KCR: తెలంగాణలో సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళతారనే ప్రచారం కొద్దిరోజులుగా సాగుతోంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇదే విషయాన్ని పలుమార్లు గుర్తుచేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అది నిజమే అనిపిస్తోంది. టీఆర్ఎస్ పై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోతోందని తెలుస్తోంది. దీనికి తాజా ఉదాహరణే హుజురాబాద్ ఉప ఎన్నిక. ఎన్ని హామీలు ఇచ్చినా జనం మాత్రం టీఆర్ఎస్ ను తిరస్కరించడంతో కేసీఆర్ డైలమాలో పడ్డారు పార్టీని గాడిలో పెట్టే ప్రయత్నాల్లో భాగంగా పలు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇందులో భాగంగా జిల్లాల్లో పర్యటిస్తూ కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీలో నెలకొన్న అసంతృప్తిని లేకుండా చేయాలనే ఉద్దేశంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకోనున్నారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరగడంతో పార్టీలో కార్యకర్తలకు ఆగ్రహం పెరుగుతోందని గుర్తించారు. దీంతో వారిలోని కోపాన్ని పోగొట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. దీని కోసం జిల్లాల్లో పర్యటించి వారిని మచ్చిక చేసుకునే విధంగా పావులు కదుపుతున్నట్లు సమాచారం.
రాష్ర్టంలో ప్రతిపక్షాలు పుంజుకునే అవకాశాలున్నాయని కేసీఆర్ లో భయం పట్టుకుంది. దీంతో ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే బీజేపీ ఎదుగుదలను అడ్డుకునేందుకు పలు మార్గాలు అన్వేషిస్తున్నారు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను దూరం చేసేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీని కోసమే పలు వ్యూహాలు ఖరారు చేస్తున్నట్లు సమాచారం.
Also Read: Omicron: తెలంగాణలో ఎంటరైన ‘ఒమిక్రాన్’.. హై అలర్ట్ ప్రకటించిన వైద్యారోగ్య శాఖ!
గతంలో ప్రకటించిన దళితబంధును రాష్ర్టమంతటా విస్తరించి ప్రతిపక్షాల విమర్శలకు చెక్ పెట్టాలని భావిస్తున్నారు. దీంతో పాటు మైనార్టీలను సైతం మచ్చిక చేసుకునేందుకు వారికి కూడా పలు పథకాలు ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ర్టంలో చోటు చేసుకుంటున్న పరిణామాలను సునిశితంగా పరిశీలిస్తూ వాటికి అనుగుణంగా పథకాలు తీసుకొచ్చి ప్రజలను తమ వైపుకు తిప్పుకునే పనిలో పడినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఎంత లబ్ధి పొందుతారో వేచి చూడాల్సిందే.
Also Read: Gutha Sukender Reddy: గుత్తాకు కేసీఆర్ ఝలక్ యేనా?