Homeఆంధ్రప్రదేశ్‌KCR BRS: పిల్ల పుట్టకముందే కుల్ల కుట్టారు: ఇదేంది కెసిఆర్ సారూ

KCR BRS: పిల్ల పుట్టకముందే కుల్ల కుట్టారు: ఇదేంది కెసిఆర్ సారూ

KCR BRS: భారత రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ ను కేసీఆర్ నియమించారు. త్వరలో విజయవాడలో పార్టీ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఇవీ నిన్నా మొన్నటి వరకు వ్యాప్తిలో ఉన్న విషయాలు.. కానీ లోతుల్లోకి వెళితే అసలు నిజాలు వెలుగులోకి వస్తున్నాయి.. వాస్తవానికి ఏపీ ప్రాంతానికి చెందిన నేతలకు తెలంగాణ నుంచే కార్లు వెళ్లాయట! భారత రాష్ట్ర సమితి కాంపౌండ్ లో కీలకంగా పనిచేసే తెలంగాణ నేత అవన్నీ సమకూర్చారట.. అంతేకాదు తోట చంద్రశేఖర్ రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడని ఫ్లెక్సీలను హైదరాబాదులో ఏర్పాటు చేశారట! పైగా తెలంగాణ భవన్ లో వారికి విందు కూడా ఏర్పాటు చేశారట.. వాస్తవానికి మొన్న జరిగిన కార్యక్రమానికి ఆంధ్రా ప్రాంతానికి చెందిన నేతలు ముందుగానే వచ్చారు.. ఈ సమాచారం తెలిసినప్పటికీ కెసిఆర్ కావాలనే ఆలస్యంగా వచ్చారని తెలుస్తోంది.. కేసీ ఆర్ రాక కోసం ఏపీ ప్రాంతానికి చెందిన నాయకులు గంటల తరబడి ఎదురు చూశారు. ఇద్దరు ముగ్గురు నాయకులు అయితే తీవ్ర అసహనానికి గురయ్యారు. తోట చంద్రశేఖర్ ను పార్టీలోకి ఆహ్వానించిన తర్వాత… కొంతమంది నాయకులు జై బాలయ్య అని నినాదాలు చేయడం గమనార్హం.

KCR BRS
KCR BRS

తెలంగాణకు ఎవరు?

వాస్తవానికి భారత రాష్ట్ర సమితి పుట్టింది తెలంగాణలో..ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఉన్నది కూడా హైదరాబాదులోనే.. కానీ ఆ పార్టీకి సంబంధించి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు అనేది ఇంతవరకు కేసీఆర్ తేల్చలేదు. జాతీయ పార్టీ అని ప్రకటించినప్పటికీ జాతీయ అధ్యక్షుడిని నియమించలేదు. ఈ పరిణామాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్న రాజకీయ విశ్లేషకులు పిల్ల పుట్టకముందే కుల్ల కట్టించారని ఎద్దేవా చేస్తున్నారు..

కౌంటర్ కూడా గట్టిగానే పడుతున్నది

కెసిఆర్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అడుగుపెట్టిన నేపథ్యంలో అక్కడి నేతలు కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు.. ఉద్యమం జరిగిన సమయంలో ఆంధ్రా ప్రాంతాన్ని తిట్టిన కేసీఆర్… ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని వస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. కెసిఆర్ ముఖ్యమంత్రి పదవి కాంక్షతోనే తెలంగాణ ఉద్యమాన్ని వివాదాస్పదం చేశారని రోజా, తులసి రెడ్డి వంటి వారు విమర్శిస్తున్నారు. భారత రాష్ట్ర సమితిలో ఆంధ్రా ప్రాంతానికి చెందిన నాయకులు చేరినప్పటికీ… కెసిఆర్ ఆశించిన స్థాయి సంఘం ఎన్నికలకి ఫాయిదా ఉండదని వారు గుర్తు చేస్తున్నారు.

KCR BRS
KCR BRS

తోక నాథ్ షిండే అవుతారా?

మరోవైపు ఆంధ్ర ప్రదేశ్ చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారని, వారు త్వరలో భారత రాష్ట్ర సమితిలో చేరుతారని కెసిఆర్ ఇటీవల ప్రకటించారు.. అయితే దీనిపై బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా మండిపడ్డారు. గతంలో తాము ఇలా మాట్లాడినప్పుడు కేసీఆర్ తమను ఏక్ నాథ్ షిండే లతో పోల్చారని, ఇప్పుడు ఆయన తోక్ నాథ్ షిండే అయ్యారని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని చెబుతున్న ఆయన.. జగన్ ప్రభుత్వాన్ని కూల్చుతారా అని ప్రశ్నించారు.. ఒకవేళ ఇదే జరిగితే కేసీఆర్ జైలుకు వెళ్లాల్సి ఉంటుందని ఆయన జోస్యం చెప్పారు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular