-: ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ తనిఖీలు సీఎం కేసీఆర్ కుటుంబాన్ని కలవరపెడుతున్నాయి.. నిన్నటి వరకూ సీఎం కూతురు కవితను విచారించిన ఈడీ వాస్తవాలు బయట పెట్టకపోయినా.. ఆయన కుటుంబానికి చెందిన మరో కీలక నేత జోగినపల్లి సంతోష్ పేరు వెలుగులోకి తెచ్చింది. దీంతో టీఆర్ఎస్ లో మరోమారు ప్రకంపనలు మొదలయ్యాయి.
-వారి చుట్టే ఈడీ..
టీఆర్ఎస్ పార్టీని కొన్నేళ్లపాటు అడ్రస్ చేసిన చెన్నమనేని సంతోష్ కుమార్ గతంలో పలు సంస్థలతో వ్యాపార లావాదేవీలు నడిపారు. ఇటీవల ఓ ఆడిటర్ ను ఈ విషయంపై ప్రశ్నించగా నిజాలు వెలుగు చూశాయి. కరీంనగర్ జిల్లాకు చెందిన వెన్నమనేని శ్రీనివాస్ రావును ఏజెన్సీ అదుపులోకి తీసుకొని ప్రశ్నించినట్లు తెలుస్తున్నది. పైప్స్, షాపింగ్, తదితర ఎన్నో వ్యాపారాల్లో కలిసి పని చేసినట్లు ఆయన ఈడీకి వివరించారు. 2016లో బంజారా హిల్స్ లోని రిజిస్ర్టర్ అయిన ఓ అడ్రస్ తో శ్రీనివాస్ రావుతో కలిసి సంతోష్ కూడా ఉన్నారు. దీనితో పాటు అప్పటికే పలు మీడియా బ్రాడ్ కాస్టింగ్ సర్వీసుల్లో డైరెక్టర్ గా కూడా పని చేశాడు సంతోష్.
-ఒక్కొక్కటిగా బయటపడుతున్న లింకులు
ఢిల్లీలో లిక్కర్ దుకాణాలను దక్కించుకునేందుకు ఎవరెవరు ఏ స్థాయిలో మనీలాండరింగ్ కు పాల్పడ్డారు.? ఎంత మేర డబ్బులు ఎక్కడికి చేరుకున్నాయి అనే లింకులను ఈడీ మెల్లమెల్లగా బయటపెడుతోంది. సీబీఐతో ప్రారంభమైన ఈ దర్యాప్తు క్రమంగా ఈడీ, ఐటీ వరకు చేరుకుంది. ప్రస్తుతం జోగినపల్లిని సెంటర్ చేసిన ఈడీ ఆయన లావాదేవీలు, గతంలో ఎవరితో కలిసి పని చేశారు. ప్రస్తుతం ఉన్న లింకులపై లోతుగా శోధిస్తోంది. గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా వ్యాపార సంస్థల్లో నుంచి వెదొలిగినా అప్పటి లావాదేవీలు వచ్చిన డబ్బు ఎక్కడికి వెళ్లిందని విచారిస్తున్నారు. స్కాం మొదలైనప్పుడు రాష్ర్టానికి చెందిన ఎవరిపైన కూడా ఎఫ్ఐఆర్ లో పేర్కొనని ఈడీ ఒక్కొక్కరిగా లింకులను బయటపెడుతోంది.
-కష్టకాలంలో టీఆర్ఎస్
ఈడీ దర్యాప్తులో ఎలాంటి ప్రస్తుతం నిజా నిజాలు నిగ్గు తేల్చలేకపోయినా ప్రధానంగా కేసీఆర్ కుటుంబం చుట్టూ తనిఖీలు నిర్వహిస్తుండడంతో టీఆర్ఎస్ నాయకులు అయోమయంలో పడుతున్నారు. నిప్పులేనిదే పొగరాదంటూ ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలను ఖండించలేకపోతున్నామని గులాబీ బాస్ కు చెప్పుకుంటున్నారు. మొన్నటి వరకు కవిత, నేడు సంతోష్ ఇలా ఇంకెంత మంది ఉన్నారంటూ సాక్షాత్తు వారే బాస్ ను ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్నికలు దగ్గరపడే కొద్దీ రాష్ర్టంలో టెన్షన్ వాతావరణం కొనసాగుతున్నది. కేంద్రాన్ని విమర్శించే పని అంటుంచి ఈ విషయాలపై ప్రజలకు ఏం చెప్పాలో తెలియక అయోమయంలో పడుతున్నారు నేతలు.
-కొత్త పేరుతో మరింత దూకుడుగా బీజేపీ
ఎమ్మెల్సీ కవిత తర్వాత కొత్తగా ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ పేరు వెలుగులోకి రావడంతో మొదటి నుంచే అగ్రసివ్ గా ఉన్న బీజేపీ మరింత దూకుడుగా వ్యవహరిస్తుంది. కొత్త రాష్ట్రాన్ని అప్పుల పాలుగా మార్చిన కేసీఆర్ స్కాములను బయటకు తీసి జైలుకు పంపుతామని బీజేపీ స్టేట్ ఛీప్ బండి సంజయ్ కుమార్ తరుచూ సభల్లో చెప్తూనే ఉన్నారు. ఈడీ దర్యాప్తులు పనిలేక చేయడం లేదని, కోట్లాది రూపాయల తెలంగాణ ధనం ఢిల్లీ లిక్కర్ స్కాంకు తరలించిందని ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. కేసీఆర్ కు ఇక్కడి లిక్కర్ చాలదా.. ఢిల్లీలో కూడా కావాలా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఏది ఏమైనా ఢిల్లీ లిక్కర్ స్కాం ఎలాంటి దూకుడు ప్రదర్శిస్తుంది.. ఇంకా ఎవరెవరిని సెంటర్ చేస్తూ తనిఖీలు చేస్తున్నాయి. నిజా నిజాలు ఎన్నికల వరకైనా నిగ్గు తేలుస్తాయా? అని రాష్ర్ట ప్రజలు చర్చించుకుంటున్నారు.
Also Read:Pawan Kalyan-TDP: ముఖ్యమంత్రి గా పవన్ కళ్యాణ్… టీడీపీ మాస్టర్ ప్లాన్ ఇదే!
Recommended videos: