https://oktelugu.com/

కమలానికి దూరంగా ‘చేతి’కి గులాబీలు!

రెండోసారి ఎంత వేగంగా కేంద్రంలో మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చిందో అంతే వేగంగా ఆ పార్టీ ప్రభ తగ్గిపోతుందనే అపవాదును మూటగట్టుకుంది. కార్పొరేట్ కు మేలు చేసేలా మోడీ సర్కార్ సంస్కరణలు ఉంటాయని తొలి ప్రభుత్వంలో విమర్శలు వచ్చాయి. ఇప్పుడు రెండో ప్రభుత్వంలో పూర్తిగా కార్పొరేట్ అనుకూల విధానాలను దేశ ప్రజలపై రుద్దుతున్న తీరును ప్రభుత్వాలు, ప్రజలు జీర్ణించుకోవడం లేదు. ALso Read: కేటీఆర్ సీఎం కావడం కల్ల.!? ఈ క్రమంలోనే కేంద్రంలోని మోడీ సర్కార్ ఈసారి […]

Written By:
  • NARESH
  • , Updated On : September 23, 2020 / 08:49 AM IST

    kcr, congress

    Follow us on

    రెండోసారి ఎంత వేగంగా కేంద్రంలో మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చిందో అంతే వేగంగా ఆ పార్టీ ప్రభ తగ్గిపోతుందనే అపవాదును మూటగట్టుకుంది. కార్పొరేట్ కు మేలు చేసేలా మోడీ సర్కార్ సంస్కరణలు ఉంటాయని తొలి ప్రభుత్వంలో విమర్శలు వచ్చాయి. ఇప్పుడు రెండో ప్రభుత్వంలో పూర్తిగా కార్పొరేట్ అనుకూల విధానాలను దేశ ప్రజలపై రుద్దుతున్న తీరును ప్రభుత్వాలు, ప్రజలు జీర్ణించుకోవడం లేదు.

    ALso Read: కేటీఆర్ సీఎం కావడం కల్ల.!?

    ఈ క్రమంలోనే కేంద్రంలోని మోడీ సర్కార్ ఈసారి భారీ మెజార్టీ ఉండొచ్చు కాక.. కానీ వచ్చేసారి కష్టమేనన్న వాదన వినిపిస్తోంది. ప్రతిపక్షాలు, ప్రాంతీయ పార్టీలన్నీ ఇప్పటికే దూరమైపోయాయి. అలిగేషన్స్ ఉన్న వైసీపీ పార్టీ లాంటివే ఇప్పుడు అవసరార్థం బీజేపీతో అంటకాగుతున్నాయి. అకాలీదళ్ లాంటి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాన్ని సైతం వ్యవసాయ బిల్లులతో బీజేపీ దూరం చేసుకుంది.

    కేంద్రంలో చోటుచేసుకున్న ఆసక్తికర పరిణామం ఏంటంటే.. జాతీయ రాజకీయాల్లో ఎక్కడ అవసరం పడితే అటు వైపు వెంటనే ఫిఫ్ట్ అయ్యే తెలంగాణ రాష్ట్రసమితి అధినేత కేసీఆర్ తాజాగా వ్యవసాయ, విద్యుత్ మీటర్ల బిల్లులకు వ్యతిరేకంగా బీజేపీతో ఫైట్ కు రెడీ అయ్యారు. అయితే రెడీ కావడమే కాదు.. తాజాగా పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ సహా దేశంలోని ప్రధాన ప్రతిపక్షాలతో కలిసి పార్లమెంట్ నే బకాయిట్ చేశారు. పార్లమెంట్ ముందు కాంగ్రెస్, ప్రతిపక్షాలతో కలిసి టీఆర్ఎస్ ఎంపీలు నిరసన తెలిపారు.

    దీన్ని బట్టి తమ స్వప్రయోజనాలను పట్టించుకోని బీజేపీ కంటే.. కాంగ్రెస్ తోనే వెళ్లడం బెటర్ అని కేసీఆర్ డీసైడ్ అయినట్టు తెలుస్తోంది. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఉంది. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో హంగ్ వస్తే కేసీఆర్ కీలకం అవుతారు. అప్పుడు కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కాంగ్రెస్ తో పొత్తు ఉంటే రాష్ట్రంలోనూ కాంగ్రెస్ తో పోటీ ఉండదు. ఇలా దేశంలో రాష్ట్రంలో తనకు ఎదురులేకుండా చూసుకునే ప్రయత్నాలను కేసీఆర్ ప్రారంభించారని విశ్లేషకులు అంటున్నారు.

    Also Read: తెలంగాణలో పొలిటికల్ హీట్

    కేంద్రంలో కాంగ్రెస్ తో జట్టుకడితే రాష్ట్రంలోనూ ఆ చెలిమి టీఆర్ఎస్ కు లాభం.. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ మిత్రపక్షం అవుతుంది. అప్పుడు తెలంగాణలో బలమైన ప్రతిపక్షం ఉండదు. బీజేపీ అంత బలంగా లేదు. దీంతో తెలంగాణలో లైన్ క్లియర్ తోపాటు జాతీయ రాజకీయాలపై పట్టు సాధించే దిశగా కేసీఆర్ అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కమలానికి దూరంగా కాంగ్రెస్ చేతికి గులాబీలు వెళ్లిపోతున్నాయనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.

    -నరేశ్