https://oktelugu.com/

కేంద్రంపై కేసీఆర్ కోపం నిజమా? నాటకమా?

మిగతా రాజకీయ నాయకులతో పోల్చి చూస్తే సీఎం కేసీఆర్ వైఖరి భిన్నంగా ఉంటుంది. ఏ విషయంలోనైనా కుండ బద్దలుగొట్టినట్టుగా కేసీఆర్ వ్యవహరిస్తూ ఉంటారు. కేంద్రం తీసుకున్న నిర్ణయం విషయంలో తనకు రైట్ అనిపిస్తే రైట్ అని రాంగ్ అనిపిస్తే రాంగ్ అని చెబుతూ కేసీఆర్ ముక్కుసూటిగా వ్యవహరిస్తూ ఉంటారు. రాష్ట్రంలో బీజేపీతో విభేదాలు ఉన్నప్పటికీ కేసీఆర్ కేంద్రంలో మోదీ సర్కార్ తో స్నేహపూర్వకంగా మెలుగుతుంటారు. బీజేపీ విషయంలో సీఎం కేసీఆర్ ఆచితుచి అడుగులేస్తున్నారు. ఎప్పుడు ఏ విధంగా […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : September 12, 2020 3:49 pm
    Follow us on

    మిగతా రాజకీయ నాయకులతో పోల్చి చూస్తే సీఎం కేసీఆర్ వైఖరి భిన్నంగా ఉంటుంది. ఏ విషయంలోనైనా కుండ బద్దలుగొట్టినట్టుగా కేసీఆర్ వ్యవహరిస్తూ ఉంటారు. కేంద్రం తీసుకున్న నిర్ణయం విషయంలో తనకు రైట్ అనిపిస్తే రైట్ అని రాంగ్ అనిపిస్తే రాంగ్ అని చెబుతూ కేసీఆర్ ముక్కుసూటిగా వ్యవహరిస్తూ ఉంటారు. రాష్ట్రంలో బీజేపీతో విభేదాలు ఉన్నప్పటికీ కేసీఆర్ కేంద్రంలో మోదీ సర్కార్ తో స్నేహపూర్వకంగా మెలుగుతుంటారు.

    బీజేపీ విషయంలో సీఎం కేసీఆర్ ఆచితుచి అడుగులేస్తున్నారు. ఎప్పుడు ఏ విధంగా రాజకీయాలు చేయాలో తెలిసిన కేసీఆర్ జీఎస్టీ విషయంలో మాత్రం కేంద్రం తీరును వ్యతిరేకిస్తున్నారు. ఖచ్చితమైన కారణాలు ఉంటే తప్ప కేసీఆర్ ఏ పార్టీపై విమర్శలు చేయరు. తెలంగాణ ప్రజలకు కూడా కేసీఆర్ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకుంటాడని… ప్రజలకు ప్రయోజనం చేకూరేలానే చేస్తాడనే అభిప్రాయం ఉంది.

    కేంద్రంపై ప్రస్తుతం కేసీఆర్ పోరాడటానికి సిద్ధమయ్యారు. తెలంగాణ ప్రజానీకం కూడా కేసీఆర్ ను ప్రతి విషయంలో నమ్ముతూ ఆయన నిర్ణయాలకు మద్దతు తెలుపుతూ ఉంటుంది. జగన్ తో కేసీఆర్ కు సత్సంబంధాలు ఉన్నా జలవివాదం వల్ల ఆ సంబంధాలు దెబ్బతిన్నాయి. వైసీపీతో విభేదాలు పెట్టుకున్న కేసీఆర్ సర్కార్ ఇప్పటికే బీజేపీతో కూడా కయ్యానికి కాలు దువ్వుతుండటం గమనార్హం.

    కొన్ని రోజుల క్రితం వరకు కేసీఆర్ సర్కార్ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కేంద్రానికి మద్దతు ఇస్తూ వస్తోంది. అయితే లోక్ సభలో బీజేపీకి బంపర్ మెజారిటీ ఉంది. 2014 నుంచి బీజేపీ బలం పెంచుకుంటూనే ఉంది. అయితే కేసీఆర్ ఎన్ని విమర్శలు చేసినా కేంద్రం ఆ విమర్శలపై స్పందించే అవకాశం లేదు.