https://oktelugu.com/

RTC and Current Charges: కేసీఆర్ చార్జీల మోత.. ప్రజా వ్యతిరేకత తప్పదా?

RTC and Current Charges: ప్రభుత్వం ఆర్టీసీ, విద్యుత్ సంస్థల మనుగడ కోసం కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. సంస్థలు నష్టాల బాట పడుతున్న క్రమంలో చార్జీలు పెంచక తప్పని పరిస్థితి. ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు స్వీకరించాక మొదటి టాస్క్ గా చార్జీలు పెంచాలనే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. దీంతో అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అన్ని పనులు పూర్తయ్యాయి. కసరత్తులు అయిపోయినట్లు తెలుస్తోంది. దీంతో ప్రజలపై పెనుభారం పడనుంది. విద్యుత్ చార్జీలు […]

Written By: , Updated On : September 22, 2021 / 12:01 PM IST
Follow us on

RTC and Current ChargesRTC and Current Charges: ప్రభుత్వం ఆర్టీసీ, విద్యుత్ సంస్థల మనుగడ కోసం కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. సంస్థలు నష్టాల బాట పడుతున్న క్రమంలో చార్జీలు పెంచక తప్పని పరిస్థితి. ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు స్వీకరించాక మొదటి టాస్క్ గా చార్జీలు పెంచాలనే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. దీంతో అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అన్ని పనులు పూర్తయ్యాయి. కసరత్తులు అయిపోయినట్లు తెలుస్తోంది. దీంతో ప్రజలపై పెనుభారం పడనుంది.

విద్యుత్ చార్జీలు పెంచాలని కొంత కాలంగా ఉద్యోగులు చెబుతున్నారు. సంస్థ నష్టాల్లోకి వెళుతున్న క్రమంలో ఆదుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో ప్రజలపైనే భారం పడనుంది. ఆర్టీసీకి కానీ, విద్యుత్ సంస్థలకు కానీ ప్రభుత్వం ఎలాంటి సాయం చేయడం లేదు. దీంతో భారం ప్రజలపైనే పడే అవకాశాలున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం కూడా ప్రజలే భరించాలని చూస్తోంది.

హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఇప్పుడే చార్జీలు పెంచే అవకాశాలు ఉండవని తెలుస్తోంది. ఒకవేళ చార్జీలు పెంచితే అక్కడ ప్రతికూల ప్రభావాలు ఏర్పడతాయనే భావంతోనే చార్జీల పెంపు ప్రతిపాదన కొంతకాలం పాటు వాయిదా వేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రజలు ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని చార్జీలను ఇప్పుడే పెంచేందుకు సాహసం చేయదని చెబుతున్నారు. కానీ భవిష్యత్తులో మాత్రం చార్జీల పెంపు అనివార్యమనే తెలుస్తోంది.

ఏ ప్రభుత్వం వచ్చినా సామాన్యుడినే లక్ష్యంగా చేసుకుని వడ్డనలు వడ్డించడం పరిపాటే. దీంతో ప్రజలపై పడే భారంతో మధ్యతరగతిపై ప్రభావం పడే సూచనలు ఉన్నాయి. అయినా ప్రభుత్వం మాత్రం తన మాట నెగ్గించుకునే క్రమంలోనే ప్రజలపై చార్జీల భారం వేసేందకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వ ప్రతిపాదన ఎంత మేరకు ఫలితం సాధించేలా చేస్తుందో అర్థం కావడం లేదు.