https://oktelugu.com/

కేసీఆర్‌‌ బర్త్‌డే స్పెషల్‌.. : ఎల్బీ స్టేడియంలో యాగం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌‌రావు ఈ నెల తన పుట్టిన రోజును జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా సీఎం బర్త్‌డే కోసం పార్టీ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నాయి. హైదరాబాద్ ఎల్బీ స్టేడియం వేదికగా పుట్టినరోజున వేడుకలు ఘనంగా నిర్వహించాలని అనుకుంటున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్‌ అల్లిపురం వెంకటేశ్వర్‌రెడ్డి మాట్లడుతూ కేసీఆర్ పుట్టినరోజున యాగం నిర్వహిస్తామన్నారు. Also Read: వరంగల్‌లో రాజుకుంటున్న వివాదం.. : నేడు టీఆర్‌‌ఎస్‌, రేపు బీజేపీ ఆందోళనలు […]

Written By: , Updated On : February 2, 2021 / 02:15 PM IST
Follow us on

KCR
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌‌రావు ఈ నెల తన పుట్టిన రోజును జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా సీఎం బర్త్‌డే కోసం పార్టీ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నాయి. హైదరాబాద్ ఎల్బీ స్టేడియం వేదికగా పుట్టినరోజున వేడుకలు ఘనంగా నిర్వహించాలని అనుకుంటున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్‌ అల్లిపురం వెంకటేశ్వర్‌రెడ్డి మాట్లడుతూ కేసీఆర్ పుట్టినరోజున యాగం నిర్వహిస్తామన్నారు.

Also Read: వరంగల్‌లో రాజుకుంటున్న వివాదం.. : నేడు టీఆర్‌‌ఎస్‌, రేపు బీజేపీ ఆందోళనలు

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వరస్వామి వారిని మంగళవారం వెంకటేశ్వర్‌రెడ్డి దర్శించుకున్నారు. అనంతరం ఆయన ఈ నెల 17న సీఎం కేసీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో అధి శ్రావణ యాగం నిర్వహించ తలపెట్టినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే వేములవాడ రాజరాజేశ్వరస్వామిని దర్శించుకొని.. ఆశీర్వచనం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

Also Read: కేంద్రబడ్జెట్: ఏపీకి వరం.. తెలంగాణకు శాపం

లోక కల్యాణార్థం నిర్వహిస్తున్న యాగానికి ప్రతి ఒక్కరూ ఆహ్వానితులేనన్నారు. యాగానికి పదివేల మంది వరకు హాజరవుతారని అంచనా వేస్తున్నామన్నారు. యాగానికి హాజరయ్యే భక్తులకు స్వామివారి తీర్థప్రసాదాలు, అన్నప్రసాదం అందజేయనున్నట్లు వివరించారు.మొత్తంగా సీఎం కేసీఆర్‌‌ బర్త్‌డే వేడుకలను ఈసారి రాష్ట్రవ్యాప్తంగా పండుగలా నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్