టీఆర్ఎస్ లో ఏం జరుగుతోంది? ఎంతవరకు వెళ్తుందో ఇది?

తెలంగాణ ప్రభుత్వంలో ఒక్కసారిగా కలకలం.. ఒక కేబినెట్ మంత్రిపై ఏకంగా సీఎం విచారణకు ఆదేశించడం సంచలనమైంది. మంత్రి ఈటల రాజేందర్ పై అవినీతి ఆరోపణలు రావడం.. వాటిపై సీఎం కేసీఆర్ ఏకంగా ఉన్నతస్థాయి విచారణకు పూనుకోవడం ఇప్పుడు టీఆర్ఎస్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా ఏ ప్రభుత్వంలోనైనా మంత్రులు, ఎమ్మెల్యేలు తప్పు చేస్తే వాటిని కవర్ చేసేందుకు పార్టీ పెద్దలు పూనుకుంటారు. అప్పట్లో టీఆర్ఎస్ సీనియర్ నేత కేకే ఫ్యామిలీపై హైదరాబాద్ లో ఓ […]

Written By: NARESH, Updated On : April 30, 2021 10:58 pm
Follow us on

తెలంగాణ ప్రభుత్వంలో ఒక్కసారిగా కలకలం.. ఒక కేబినెట్ మంత్రిపై ఏకంగా సీఎం విచారణకు ఆదేశించడం సంచలనమైంది. మంత్రి ఈటల రాజేందర్ పై అవినీతి ఆరోపణలు రావడం.. వాటిపై సీఎం కేసీఆర్ ఏకంగా ఉన్నతస్థాయి విచారణకు పూనుకోవడం ఇప్పుడు టీఆర్ఎస్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

సాధారణంగా ఏ ప్రభుత్వంలోనైనా మంత్రులు, ఎమ్మెల్యేలు తప్పు చేస్తే వాటిని కవర్ చేసేందుకు పార్టీ పెద్దలు పూనుకుంటారు. అప్పట్లో టీఆర్ఎస్ సీనియర్ నేత కేకే ఫ్యామిలీపై హైదరాబాద్ లో ఓ భూ కబ్జా ఆరోపణలు వస్తే దాన్ని టీఆర్ఎస్ సర్కార్ కప్పేసింది. ఇక మంత్రి కేటీఆర్ ఫాంహౌస్ పై రేవంత్ రెడ్డి ఎంత రచ్చ చేసినా ఆ ఆరోపణలు బయటకు రావడం లేదు. ఇక ఉత్తర తెలంగాణ మంత్రి ఓ మహిళతో రాసలీలల వ్యవహారం వెలుగుచూసినప్పుడు ఏ చర్యలు లేవు. కానీ ఇప్పుడు మంత్రి కేటీఆర్ పై ఈ ఆరోపణలు ఇప్పుడు టీఆర్ఎస్ వర్గాల్లో హాట్ హాట్ చర్చకు దారితీస్తోంది. టీఆర్ఎస్ లో అసలేం జరుగుతోంది? ఎక్కడిదాకా వెళ్తుందని దీనిపై అందరూ ఆరాతీస్తున్నారు.

నిజానికి ఒకప్పుడు కేసీఆర్ కు రైట్ హ్యాండ్ గా మంత్రి ఈటల రాజేందర్ ఉండేవారు. కేసీఆర్ కు నమ్మినబంటుగా వ్యవహరించారు. అందుకే తెలంగాణ తొలి ప్రభుత్వంలో కేసీఆర్ తర్వాత అత్యంత కీలకమైన ఆర్థిక శాఖను మంత్రి ఈటలకు అప్పగించారు. అంతటి ప్రాధాన్యత తెలంగాణ తొలి ప్రభుత్వంలో దక్కింది. అయితే రెండో సారి అధికారంలోకి వచ్చాక కేసీఆర్ కు, ఈటెలకు దూరం పెరిగిందంటారు. ఎందుకో తెలియదు కానీ.. తెలంగాణ తొలి ఉద్యమకారుడు అయిన ఈటలను కేసీఆర్ అసలు మంత్రివర్గంలోకి తీసుకోవడానికి ఇష్టపడలేదు. కానీ ఆ తర్వాత అవకాశం ఇచ్చి వైద్యశాఖ ఇచ్చారు.

ఇక అప్పటి నుంచి మంత్రి ఈటల రాజేందర్ పార్టీలో, ప్రభుత్వంలో తనకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం.. పక్కనపెట్టడంపై పలు వేదికల్లో రగిలిపోయి ‘తెలంగాణకు మేమే బాస్ లం.. బానిసలం’ కాదు అని నినదించారు. చాలా సందర్భాల్లో పార్టీ గురించి ఈటల చేసిన వ్యతిరేక కామెంట్స్ పతాక శీర్షిక అయ్యాయి.

దీంతో మంత్రి ఈటల రాజేందర్ పై సీఎం కేసీఆర్ కు వైరాగ్యం వచ్చేసింది. దీంతో ఈ బంధం తెగ్గొట్టాలనే డిసైడ్ అయినట్టు ఉన్నాడు. మొన్నీ మధ్య కేటీఆర్ కల్పించుకొని మరీ కేసీఆర్-ఈటల భేటికి ప్రయత్నించినా ఫలించలేదని సమాచారం.

దీంతో టీఆర్ఎస్ అనుకూల టీన్యూస్, టీవీ9, 10టీవీలలో ఒకేరోజు ఈటల భూభాగోతం అంటూ పెద్ద ఎత్తున కూడబలుక్కొని కథనాలు ప్రసారం అయ్యాయి. దీంతో జరగబోయేది ఏంటో అర్థమైపోయింది. కేసీఆర్ అనుకున్నట్టే దీనిపై విచారణకు ఆదేశించారు. తర్వాత మంత్రి ఈటెల పోస్ట్ ఊస్ట్ అయినట్టే. ఈటలనే రాజీనామా చేసేలా ఈ స్కెచ్ గీసినట్టు తెలుస్తోంది.

ముందుగా మంచి మనిషి అని ముద్రపడ్డ ఈటలపై ఇలా అభాసుపాలు చేయడం ద్వారా ఆయనను తీసేసిన వైనంపై విమర్శలు రాకుండా కేసీఆర్ పక్కా ప్రణాళికతో రైతుల పేరిట భబూ కబ్జా ఆరోపణలు చేసినట్టు రాజకీయవర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఒక సీనియర్, పైగా ఉద్యమకారుడిపై వేటు వేయాలంటే ఏదో ఒక మరక ఆయనకు అంటాలి. లేదంటే బీజేపీ, కాంగ్రెస్ సహా సమాజం ఊరుకోదు. అందుకే ఇన్నాళ్లు గమ్మున ఉన్న కేసీఆర్ ఇప్పుడు ఈటల భూబాగోతం పేరిట ఒక అంశం దొరకబట్టి ఆయనపై అక్రమాల ముద్ర వేసి పక్కన పెడుతున్నట్టుగా తెలుస్తోంది. అధికార పార్టీ మంత్రిని కేసీఆర్ తలుచుకుంటే.. ఆయనకు అనుకూలంగా ఉంటే ఎన్ని ఆరోపణలు వచ్చినా కమ్మేస్తారు. కానీ వదిలించుకోవాలని డిసైడ్ అయితే ఇలానే సొంత మీడియాలోనే కథనాలు వెలువడేలా చేస్తారని గుసగుసలు ఉన్నాయి.

అయితే గతంలో తనకు నచ్చని ఆలె నరేంద్ర, విజయశాంతి, డీ శ్రీనివాస్ లాంటి వారిని ఇలానే కేసీఆర్ వదిలించుకున్నారు. ఇప్పుడు తొలి ఉద్యమకారుడు ఈటల రాజేందర్ ను కూడా అలానే వదిలించుకునే ప్రయత్నంలో ఉన్నట్టు తెలుస్తోంది.

అయితే ఈటల కూడా కేసీఆర్ పై, టీఆర్ఎస్ పై బయటపడడం ఆయన తప్పే అంటున్నారు. చాలా మంది కేసీఆర్ తీరు నచ్చక గమ్మున ఉంటున్నారు. కేసీఆర్ కు ప్రత్యామ్మాయం లేక కడియం శ్రీహరి సహా సీనియర్లు ఎంతో మంది మౌనంగా భరిస్తున్నారు. కానీ ఈటల తనకు పార్టీలో జరిగిన అవమానంపై గళమెత్తాడు. ఎదురుతిరిగితే కేసీఆర్ ఏం చేస్తారో అందరికీ తెలిసిందే. అదే గతి ఈటలకు పట్టబోతోంది.

అయితే ఈటల బీజేపీతో సాన్నిహిత్యంగా ఉన్నాడని.. ఆ పార్టీలోకి వెళతాడనే ప్రచారం ఉంది. ఆ పార్టీతో సాన్నిహిత్యం కూడా కేసీఆర్ ఆగ్రహానికి కారణమంటున్నారు. ఏది ఏమైనా కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్టు ఇప్పుడు మంత్రి ఈటల రాజేందర్ కు ఈ గతి పట్టడానికి ఎన్నో కారణాలు ఉండొచ్చని పార్టీలో ఇక వ్యతిరేకులకు చాన్స్ లేకుండా ఈటల తోనే కేసీఆర్ వేట మొదలు పెట్టినట్టుగా ప్రచారం సాగుతోంది.