TRS MLC Candidates: ఎన్నో రోజులుగా ఊరిస్తున్న ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా ఖరారు అయింది. ఆశావహుల ఆశలు నెరవేరుస్తూ కేసీఆర్ ప్రకటించిన జాబితాలో ఒకరికి నిరాశ మిగిలిన అందరికి బెర్త్ ఖాయమైంది. దీంతో వారు నామినేషన్ వేసేందుకు బయలుదేరారు. మధ్యాహ్నం మూడు గంటల వరకే సమయం ఉండటంతో వారంతా హడావిడిగా నామినేషన్లు వేసేందుకు వెళుతున్నారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాలో గుత్తా సుఖేందర్ రెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్ రావు, మధుసూదనాచారి, పాడి కౌశిక్ రెడ్డి, కడియం శ్రీహరి, ఆకుల లలిత, వెంకట్రామిరెడ్డి పేర్లు ఉన్నాయి. దీంతో దళిత నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ కు నిరాశే మిగిలింది.

జాబితా ప్రకటనలో సీఎం కేసీఆర్ ప్రధాన దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి అడుగేసినట్లు సమాచారం. అందుకే ఎమ్మెల్సీ జాబితా ఖరారులో తనదైన మార్కు చూపినట్లు చెబుతున్నారు. ఇందులో పాడి కౌశిక్ రెడ్డికి గతంలోనే ఇచ్చిన మాట ప్రకారమే ఆయనకు ఎమ్మెల్సీ బెర్త్ ఖరారు చేశారు. ఇక సిద్దిపేట కలెక్టర్ గా పనిచేసిన వెంకట్రామిరెడ్డి జాక్ పాట్ కొట్టి చివరి క్షణంలో ఆయనకు పదవి దక్కింది.
మాజీ స్పీకర్ మధుసూదనాచారిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా చేసి మండలి చైర్మన్ గా చేస్తారని ప్రచారం జరిగినా ఆయనకు ఎమ్మెల్యే కోటాలోనే పదవి దక్కడం విశేషం. మరోవైపు నిజామాబాద్ నుంచి ఎమ్మెల్సీగా ఎంపికైన ఆకుల లలితను ఎమ్మెల్సీగా ఎంపిక చేయడంతో కేసీఆర్ కూతురు కవితను స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ చేస్తారని ప్రచారం సాగుతోంది.
Also Read: YSRCP MLC: కొత్తగా ఎంపికైన ఎమ్మెల్సీ బ్యాక్ గ్రౌండ్ చూద్దామా?
పాడి కౌశిక్ రెడ్డి కూడా గతంలోనే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా చేయాలని ప్రయత్నించినా కుదరకపోవడంతో ఆయనను ఎమ్మెల్యే కోటాలోనే పదవి దక్కనుంది. దీంతో కేసీఆర్ తాను అనుకున్న ప్రకారం ఇచ్చిన వాగ్దానాల మేరకేు పదవులు ఖాయం చేసినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఎమ్మెల్సీ ఎన్నికలపై ఇన్నాళ్లుగా ఏర్పడిన ఉత్కంఠకు తెరపడింది. జాబితా బయటకొచ్చి వారు నామినేషన్లు వేసేందుకు వెళ్లడం తెలిసిందే.
Also Read: AP BJP: ఏపీలో బీజేపీ స్ట్రాటజీ.. టార్గెట్ 2024.. టీడీపీకి బూస్ట్ నా?