KCR- NTR: సిటీ నుంచి వచ్చాడు. సాఫ్ట్ గా ఉన్నాడు. లవర్ బాయ్ అనుకుంటున్నావేమో..? కేరక్టర్ కొత్తగా ఉందని ట్రైచేశా. లోపల ఒరిజినల్ అలానే ఉంది. దాన్ని బయటకు తెచ్చావో అనుకో ..రచ్చ రచ్చే.. ఆ మధ్యన వచ్చిన బృందావనం సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ పలికే డైలాగ్ ఇది. ఇన్నాళ్లకు నిజజీవితంలో కూడా ఇటువంటి సవాల్ విసిరే సందర్భం జూనియర్ ఎన్టీఆర్ కు వచ్చింది. ఒక్కోసారి ఎదుటి వారి చర్యలు బట్టి మనిషి ప్రతిచర్యకు దిగుతాడు. వేదిస్తే మాత్రం మరింత రాటుదేలి నిలబడతాడు. అవసరమైతే కలబడతాడు. ఎదురు నిలిచి పోరాడేందుకు సిద్ధపడతాడు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పరిస్థితి అలానే ఉంది. అతడ్నిరాజకీయంగా కొందరు కెలికారు. ఆ మధ్యనే బీజేపీ అగ్రనేత అమిత్ షా తెలంగాణ పర్యటనలో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ తో భేటీ అయ్యారు. సహజంగా ఇది తెలుగునాట హాట్ టాపిక్ గా మారిపోయింది. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలను దూరంగా ఉన్నారు. నాయకత్వంతో విభేదిస్తున్నట్టు టాక్ నడుస్తోంది. ఈ సమయంలో బీజేపీ అగ్రనేత కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీనిపై రకరకాల కథనాలు వెలువడ్డాయి. కానీ దేనికీ సరైన సమాధానం లేదు.

గట్టి సంకేతాలు పంపిన కేసీఆర్..
అయితే సహజంగా తెలంగాణలో అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నిస్తుండడంతో ఆ పార్టీ అగ్రనేతతో భేటీ కావడం కేసీఆర్ కు మింగుడుపడలేదు. అందుకే జూనియర్ ఎన్టీఆర్ అతిథిగా హాజరుకానున్న బ్రహ్మస్త్ర ఫ్రీరిలీజ్ ఫంక్షన్ కు అనమతులు ఇవ్వకుండా కేసీఆర్ గట్టి సంకేతాలే పంపారు. అయితే దీనిని జూనియర్ ఎన్టీఆర్ లైట్ గా తీసుకున్నారని అంతా భావించారు. కానీ ఆయన చాలా హర్ట్ అయ్యారని ప్రచారం సాగుతోంది. హైదరాబాద్ లో గణపతి నవరాత్రుల నేపథ్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటుచేయలేమని.. భద్రతా కారణాల దృష్ట్యా ఫ్రీరిలీజ్ ఈవెంట్ కు అనుమతులు సాధ్యం కాదని కేసీఆర్ సర్కారు తేల్చేసింది. అయితే ఈ సినిమాను రాజమౌళి ప్రమోట్ చేస్తుండడం, రామోజీ ఫిల్మ్ సిటీలో ఈవెంట్ ఏర్పాటుచేయడం..ఈ బృందమంతా బీజేపీకి అనుకూలమని కేసీఆర్ భావిస్తుండడంతో మొదటికే ఎసరు వచ్చింది. కేసీఆర్ ఆగ్రహానికి కారణమైంది. కానీ అల్టిమేట్ గా ప్రభావం మాత్రం జూనియర్ ఎన్టీఆర్ పై పడింది. చివరకు ఆయన చిత్ర యూనిట్ కు క్షమాపణలు కోరుకున్నారు. తద్వారా ఇష్యూను సీరియస్ గా తీసుకున్నట్టు మాత్రం తెలుస్తోంది.
Also Read: KCR vs Amit Shah: తెలంగాణ విమోచన వార్.. కేసీఆర్ వర్సెస్ అమిత్ షా.. గెలుపెవరిది?
సీరియస్ గా తీసుకుంటే…
జూనియర్ ఎన్టీఆర్ కు రాజకీయంగా ఎదగాలన్న కోరిక ఎప్పటి నుంచో ఉందని సన్నిహితులు చెబుతుంటారు. అయితే బీజేపీ ఎదురెళ్లి ఆఫర్ ఇవ్వడంతో ఆనందపడి ఉంటారు. అయితే ప్రస్తుతం సినీ కెరీర్ వదులుకొని రాజకీయాల వైపు వెళతారా అన్న ప్రశ్న అయితే ఉత్పన్నమైంది. కానీ తాజా పరిస్థితుల్లో ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ఆశ్యర్యపోవాల్సిన పనిలేదని సన్నిహితులు చెబుతున్నారు. బీజేపీ అగ్రనేతతో భేటీ తరువాత జూనియర్ ఎన్టీఆర్ బీజేపీ వాదిగా కేసీఆర్ కు కనిపించారు. కానీ ఆయన అంతటితో తన ఆలోచనకు ఫుల్ స్టాప్ పెట్టి ఉంటే మంచిది. కానీ ఏకంగా జూనియర్ ఎన్టీఆర్ హాజరవుతున్నారన్న రీజన్ తో ఈవెంట్ కు అనుమతులు నిరాకరించడం మాత్రం ఏరికోరి కష్టాలు తెచ్చుకోవడమేనని జూనియర్ ఎన్టీఆర్ సన్నిహితులు వ్యాఖ్యానిస్తున్నారు.

బీజేపీకి ప్లస్ పాయింట్…
అయితే ఈ మొత్తం ఎపిసోడ్ లో మాత్రం బీజేపీకి ప్లస్ గా మారుతోంది. కేవలం ఒకేఒక భేటీతో రాజకీయ ప్రకంపనలు సృష్టించగలిగమన్న ఆనందంలో ఆ పార్టీ ఉంది. తెలుగు రాష్ట్రాల్లో పార్టీకి మైలేజ్ తెస్తుందన్న భావనలో అయితే ఉంది. ఒక వేళ జూనియర్ ఎన్టీఆర్ తనకు జరిగిన అవమానాన్ని సీరియస్ గా తీసుకొని టీఆర్ఎస్ సర్కారుకు వ్యతిరేకంగా పావులు కదిపితే తమకే లాభిస్తోందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. అదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ యాక్టివ్ అయితే ఏపీలో తెలుగుదేశం పార్టీని ఇరుకున పెట్టవచ్చని అభిప్రాయపడుతున్నారు. మొత్తానికైతే జూనియర్ ఎన్టీఆర్ ను రాజకీయంగా కెలికారు. ఇందులో ఒక పార్టీ లాభాన్ని పొందే ప్రయత్నం చేస్తుండగా.. మరో పార్టీ ఏరికోరి కష్టాలను తెచ్చకుంటోంది.
Also Read:AP Three Capitals: హైకోర్టు చెప్పినా తగ్గేదేలే.. మూడు రాజధానులకే జగన్ సై
[…] […]
[…] […]
[…] […]