మళ్లీ అధికారంలోకి వచ్చేది మేమే.. హోంమంత్రిని నేనే.. అప్పుడు చూసుకుంట మీ సంగతి పోలీసులపై అచ్చెన్నాయుడి ఫైర్‌‌

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై తప్పుడు కేసులు పెడుతున్నారని.. ఈ కేసుల్ని చూసి భయపడే వ్యక్తిని కాదన్నారు. ఖాకీ డ్రస్ అంటేనే విరక్తి వస్తోందని.. పోలీసుల్ని చూసి ఉద్యోగులు సిగ్గు పడుతున్నారన్నారు. అరెస్ట్ తర్వాత వైద్య పరీక్షల అనంతరం కోర్టుకు తరలిస్తున్న సమయంలో పోలీసులు తీరుపై మండిపడ్డారు. చేసిన తప్పులకు తగిన మూల్యం చెల్లించక తప్పదని.. స్థానిక డీఎస్పీ, సీఐలు వైఎస్సార్‌సీపీ కార్యకర్తల కంటే దారుణంగా వ్యవహరిస్తున్నారని నిప్పులు చెరిగారు. Also […]

Written By: Srinivas, Updated On : February 2, 2021 4:35 pm
Follow us on


ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై తప్పుడు కేసులు పెడుతున్నారని.. ఈ కేసుల్ని చూసి భయపడే వ్యక్తిని కాదన్నారు. ఖాకీ డ్రస్ అంటేనే విరక్తి వస్తోందని.. పోలీసుల్ని చూసి ఉద్యోగులు సిగ్గు పడుతున్నారన్నారు. అరెస్ట్ తర్వాత వైద్య పరీక్షల అనంతరం కోర్టుకు తరలిస్తున్న సమయంలో పోలీసులు తీరుపై మండిపడ్డారు. చేసిన తప్పులకు తగిన మూల్యం చెల్లించక తప్పదని.. స్థానిక డీఎస్పీ, సీఐలు వైఎస్సార్‌సీపీ కార్యకర్తల కంటే దారుణంగా వ్యవహరిస్తున్నారని నిప్పులు చెరిగారు.

Also Read: అచ్చెన్నను మళ్లీ జైలుకు పంపిన వైసీపీ సర్కార్

‘రేపు అధికారంలోకి వచ్చేది మేమే. చంద్రబాబుని అడిగి నేనే హోంమంత్రి పదవి తీసుకుంటా. తప్పుడు కేసులు పెట్టిన పోలీసులు ఎక్కడున్నా విడిచిపెట్టను..’ ఇదీ అచ్చెన్నాయుడు పోలీసులకు ఇచ్చిన స్ట్రాంగ్ వార్నింగ్. వైసీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిని బెదిరించారనే ఆరోపణల కేసులో పోలీసులు అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. భారీ బందోబస్తు నడుమ పోలీసులు ఈ ఉదయం అచ్చెన్నను అదుపులోకి తీసుకున్నారు.

Also Read: బాబు గారూ ఇదేమి రాజకీయం : ఆశ్చర్యపోతున్న టీడీపీ క్యాడర్
‌‌

కాగా.. పోలీసుల తీరుపై అచ్చెన్న ఫైర్ అయ్యారు. కొందరు పోలీసులు వైసీపీ కార్యకర్తలకన్నా దారుణంగా వ్యవహరిస్తున్నారని, తప్పుడు కేసులు పెడుతున్నారని అచ్చెన్న మండిపడ్డారు. తన ఇంట్లోకి చొరబడి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముందని అచ్చెన్న ప్రశ్నించారు. రేపు కచ్చితంగా అధికారంలోకి వచ్చేది మేమే అన్న అచ్చెన్న, టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టిన పోలీసులు వదిలిపెట్టేది లేదని వార్నింగ్ ఇచ్చారు. తాను కేసులకు భయపడే వ్యక్తిని కాదన్నారు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

‘చాలెంజ్ చేస్తున్నా. తగిన మూల్యం చెల్లిస్తారు. నేను రాజకీయ నాయకులను తప్పు పట్టను. పోలీసులు ఇంత దారుణంగా వ్యవహరిస్తారు. డీఎస్పీ, సీఐ.. వైసీపీ కార్యకర్తలకన్నా చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారు. నేను మళ్లీ మళ్లీ చాలెంజ్ చేస్తున్నా. న్యాయాన్ని, ధర్మాన్ని నమ్మే వ్యక్తిని. నా మీద కేసు ఉంటే, నాకు నోటీసు ఇస్తే నేనే పోలీస్ స్టేషన్ కి వచ్చేవాడిని. చట్టానికి అతీతంగా వ్యవహరించే వ్యక్తిని కాను. ఇటువంటి దారుణాలు చేస్తున్నారు. అసలు ఖాకీ డ్రెస్ అంటే అసహ్యం వేస్తోంది. రాష్ట్రంలో ఖాకీ డ్రెస్ వేసుకున్న ఇతర పోలీసులు సిగ్గు పడుతున్నారు’ అని అన్నారు -అచ్చెన్నాయుడు. అచ్చెన్నాయుడిని మంగళవారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. నిమ్మాడలో ఇంటి దగ్గర అదుపులోకి తీసుకుని.. ఆయన్ను కోటబొమ్మాళి స్టేషన్‌కు తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత కోర్టులో హాజరుపరిచారు.