https://oktelugu.com/

Republic Movie Trailer: ప్రభుత్వం వర్సెస్ కలెక్టర్ సాయితేజ్.. గెలుపెవరిది?

Republic Movie Trailer: మెగా హీరో సాయిధరమ్ తేజ్(Sai dharam Tej) హీరోగా నటించిన సీరియస్ పాలిటిక్స్ మూవీ ‘రిపబ్లిక్’. ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో ఉన్న సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం కోలుకుంటున్నారు. అయితే ఆయన నటించిన ఈ చిత్రం ట్రైలర్ ను మాత్రం తాజాగా మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ లో ప్రభుత్వాన్ని ఎదురించిన ఓ కలెక్టర్.. చివరకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? ఎలా అధిగమించాడన్నది ఆసక్తిగా […]

Written By:
  • NARESH
  • , Updated On : September 22, 2021 / 12:03 PM IST
    Follow us on

    Republic Movie Trailer: మెగా హీరో సాయిధరమ్ తేజ్(Sai dharam Tej) హీరోగా నటించిన సీరియస్ పాలిటిక్స్ మూవీ ‘రిపబ్లిక్’. ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో ఉన్న సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం కోలుకుంటున్నారు. అయితే ఆయన నటించిన ఈ చిత్రం ట్రైలర్ ను మాత్రం తాజాగా మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ లో ప్రభుత్వాన్ని ఎదురించిన ఓ కలెక్టర్.. చివరకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? ఎలా అధిగమించాడన్నది ఆసక్తిగా చూపించారు.

    దేవా కట్ట దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సాయితేజ్ పవర్ ఫుల్ కలెక్టర్ గా నటించాడు.ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్. అక్టోబర్ 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

    ప్రజాస్వామ్యంలో రాజకీయ వ్యవస్థ అవినీతి కారణంగా ప్రజలు ఎలా ఇబ్బందులు పడుతున్నారన్న మెయిల్ కథతో ఈ సినిమా రూపొందించారని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. సీఎంగా రమ్యక్రిష్ణ , విలన్ గా రాజకీయ రౌడీగా జగపతి బాబు ఇరగదీసి నటించారు. ఇక సాయితేజ్ పవర్ ఫుల్ కలెక్టర్ గా చెబుతున్న డైలాగులు.. ఎదురిస్తున్న తీరు నిజంగానే సినిమాపై అంచనాలు పెంచేశాయి. ముఖ్యంగా సినిమాలోని మాటలు ఆలోచింపచేసేలా ఉన్నాయి.

    గాడితప్పిన ప్రభుత్వ వ్యవస్థను ఈరోజు ఎదురించి ప్రశ్నిస్తోంది పరిపాలన వ్యవస్థ. దానికి న్యాయవ్యవస్థ కూడా ఎదురించి నిలుచొని కళ్లెం వేసినప్పుడే అసలైన రిపబ్లిక్ అంటూ సాయిధరమ్ తేజ్ చెప్పిన డైలాగ్ ను బట్టి ఈ సినిమా సీరియస్ పాలిటిక్స్ పై సంధించిన అస్త్రంగా చెప్పొచ్చు. మరి ట్రైలర్ ఇంత ఆసక్తిగా ఉంటే సినిమా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

    ఈ ట్రైలర్ విడుదల చేసిన అనంతరం హీరోగా నటించిన సాయిధరమ్ ఆరోగ్య పరిస్థితి గురించి చిరంజీవి మాట్లాడారు. ‘సాయిధరమ్ తేజ్ వేగంగా కోలుకుంటున్నాడని.. అక్టోబర్ 1న విడుదల చేయాలని అతడే కోరాడని చిరంజీవి తెలిపారు.