https://oktelugu.com/

కేసీఆర్ నిరక్ష్యమే.. కరోనా కేసులు పెరగడానికి కారణమా?

రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వ యంత్రాంగం కరోనా కట్టడికి ఎంతో కృషి చేస్తున్నా పాజిటివ్ సంఖ్యలు పెరగడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతోన్నాయి. తెలంగాణలో కరోనా ఎంట్రీ ఇచ్చిన తొలినాళ్లలో ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యమే ప్రస్తుతం ప్రభావం చూపుతున్నట్లు కన్పిస్తోంది. కరోనా కట్టడి చేయాల్సిన సమయంలో మీనమేషాలు లెక్కించి ప్రస్తుతం కరోనా కట్టడిపై కేసీఆర్ ప్రభుత్వం హడావుడి చేస్తోందని పలువర్గాల నుంచి విమర్శలు వ్యక్తమవుతోన్నాయి. ప్రస్తుతం తెలంగాణాలో కరోనా కేసులు వెయ్యికి చేరువలో […]

Written By:
  • Neelambaram
  • , Updated On : April 23, 2020 / 03:02 PM IST
    Follow us on

    రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వ యంత్రాంగం కరోనా కట్టడికి ఎంతో కృషి చేస్తున్నా పాజిటివ్ సంఖ్యలు పెరగడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతోన్నాయి. తెలంగాణలో కరోనా ఎంట్రీ ఇచ్చిన తొలినాళ్లలో ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యమే ప్రస్తుతం ప్రభావం చూపుతున్నట్లు కన్పిస్తోంది. కరోనా కట్టడి చేయాల్సిన సమయంలో మీనమేషాలు లెక్కించి ప్రస్తుతం కరోనా కట్టడిపై కేసీఆర్ ప్రభుత్వం హడావుడి చేస్తోందని పలువర్గాల నుంచి విమర్శలు వ్యక్తమవుతోన్నాయి. ప్రస్తుతం తెలంగాణాలో కరోనా కేసులు వెయ్యికి చేరువలో ఉండటం గమనార్హం.

    హైదరాబాద్, నిజామాబాద్, సూర్యపేట, ఆదిలాబాద్, నల్లొండ జిల్లాల్లో పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ జిల్లాల్లో కేసులను పరిశీలిస్తే ఇక్కడ కరోనా మూడోదశకు చేరిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతోన్నాయి. ఇక్కడ కమ్యూనల్ స్పెడ్ జరిగినట్లుగా కన్పిస్తోంది. తెలంగాణ ఒకటి, రెండు దశల్లో ఉన్నప్పుడు తేలికగా కట్టడి చేయాల్సిన ప్రభుత్వం ఆలస్యం చేసినందునే ఇక్కడి కేసుల సంఖ్య పెరగటానికి దోహదపడినట్లుగా కన్పిస్తోందని యువ తెలంగాణ పార్టీ నాయకులు రాణి రుద్రమదేవి అన్నారు.

    కరోనాకు మతం, కులం లేదని అయితే ఢిల్లీలోని మర్కజ్ వెళ్లిన వారి వివరాలను సేకరించి కరోనా టెస్టు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. మన పక్కనే ఉన్న ఏపీ ప్రభుత్వం మర్కజ్ వెళ్లిన వివరాలను ఫొటోలతో సహా విడుదల చేస్తే తెలంగాణలో మాత్రం ఢిల్లీకి వెళ్లొచ్చిన వివరాలను విడుదల చేయలేదన్నారు. ప్రభుత్వం ముస్లిం ఓటు బ్యాంకు కోణంలో చూసి కరోనాను తేలికగా తీసుకోవడం వల్లనే నేడు కరోనా కేసులు పెరిగిపోవడం కారణమని ఆమె ఆరోపించారు.

