కరోనా ఎఫెక్ట్ తో థియేటర్లు మూతపడటంతో ఇటీవల ఓటీటీలకు భారీగా డిమాండ్ పెరిగింది. థియేటర్లలో సినిమాలు చేసేందుకు ఇష్టపడే ప్రేక్షకులు ప్రస్తుతం ఓటీటీలకు అలవాటుపడి పోతున్నారు. కొత్తకొత్త కాన్సెప్టులతో వెబ్ సిరీసులను నిర్మించడంతోపాటు కొత్త సినిమాలను రిలీజ్ చేస్తూ ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇటీవల ఓటీటీల్లోనూ పోటీ తీవ్రంగా కావడంతో కొన్ని సంస్థలు వెనుకబడిపోతున్నారు. రానున్న రోజుల్లో వీటి మనుగడ ప్రశ్నార్థకంగా మారే అవకాశం కన్పిస్తోంది.
సినీరంగంలో ప్రస్తుతం డిజిటల్ హవా కొనసాగుతోంది. ప్రస్తుతం థియేటర్లు నడపడం భారంగా మారుతుండటంతో భవిష్యత్ అంతా ఓటీటీలదే అని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో పలువురు నిర్మాతలు, హీరోలు ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ లలో పెట్టుబడులు పెడుతున్నారు. థియేటర్లు మూతపడటంతో కొత్త సినిమాలన్నీ ఓటీటీల్లోనే రిలీజ్ అవుతున్నారు. అయితే టాలీవుడ్లో మాత్రం కొంత వేచిచూసే ధోరణిని నిర్మాతలు అవలంభిస్తున్నారు. ‘వి’ మూవీ తర్వాత టాలీవుడ్లోని అగ్ర నిర్మాతలు సైతం ఓటీటీ సినిమాలను రిలీజ్ చేసేందుకు మొగ్గుచూపుతున్నారు.
అమెజాన్ ప్రైమ్.. నెట్ ఫ్లిక్స్.. డిస్నీ ప్లస్ హాట్ స్టార్.. సన్ నెక్ట్స్.. ఎంఎక్స్ ప్లేయర్.. జీ-5.. ఆల్ట్ బాలాజీ.. ఊట్ వంటి ఓటీటీలకు ప్రస్తుతం భారీ డిమాండ్ ఏర్పడింది. వీటితోపాటు అనే సంస్థలు ఓటీటీల్లో తమ హవాను కొనసాగిస్తున్నాయి. వీటితోపాటు పూర్తిగా తెలుగు కంటెంట్ తో ‘ఆహా’ ఓటీటీ కూడా నడుస్తోంది. ఈ సంస్థలన్నీ కొత్తకొత్త కాన్సెప్టులతో ఓటీటీ ప్రేక్షకులను తమవైపు తిప్పుకుంటున్నాయి.
జనాలు సైతం ఎంటటైన్మెంట్ అందించే ఓటీటీల వైపు మొగ్గుచూపుతున్నారు. ఈ విషయంలో అమెజాన్ ప్రైమ్.. నెటిప్లిక్స్ సంస్థలు అందరికీ కంటే ముందుంటున్నాయి. కొత్త సినిమాలన్నీ కూడా ఈ రెండు ఓటీటీలే పోటీపడి చేజిక్కించుకుంటున్నాయి. అంతేకాకుండా ఢిపరెంట్ కాన్సెప్టులతో వెబ్ సిరీసులను నిర్మిస్తూ వ్యూయర్ షిప్ పెంచుకుంటున్నాయి. మిగతా ఓటీటీలు ఈ విషయంలో కొంత వెనుకబడిపోతున్నాయి.