడా అందించనున్నారు. వీరు 12 వేల మంది ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో 46 లక్షల మందికి పింఛన్లు అందించనున్నట్లు తెలుస్తోంది.

దీంతో పింఛన్లు అందజేసి ఓటర్లను తమ వైపు తిప్పుకోవాలని టీఆర్ఎస్ పార్టీ భావిస్తోందని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. అధికార పార్టీ ఎన్ని కుట్రలు చేసినా చివరకు గెలిచేది బీజేపీయేనని తెలుస్తోంది. ఈ క్రమంలో టీఆర్ఎస్ నిర్ణయంతో రాజకీయంగా ఇంకా ఏవైనా పరిణామాలు చోటు చేసుకుంటాయో ఏమోననే ఆలోచన అందరిలో వస్తోంది. కేసీఆర్ ముందస్తు వ్యూహంతోనే పింఛన్ల ప్రణాళికకు రూపం పోసిందని చెబుతున్నారు. మునుగోడు భయం మాత్రం పార్టీల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నట్లు విశ్లేషకుల అభిప్రాయం.
Also Read:Chandrababu- BJP: చంద్రబాబుకు బీజేపీ స్నేహహస్తం.. మొత్తబడుతున్న కేంద్ర పెద్దలు
[…] […]
[…] […]