Trivikram Wife: త్రివిక్రమ్ సినిమాలు ఎంత క్లాస్‌గా ఉంటాయో.. ఆయన రాసే మాటలు మాస్‌గా తూటాల్లా దూసుకెళ్లిపోతుంటాయి. రచయితగా టాలీవుడ్లో అడుగుపెట్టి.. ఇప్పుడు అత్యంత ప్రభావవంతమైన దర్శకుల్లో ఒకరిగా చలామని అవుతున్నారు. కాగా, త్రివిక్రమ్ భార్య సౌజన్య గురించి అందరికీ తెలిసిందే. ఆమె మంచి క్లాసికల్ డాన్సర్. ప్రస్తుతం మీనాక్షి కళ్యాణం అనే శాశ్త్రీయ నృత్య నాటక ప్రదర్శన ఇచ్చేందుకు సిద్ధమయ్యారు సౌజన్య శ్రీనివాస్. ఈ ప్రదర్శన డిసెంబరు 2న జరగాల్సి ఉండగా.. ఆమె బాబాయ్ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అకస్మాత్తుగా మరణించడంతో ఈ నాట్య ప్రదర్శన వాయిదా పడింది.
Also Read: చిరుకి ఏమైంది ? వారికెలా ఛాన్స్ ఇస్తున్నాడు ?
తాజాగా, ఈ ప్రదర్శనను రేపు సాయంత్రం 6 గంటలకు శిల్పకళావేదిగా జరగనుంది. పసుమర్తి రామలింగ శాస్త్రి ఈ కార్యక్రమానికి దర్శకత్వం వహించనున్నారు. హారిక అండ్ హాసిని ప్రొడక్షన్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ కలసి ఈ ఈవెంట్‌ను అందిస్తున్నాయి. తాజాగా, ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్లో దేవిక భంగిమలో సౌజన్య దర్శనమిచ్చింది. ఈ వేడుకకు పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఆయనతో పాటు గౌరవ అతిథిగా తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ కూడా పాల్గొననున్నారు. వీరితో పాటు తనికెళ్ల భరణి, త్రివిక్రమ్, సురేశ్, సతీశ్ చంద్ర గుప్తా తదితరులు హాజరు కానున్నారు
త్రివిక్రమ్, సౌజన్యల వివాహం కూడా ఓ సినిమా లెవెల్లో జరిగింది. అక్కను చూసేందుకు వచ్చి చెల్లిని ఇష్టపడి.. ఇంట్లో వాళ్లను ఒప్పింది పెళ్లి చేసుకున్నాడు త్రివిక్రమ్. ప్రస్తుతం వీరికి ఇద్దరు సంతానం.
Also Read: అల్లు అర్జున్ “పుష్ప” చిత్ర బృందానికి మెగాస్టార్ చిరంజీవి విషెస్…
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Pawan kalyan as chief guest for trivikrams wifes dance play
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com