తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రెస్ మీట్ అంటే చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఎందుకంటే సంచలనాల వ్యాఖ్యలకు కేసీఆర్ అని అంటారు. ప్రతీ విలేకరుల సమావేశంలో ఆయన ఏదో కొత్త విషయాన్ని ప్రస్తావిస్తుంటారు. అయితే గత రెండు సార్లు నిర్వహించిన సమావేశంలో కేవలం బీజేపీపై విమర్శలు మాత్రమే చేశారు. తాజాగా కేంద్ర బడ్జెట్ సందర్భంగా మంగళవారం నిర్వహించిన సమావేశం ప్రత్యేకత సంతరించుకుంది.

ఈ సమావేశంలో అంతకుముందు లాగే బీజేపీని చెండాడినా.. ఆ తరువాత ‘కొత్త రాజ్యాంగం’ అనే వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడున్న రాజ్యాంగాన్ని మార్చాలని, కొత్త రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా తన మాటలను మీడియా ద్వారా ప్రచారం చేయాలని కూడా సూచించారు. దీంతో కేసీఆర్ చేసిన ‘రాజ్యంగం’ వ్యాఖ్యలు అనుకున్నట్లుగానే వైరల్ అవుతున్నాయి. అయితే కేసీఆర్ రాజ్యాంగం మార్చాలని ఎందుకు అంటున్నారు..? ఇంతకీ కొత్త రాజ్యాంగంలో ఏముండాలని అనుకుంటున్నారు..? అని రకరకాలుగా చర్చలు పెడుతున్నారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఎంతో పవిత్రంగా భావిస్తాం. అయితే ఏన్నో ఏళ్ల కిందట తయారు చేసిన ఈ రాజ్యంగంలో కొన్ని కొన్ని సవరణలు చేశారే తప్ప ఇప్పటి వరకు రాజ్యాంగాన్ని మార్చలేదు. అయితే బీజేపీలో అంతర్గతంగా రాజ్యాంగాన్ని మార్చాలన్న చర్చ ప్రారంభమైనట్లు కొందరు విమర్శలు చేశారు. ఇప్పడున్న పరిస్థితులకు అనుగుణంగా సవరణలు చేయాలని కొన్ని సమావేశాలు నిర్వహించారని ప్రతిపక్షాలు కామెంట్లు చేశాయి. కానీ బీజేపీ నాయకులు ఈ వ్యాఖ్యలకు స్పందించిన ఖండించారు.
కానీ ఇప్పుడు కేసీఆర్ బీజేపీపై వచ్చిన రాజ్యంగ ఆరోపణలు బహిర్గతం చేశారు. అంతేకాకుండా మొత్తం రాజ్యాంగాన్నే మార్చాలంటున్నారు. అయితే కొత్త రాజ్యంగంలో ఏం ఉండాలని కేసీఆర్ కోరుకుంటున్నాడు..? అని కొందరు చర్చలు పెడుతుండగా.. మరికొందరు విశ్లేషకులు సమాధానాలు చెబుతున్నారు. కొత్త రాజ్యంగంలో ఎస్సీ, ఎస్టీల జనాభాకు తగ్గట్లుగా రిజర్వేషన్లు కేటాయిస్తారా..? లేక రాష్ట్రాలకు స్వయంప్రతిపత్తి కల్పిస్తారా..? అనే అంశాలు ఉండొచ్చని భావిస్తున్నారు. కానీ రాజ్యాంగాన్ని మార్చాలన్న కేసీఆర్ ఎందుకో క్లారిటీ ఇవ్వలేదు.
అయితే ఈ వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. పవిత్రమైన రాజ్యాంగాన్నే మార్చాలనుకుంటున్న కేసీఆర్ బాగోతం బయటపడిందని అన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా కేసీఆర్ కనీసం నివాళులర్పించలేదని, ఇప్పుడు ఆయన రచించిన రాజ్యాంగాన్నే మార్చాలని అనుకుంటున్నారని బండి సంజయ్ విమర్శించారు. అయితే సాధారణంగా కేసీఆర్ చేసే ప్రతీ వ్యాక్యలకు ఏదో గూడార్థం దాగి ఉంటుంది. మరి దేశం మొత్తం ప్రేమించే అంబేద్కర్ రాజ్యాంగాన్ని కేసీఆర్ ఎందుకు మార్చాలనుకుంటున్నారు..? అనే చర్ఛ హాట్ హాట్ గా సాగుతోంది.
[…] Also Read: కేసీఆర్ కొత్త రాజ్యాంగంలో ఇవే అంశాలు… […]
[…] Also Read: కేసీఆర్ కొత్త రాజ్యాంగంలో ఇవే అంశాలు… […]
[…] Also Read: కేసీఆర్ కొత్త రాజ్యాంగంలో ఇవే అంశాలు… […]
[…] […]