కేసీఆర్ కుమార్తె కవిత సంచలనం.. అరుదైన రికార్డ్

రాజకీయాల్లో ఓడిపోయినా ప్రజల మనసులు గెలుచుకోవడంలో మాత్రం మన సీఎం కేసీఆర్ కుమార్తె, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ముందున్నారు. తెలంగాణ జాగృతితో ఉద్యమంలో ఎలుగెత్తి చాటి.. తొలి తెలంగాణలో నిజామాబాద్ ఎంపీగా రాజకీయాల్లోకి వచ్చిన కవిత మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమితో తెరమరుగయ్యారు. అతి తక్కువ సమయంలోనే ఉత్తమ పార్లమెంటేరియన్ అయ్యి ప్రత్యక్ష ఎన్నికల్లో మంచి నేతగా పేరుతెచ్చుకున్న కవిత మరో అరుదైన ఘనత సాధించారు. కల్వకుంట్ల కవిత ట్విట్టర్ లో సరికొత్త ట్రెండ్ సృష్టించారు. […]

Written By: NARESH, Updated On : September 21, 2020 10:58 am
Follow us on

రాజకీయాల్లో ఓడిపోయినా ప్రజల మనసులు గెలుచుకోవడంలో మాత్రం మన సీఎం కేసీఆర్ కుమార్తె, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ముందున్నారు. తెలంగాణ జాగృతితో ఉద్యమంలో ఎలుగెత్తి చాటి.. తొలి తెలంగాణలో నిజామాబాద్ ఎంపీగా రాజకీయాల్లోకి వచ్చిన కవిత మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమితో తెరమరుగయ్యారు.

అతి తక్కువ సమయంలోనే ఉత్తమ పార్లమెంటేరియన్ అయ్యి ప్రత్యక్ష ఎన్నికల్లో మంచి నేతగా పేరుతెచ్చుకున్న కవిత మరో అరుదైన ఘనత సాధించారు.

కల్వకుంట్ల కవిత ట్విట్టర్ లో సరికొత్త ట్రెండ్ సృష్టించారు. దక్షిణ భారతదేశ తొలి మహిళా రాజకీయ నాయకురాలిగా చరిత్ర సృష్టించారు. ట్విట్టర్ లో తాజాగా ఒక మిలియన్ ఫాలోవర్స్ ను సంపాదించిన దక్షిణ భారత తొలి మహిళ నేతగా రికార్డ్ నెలకొల్పారు.

2010లో మాజీ ఎంపీ కవిత ట్విట్టర్ లో ఖాతా ప్రారంభించారు. తెలంగాణతోపాటు దేశ విదేశాల్లో ఆమెకు ఫాలోవర్లు బాగా పెరిగారు. బతుకమ్మ పండుగను విశ్వవ్యాప్తం చేసిన కవితకు ఈ ఫాలోయింగ్ లభించింది.

ఒక ప్రాంతీయ పార్టీ నాయకురాలు ఇంత పెద్ద ఎత్తున ఫాలోవర్లను పొందడం విశేషంగా చెప్పుకోవచ్చు.