    మర్కజ్ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారి వివరాలను తెలంగాణ ప్రభుత్వం నెలరోజులైనా ఇంకా అధికారికంగా ప్రకటించలేదన్నారు. తెలంగాణలో పెద్ద ఇంటలిజెన్స్ వ్యవస్థ ఉన్నా వారి వివరాలను సేకరించకపోవడం శోచనీయమన్నారు. దేశంలో నెంబర్ సీఎం అని చెప్పుకునే సీఎం.. దేశంలో నెంబర్ పరిపాలన చేస్తున్నామని చెప్పుకునే నాయకులు కనీసం మర్కజ్ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వివరాలను ప్రకటించకపోవడం సిగ్గుచేటన్నారు. తెలంగాణలో ముస్లిం జనాభా 14శాతమేనని కేరళలో ముస్లిం జనాభా 27శాతమని రాణి రుద్రమ పేర్కొన్నారు. కేరళను చూసి కేసీఆర్ గురించి చాలా నేర్చుకోవాలని హితవు పలికారు.

    అక్కడి తెలంగాణ ముందే కరోనా పాజిటివ్ కేసులు వచ్చినట్లు తెలిపారు. అక్కడి ప్రభుత్వం ముస్లిం మతపెద్దలతో మాట్లాడి ఢిల్లీ వెళ్లొచ్చిన వారు కరోనా టెస్టు చేసుకోవాలని పిలుపునిచ్చింది. కానీ తెలంగాణలో అలాంటి ప్రయత్నం జరుగలేదన్నారు. ఎవరైనా విమర్శిస్తే వారిని దుర్భాషలాడం ఒక్కేటే కేసీఆర్ కు తెలుసని ఆమె విమర్శించింది. ఇక పోలీసులు రోడ్లపైకి వస్తే సామాన్యులపై ప్రతాపం చూపుతున్నారని అన్నారు. ప్రభుత్వం మాత్రం ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టకుండా సామాన్యులపై ప్రతాపం చూపడం ఏంటని ప్రశ్నించారు.

    కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న హైదరాబాద్లో సూర్యపేటలో కమ్యూనల్ స్పెడ్ జరిగినట్లు తెలుస్తోందని ఆమె అన్నారు. మర్కజ్ వెళ్లొచ్చిన ఓ వ్యాపారి వల్ల కమ్యూనల్ స్పెడ్ జరిగినట్లు తేలింది. ప్రభుత్వం తొలినాళ్లలో మర్కజ్ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారిని పూర్తిగా కట్టడి చేసినట్లయితే ఈ కేసుల సంఖ్య ఇంతలా పెరిగి ఉండేది కాదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. హిందువులైనా, ముస్లింలైనా ఢిల్లీకి వెళ్లొచ్చిన వారు కరోనా టెస్టు చేయించుకోవాలని యువ తెలంగాణ పార్టీ తరుపున ఆమె కోరారు.

    ఇక తెలంగాణలో కరోనా పరీక్షలు అంతంత మాత్రంగానే జరుగుతున్నాయని ఆమె అన్నారు. కేంద్రం చేస్తున్న టెస్టుల సంఖ్యతో తెలంగాణలో రోజువారీ టెస్టులు ఎక్కువ చేస్తున్నామని కేసీఆర్ చెబుతున్నా క్షేత్రస్థాయిలో జరగడం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం క్వారంటైన్ పీరియడ్ 14రోజుల నుంచి 28రోజులకు పెంచడంపై కూడా పలు అనుమానాలున్నాయని అన్నారు. తెలంగాణలో కరోనా కట్టడిలో లేనందునే క్వారంటైన్ పీరియాడ్ పెంచారా? లేక ముందస్తు చర్యల్లో భాగంగా పెంచరా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏదిఏమైనా తొలినాళ్లలో చేసిన నిర్లక్ష్యమే కొన్ని జిల్లాల్లో నేడు కేసులు సంఖ్య భారీగా పెరగడానికి కారణమైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

    https://www.youtube.com/watch?v=8sq985QIQz4