తెలంగాణకి అన్యాయం చేయం:అనిల్ యాదవ్

కృష్ణా జలాల వినియోగంపై ఏపీ సాగునీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వరదల సమయంలో వచ్చే జలాలను పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీకి తీసుకెళ్లాలనే ఆలోచనలో తమ ప్రభుత్వం ఉందని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణకు నష్టం చేయాలనే ఆలోచన తమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ కు ఏ మాత్రం లేదని ఆయన వ్యాఖ్యానించారు. సముద్రంలో కలిసిపోయే నీటిని తాము వాడుకుంటే తప్పేముందని ఆయన అన్నారు. రాయలసీమ, నెల్లూరు ప్రాంతాలకు మంచి […]

Written By: Neelambaram, Updated On : May 12, 2020 5:39 pm
Follow us on

కృష్ణా జలాల వినియోగంపై ఏపీ సాగునీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వరదల సమయంలో వచ్చే జలాలను పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీకి తీసుకెళ్లాలనే ఆలోచనలో తమ ప్రభుత్వం ఉందని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణకు నష్టం చేయాలనే ఆలోచన తమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ కు ఏ మాత్రం లేదని ఆయన వ్యాఖ్యానించారు.

సముద్రంలో కలిసిపోయే నీటిని తాము వాడుకుంటే తప్పేముందని ఆయన అన్నారు. రాయలసీమ, నెల్లూరు ప్రాంతాలకు మంచి జరుగుతుందనే ఉద్దేశ్యంతోనే సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని మంత్రి అనిల్ తెలిపారు. అయినా కృష్ణా వినియోగానికి సంబంధించి కృష్ణా రివర్ బోర్డు కేటాయించిన విధంగానే ఇరు రాష్ట్రాలు నీటిని వినియోగించుకుంటాయని… ఈ విషయంలో ఎలాంటి సమస్యలు ఉండబోవని ఆయన స్పష్టం చేశారు. కొందరు కావాలనే ఈ అంశంపై రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించారు.

మరోవైపు ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని ఉల్లంఘిస్తూ.. ప్రభుత్వం ఏకపక్షంగా తలపెట్టిన ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకొని తీరుతామని కేసీఆర్ స్పష్టంచేశారు. ఏపీ ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం తెలంగాణ ప్రయోజనాలకు భంగకరమని అంటూ దీనిపై రాజీలేని ధోరణి అవలంబిస్తామని, ప్రాజెక్టును అడ్డుకోవడమే లక్ష్యంగా న్యాయపోరాటం చేస్తామని ప్రకటించారు. కృష్ణా జలాల వాటాను తేల్చేందుకు సుప్రీంకోర్టును ఆశ్రయించాలని కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు.