షాకింగ్: అరియానా ఈ గెటప్ లోనా?

బిగ్ బాస్ లో అరియానాను మనం ఎలా చూశాం. పొట్టి పొట్టి డ్రెస్ లతో వీక్షకులకు సెగ పుట్టేలా…. మోడర్న్ అమ్మాయిలా రెబర్ స్టార్ సోహైల్ తో తలపడ్డ ఆడ పులిలా తలపడుతుంటే ‘అమ్మో అరియానా’ లేడీ ఫైర్ బ్రాండ్ అనుకున్నాం.. పొట్టి పొట్టి డ్రెస్సుల్లో కనిపించి కుర్రకారును మెలిపెట్టేలా కనిపించే అరియానా ‘డ్రెస్’లు ఆమె బిగ్ బాస్ లో ఉండగా ఫేమస్ అయ్యాయి కూడా.. మార్కెట్లో ఇప్పుడు ‘అరియానా డ్రెస్’ అని ఓ ప్రత్యేక దుస్తులు […]

Written By: NARESH, Updated On : April 30, 2021 9:27 pm
Follow us on

బిగ్ బాస్ లో అరియానాను మనం ఎలా చూశాం. పొట్టి పొట్టి డ్రెస్ లతో వీక్షకులకు సెగ పుట్టేలా…. మోడర్న్ అమ్మాయిలా రెబర్ స్టార్ సోహైల్ తో తలపడ్డ ఆడ పులిలా తలపడుతుంటే ‘అమ్మో అరియానా’ లేడీ ఫైర్ బ్రాండ్ అనుకున్నాం.. పొట్టి పొట్టి డ్రెస్సుల్లో కనిపించి కుర్రకారును మెలిపెట్టేలా కనిపించే అరియానా ‘డ్రెస్’లు ఆమె బిగ్ బాస్ లో ఉండగా ఫేమస్ అయ్యాయి కూడా..

మార్కెట్లో ఇప్పుడు ‘అరియానా డ్రెస్’ అని ఓ ప్రత్యేక దుస్తులు కూడా లభిస్తున్నాయి. అంతలా బిగ్ బాస్ లో పాపులర్ అయిన ఆమె బయటకొచ్చాక కొన్ని వెబ్ సిరీస్ లు, కొన్ని సినిమాలు, ప్రోగ్రాంలలో బిజీ అయ్యింది.

అప్పుడప్పుడు తన స్నేహితుడు అవినాష్ తో కలిసి టీవీ షోలల్లోనూ కనిపిస్తోంది. అలాంటి అరియానా తాజాగా కరోనా సెకండ్ వేవ్ తో ఈ గ్యాప్ లో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.

అరియానా తాజాగా అచ్చ తెలుగు అమ్మాయిలా లంగా ఓణీలో కనిపించి అందరికీ షాకిచ్చింది. ఎప్పుడూ అన్ని కనిపించేలా మోడ్రన్ డ్రెస్సుల్లో సందడి చేసే అరియానా సంప్రదాయబద్దంగా కనిపించేసరికి అసలు ఈమె అరియానానేనా అనే డౌట్ కూడా నెటిజన్లకు వచ్చింది. అరియానా కొత్త లుక్ పై ఇప్పుడు బోలెడు కామెంట్స్ చేస్తున్నారు. సుందరాంగిలా ఉన్నావ్ అంటూ ప్రశంసిస్తున్నారు.