KCR: పాలనలో టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌ది తనదైన శైలి అని చెప్పొచ్చు. ఎవరెన్ని విమర్శలు చేసినప్పటికీ కేసీఆర్ తన ప్రణాళిక ప్రకారమే పాలన చేస్తారని పలువురు అంటుంటారు. ఈ సంగతులు అటుంచితే..తెలంగాణ సర్కారుకు ప్రజెంట్ చినజీయర్ ఆశ్రమంలో జరగనున్న రామానుజచార్యుల విగ్రహావిష్కరణ ఫస్ట్ ప్రయారిటీగా ఉన్నట్లు స్పష్టమవుతోంది.

నిజానికి హైదరాబాద్ శివారులోని ముచ్చింతల్‌లో ఉన్న చినజీయర్ ఆశ్రమంలోనిరామానుజాచార్యుల విగ్రహావిష్కరణ కార్యక్రమం ప్రైవేటు కార్యక్రమం. కానీ, అక్కడ చేయాల్సిన ఏర్పాట్లపై సీఎం కేసీఆర్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించుకునేందుకుగాను ఆశ్రమ నిర్వాహకులు ప్రభుత్వానికి రుసుములు కట్టి, దరఖాస్తులు చేసుకుని తమకు కావాల్సిన సౌకర్యాలు పొందాల్సి ఉంటుంది. కానీ, చినజీయర్ స్వామికి ఉన్న పలుకుబడి నేపథ్యంలో స్వయంగా సీఎం కేసీఆర్ రంగంలోకి వచ్చి ఏర్పాట్లు పర్యవేక్షించారు. ప్రత్యేకంగా చినజీయర్ ఆశ్రమానికి వెళ్లి ఏర్పాట్లను పరిశీలించారు కూడా.
Also Read: సీఎం కేసీఆర్, అసదుద్దీన్‌పై అసోం సీఎం సంచలన కామెంట్స్…
ఆశ్రమంలో ప్రభుత్వ పరంగా చేయాల్సిన ఏర్పాట్లపై సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అక్కడ క్షణం పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోకుండా ఏర్పాట్లు చేయాలని ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డికి ఆదేశాలిచ్చారు. రామానుజాచార్యుల విగ్రహావిష్కరణ సందర్భంగా జరిగే కార్యక్రమాలన్నింటికీ అవసరైన నీటిని మిషన్ భగరీథ నీరు అందించాలని ఆ శాఖ అధికారులకు సూచించారు. ఇక ఆశ్రమంలో నిర్వహించే యాగానికి సంబంధించి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని తెలిపారు. ఫైర్ ఇంజిన్లు ఏర్పాటు చేయాలని అగ్నిమాపక శాఖ అధికారులకు తెలిపారు.
మొత్తంగా ఆశ్రమంలోని రామానుజచార్యుల విగ్రహావిష్కరణ కార్యక్రమం తెలంగాణ సర్కారు ఫస్ట్ ప్రయారిటీగా ఉంది. ఇకపోతే ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి స్వయంగా సీఎం కేసీఆర్ చినజీయర్ స్వామితో కలిసి పలువురు ప్రముఖులను ఆహ్వానిస్తారని తెలుస్తోంది. దేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీతో పాటు కేంద్ర మంత్రులను, ఇతర ప్రముఖులను, గవర్నర్లను ఆహ్వానిస్తారని సమాచారం. గతంలో కేసీఆర్ తన ఫామ్ హౌజ్‌లో యాగం చేసిన సంగతి అందరికీ విదితమే. ఈ కార్యక్రమానికి అప్పటి ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రులు వచ్చారు.
Also Read: జాతీయ రాజకీయాలపై కేసీఆర్ ఫోకస్.. వామపక్షాలతో పొత్తు..?
[…] […]
[…] […]