కేసీఆర్ అంతే.. నెక్లెస్ రోడ్ పేరు మార్చేశాడు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాలు తీసుకోవడంలో ముందుంటారు. ఆయన ఏదైనా అనుకుంటే దాన్ని అమలు చేసే వరకు ఊరుకోరు. ఎవరు అడ్డు వచ్చినా ఎంతటి ఉత్పాతం ఎదురైనా లెక్క చేయరు. అనుకున్నది సాధించే తీరుతారు. తాజాగా హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్డు పేరు మార్చాలని భావించారు. దీంతో నెక్లెస్ రోడ్డు అనే మాట వినిపించదు. ఈ అంశంలో ఇప్పటికే ఆయన కమిట్ అయినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో అత్యంత రద్దీ గల ప్రాంతం నెక్లెస్ రోడ్డు. ఖైరతాబాద్ […]

Written By: Srinivas, Updated On : May 31, 2021 6:24 pm
Follow us on

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాలు తీసుకోవడంలో ముందుంటారు. ఆయన ఏదైనా అనుకుంటే దాన్ని అమలు చేసే వరకు ఊరుకోరు. ఎవరు అడ్డు వచ్చినా ఎంతటి ఉత్పాతం ఎదురైనా లెక్క చేయరు. అనుకున్నది సాధించే తీరుతారు. తాజాగా హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్డు పేరు మార్చాలని భావించారు. దీంతో నెక్లెస్ రోడ్డు అనే మాట వినిపించదు. ఈ అంశంలో ఇప్పటికే ఆయన కమిట్ అయినట్లు తెలుస్తోంది.

హైదరాబాద్ లో అత్యంత రద్దీ గల ప్రాంతం నెక్లెస్ రోడ్డు. ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ మీదుగా ముందుకు వచ్చి నాలుగు రోడ్ల కూడలి రోడ్డులో ముందుకు వెళితే సెక్రటేరియట్, కుడివైపుకు తిరిగితే ప్రసాద్ ఐమాక్స్, ఎడమ వైపు తిరిగి ఐదున్నర కిలోమీటర్లు నిడివి ఉండే నెక్లెస్ రోడ్డుకు అనూహ్యమైన పేరును డిసైడ్ చేశారు

ఇటీవల కాలంలో కేసీఆర్ మాజీ ప్రధాని పీవీ నర్సింహారావును దత్తత తీసుకున్నట్లుగా చెబుతున్నారు. పీవీ జయంతిని ఘనంగా నిర్వహించేందుకు వీలుగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి పీవీ కుమార్తెకు టికెట్ ఇచ్చి గెలిపించారు.

పీవీని పట్టించుకోని కాంగ్రెస్ కు షాకిస్తూ తాము పీవీని నెత్తిన పెట్టుకుంటామని చెబుతూ అందుకు తగినట్లుగా ఏదో ఒక నిర్ణయంతో పీవీ పేరు వాడేలా చూస్తున్నారు. తాజాగా నెక్లెస్ రోడ్డుకు పీవీ నర్సింహారావు పేరు పెడుతూ నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. ఇక నుంచి పీవీ నర్సింహారావు మర్గ్ గా పిలుస్తారు.