‘నాంది’ అంటూ అల్లరి నరేష్ తన అదృష్టాన్ని వెతుక్కుంటూ చేస్తోన్న తన 57వ చిత్రం ఈ సినిమా. ఇప్పటివరకూ ఎక్కువ శాతం సినిమాల్లో ప్రేక్షకులకు నవ్వులు పంచుతూ వచ్చిన అల్లరి నరేష్, ఈ సారి ఏడిపించడానికి సిద్ధం అవుతున్నాడు. గతంలో గమ్యం లాంటి సినిమాలో తన ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నా.. ఆ తరువాత మళ్ళీ ఆ రేంజ్ ఎమోషనల్ సినిమా చేయలేదు. ఇన్నేళ్లకు నాంది చేస్తున్నాడు. ఇక ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే 80 శాతం షూటింగ్ పూర్తయింది. మిగిలిన బ్యాలెన్స్ షూట్ కూడా పూర్తి చేసి.. ఓటీటీలో తమ సినిమాని రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేసుకున్నారు.
Also Read: ఖాకీ చొక్కా వేస్తున్న మరో మెగా హీరో
అందుకే కరోనా కాలంలో కూడా ఇటీవల హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ ని కూడా స్టార్ట్ చేశారు. అయితే మూడు రోజులు షూట్ చేశాక సడెన్ గా షూట్ ఆపేశారు. షూటింగ్ ను ఎందుకు ఆపేశారో చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వకపోయే సరికి, ఈ చిత్ర యూనిట్ కు కరోనా సోకిందని అందుకే షూట్ మధ్యలోనే ఆపేశారు అని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. మొత్తానికి తాజాగా చిత్ర బృందం ఆ ప్రచారం పై క్లారిటీ ఇచ్చింది. ఇలాంటి అవాస్తవాలను దయచేసి ప్రచారం చేయవద్దని, అలాగే ప్రజలు కూడా దయచేసి వదంతులను నమ్మవద్దనీ నాంది మేకర్స్ కోరారు. తాము గత బుధవారం వర్షం రావడం కారణంగానే మా సినిమా చిత్రీకరణ నిలిపివేసామని.. అంతేగాని వేరే కారణంతో షూటింగ్ ని ఆపలేదని మేకర్స్ స్పష్టం చేశారు.
Also Read: సుశాంత్ ప్రియురాలు రియా గుట్టు రట్టు?
ఇక గత కొన్నేళ్లుగా వరుస పరాజయాలతో బాక్సాపీస్ వద్ద ప్లాప్ హీరోగా సతమతవుతున్న అల్లరి నరేష్ కెరీర్ కి, ఈ నాంది సినిమా అత్యంత కీలకమైనది. విజయ్ కనకమేడల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా పై ప్రేక్షకుల్లో బాగానే ఆసక్తి ఉన్నా.. కామెడీ జానర్లో సినిమాలు చేసే నరేష్ మీద ఇలాంటి సీరియస్ క్రైమ్ డ్రామా ఎంతవరకు వర్కౌట్ అవుతుందనేది చూడాలి. అయితే గతంలో అల్లరి నరేష్ ‘నేను, విశాఖ ఎక్స్ ప్రెస్, గమ్యం, శంభో శివ శంభో’ లాంటి ఇంటెన్స్ చిత్రాలను చేశాడు. వాటి వల్ల అల్లరి నరేష్ కెరీర్ కి పెద్దగా ప్రయోజనం అయితే కలగలేదు.