తెలుగురాష్ట్రాల మధ్య పోతురెడ్డిపాడు పంచాయితీ!

కృష్ణా జలాల వినియోగంపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల మధ్య గొడవ ముదురుతొంది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని ఉల్లంఘిస్తూ.. ప్రభుత్వం ఏకపక్షంగా తలపెట్టిన ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకొని తీరుతామని కేసీఆర్ స్పష్టంచేశారు. అదేసమయంలో తెలంగాణకి అన్యాయం చేయకుండా వరదల ద్వారా వచ్చి, సముద్రంలో కలిసిపోయె నీటిని మాత్రమే మా ప్రభుత్వం వాడుకోవలనుకుంటుదని ఏపీ సాగునీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. ఇదే విషయం పై బీజేపీ రాష్ట్రాఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి కూడా మాట్లాడుతూ.. కేసీఆర్ […]

Written By: Neelambaram, Updated On : May 12, 2020 6:24 pm
Follow us on

కృష్ణా జలాల వినియోగంపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల మధ్య గొడవ ముదురుతొంది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని ఉల్లంఘిస్తూ.. ప్రభుత్వం ఏకపక్షంగా తలపెట్టిన ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకొని తీరుతామని కేసీఆర్ స్పష్టంచేశారు. అదేసమయంలో తెలంగాణకి అన్యాయం చేయకుండా వరదల ద్వారా వచ్చి, సముద్రంలో కలిసిపోయె నీటిని మాత్రమే మా ప్రభుత్వం వాడుకోవలనుకుంటుదని ఏపీ సాగునీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. ఇదే విషయం పై బీజేపీ రాష్ట్రాఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి కూడా మాట్లాడుతూ.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసారు. సముద్రంలో కలిసే నీటిని వాడుకుంటుంటే అడ్డుకోవడం కేసీఆర్ రాజకీయ దిగజారుడుకు నిదర్శనం అని ఆయన అన్నారు.

పోతురెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ ద్వారా రాయలసీమ ప్రాంత ప్రజలకు కనీసం సాగునీరు తాగునీరు కాకుండాకేసీఆర్ కుట్రచేస్తున్నారు అని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. గోదావరి జలాల విషయంలో కేసీఆర్ మోసపూరిత వైఖరి నేడు స్పష్టంగా బయటపడిందని, రాష్ట్ర ప్రయోజనాలు విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఖచ్చితంగా ముందుకు వెళ్ళాల్సందే అని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాయలసీమ ప్రజల తరఫున పోతురెడ్డి పాడు విషయంలో ముందడుగు వేయాలని సూచించారు. ఈ విషయంలో రాజకీయాలకతీతంగా జగన్మోహన్ రెడ్డి కి అన్ని పార్టీలు సమర్థంచాలని ఇతర పార్టీలకు విజ్నప్తిని చేస్తున్నాను అన్నారు.

కేసీఆర్ మరోసారి రాయలసీమ ద్రోహిగా మారిపోయారు. రాయసీమకు అన్యాయం చేయబోతున్న కేసీఆర్ అలోచన తెలంగాణ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పని చేసిన కేసీఆర్ గారికి (అనంతపురం జిల్లా ఇన్చార్జి గా ) రాయలసీమలో కరువు గురించి తెలియదా అని అడుగుతున్నా అన్నారు. కేసీఆర్ వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల కోసం కాదు రాజకీయ ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది అని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు.