https://oktelugu.com/

ఇళ్లు, భూమి‌, ఫ్లాట్‌.. ప్రతీ లెక్క ఆన్‌లైన్‌లోకి..

తెలంగాణ రాష్ట్రంలోని పల్లెలు, పట్టణాల్లో ఇప్పటికీ ఆన్‌లైన్‌లో నమోదు కాని ఇళ్లు, ప్లాట్లు, అపార్ట్‌మెంట్‌ ఫాట్స్‌, వ్యవసాయేతర ఆస్తుల వివరాలను 15 రోజుల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సీఎం కేసీఆర్‌‌ మున్సిపల్‌, పంచాయతీరాజ్‌ శాఖ అధికారులను ఆదేశించారు. ధరణి పోర్టల్‌ అందుబాటులోకి వచ్చేలోపే ఈ రెండు శాఖలకు చెందిన అన్ని స్థాయిల్లోని ఆఫీసర్లు, సిబ్బంది ఆస్తుల వివరాలను వంద శాతం పక్కాగా నమోదు చేయాలని అన్నారు. నూతన రెవెన్యూ చట్టం అమలులో భాగంగా తీసుకువస్తున్న ధరణి పోర్టల్‌ […]

Written By:
  • NARESH
  • , Updated On : September 23, 2020 / 08:57 AM IST

    dharani copy

    Follow us on

    తెలంగాణ రాష్ట్రంలోని పల్లెలు, పట్టణాల్లో ఇప్పటికీ ఆన్‌లైన్‌లో నమోదు కాని ఇళ్లు, ప్లాట్లు, అపార్ట్‌మెంట్‌ ఫాట్స్‌, వ్యవసాయేతర ఆస్తుల వివరాలను 15 రోజుల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సీఎం కేసీఆర్‌‌ మున్సిపల్‌, పంచాయతీరాజ్‌ శాఖ అధికారులను ఆదేశించారు. ధరణి పోర్టల్‌ అందుబాటులోకి వచ్చేలోపే ఈ రెండు శాఖలకు చెందిన అన్ని స్థాయిల్లోని ఆఫీసర్లు, సిబ్బంది ఆస్తుల వివరాలను వంద శాతం పక్కాగా నమోదు చేయాలని అన్నారు. నూతన రెవెన్యూ చట్టం అమలులో భాగంగా తీసుకువస్తున్న ధరణి పోర్టల్‌ రూపకల్పనపై మంగళవారం రాత్రి ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌‌ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

    ALso Read: కేటీఆర్ సీఎం కావడం కల్ల.!?

    గ్రామ పంచాయతీలు, గ్రామాలు, పురపాలికలు, పురపాలక సంస్థల ఆస్తుల వారీగా వివరాలను యంత్రాంగం సేకరించాలన్నారు. ప్రతీ ఆస్తికి పన్ను వివరాలతోపాటు నల్లా బిల్లు, యజమాని ఆధార్‌ కార్డు వివరాలను సేకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. ప్రజలు కూడా ముందుకు రావాలని, అధికారులకు పూర్తి వివరాలు అందించి సహకరించాలని సూచించారు. భూ రికార్డుల నిర్వహణ నూటికి నూరు శాతం పారదర్శకంగా ఉండాలనే లక్ష్యంతోనే ధరణి పోర్టల్‌కు శ్రీకారం చుడుతున్నామని, లక్ష్య సాధనకు అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వెబ్‌సైట్‌ను ఒక్కసారి ప్రారంభించాక లోటుపాట్లు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కొన్ని రోజులు ఆలస్యమైనా పరవాలేదని, లోపాల్లేకుండా చూడాలని సూచించారు.

    ఆస్తుల ఆన్‌లైన్‌ నమోదు ప్రక్రియతోపాటు గ్రామాల్లో వైకుంఠ ధామాల నిర్మాణం, డంప్‌ యార్డుల ఏర్పాటు, ప్రతి ఇంటికీ 6 మొక్కలు ఇవ్వడం సహా గ్రామాల్లో హరితహారం, చెత్త తరలింపు తదితర అంశాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించడానికి ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

    Also Read: కమలానికి దూరంగా ‘చేతి’కి గులాబీలు!

    ధరణితోపాటు వ్యవసాయేతర భూముల వివరాలను ఆన్‌లైన్‌లో చేర్చే ప్రక్రియ, రిజిస్ట్రేషన్ల సన్నాహకాలపై ఈ మేరకు బుధవారం ఉదయం 9 గంటలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడనున్నారు. రిజిస్ట్రేషన్లు చేయడానికి తహసీల్దార్‌ కార్యాలయాల్లో అదనంగా ఎలాంటి సదుపాయాలో కావాలో ఆరా తీయనున్నారు. ఆస్తుల వివరాలను ఆన్‌లైన్‌లో చేర్చి, డేటాను నవీకరించడానికి అదనపు కలెక్టర్లను నోడల్‌ అధికారులుగా నియమించనున్నారు.