Kazakhstan Video : అజర్‌బైజాన్‌కు చెందిన విమానం బుధవారం కజకిస్థాన్‌లోని అక్టౌ సమీపంలో కూలిపోయింది. విమానం కూలిపోవడానికి కొన్ని సెకన్ల ముందు వీడియో బయటపడింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోలో భయాందోళనలో ఉన్న ప్రయాణీకులు తమ ప్రాణాలు కాపాడాలంటూ దేవుడికి నిరంతరం ప్రార్థనలు చేస్తూ కనిపించారు. ఈ ప్రమాదంలో ఈ వీడియోలో కనిపించిన వ్యక్తి స్వల్పగాయాలతో ప్రాణాలతో బయటపడ్డాడు.
విమానం అజర్‌బైజాన్‌లోని బాకు నుంచి రష్యాలోని గ్రోజ్నీ నగరానికి వెళ్తుండగా పొగమంచు కారణంగా విమానం రూట్‌ను మార్చినట్లు సమాచారం. ఆ తర్వాత కజకిస్థాన్‌లోని అక్టౌ నగరం సమీపంలో విమానం కూలిపోయింది. ఈ విమాన ప్రమాదంలో ఇప్పటివరకు 38 మంది మరణించినట్లు కజకిస్థాన్ అధికారులు తెలిపారు. విమానంలో 67 మంది ప్రయాణిస్తున్నారు. రష్యా మీడియా ప్రకారం, విమానంలో ఉన్న 67 మందిలో 32 మంది ప్రాణాలతో బయటపడ్డారని అజర్‌బైజాన్ అధికారులు గతంలో చెప్పారు.
The final moments of the Azerbaijan Airlines plane before its crash in Kazakhstan were captured by a passenger onboard.
Aftermath also included in the footage. pic.twitter.com/nCRozjdoUY
— Clash Report (@clashreport) December 25, 2024
ప్రమాదం ఎలా జరిగింది?
కజకిస్తాన్ అత్యవసర మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో విమానంలో ఐదుగురు సిబ్బంది, ఇద్దరు పిల్లలతో సహా 29 మంది సురక్షితంగా బయటపడ్డారని.. వారందరినీ ఆసుపత్రిలో చేర్చారు. అక్టౌ నుండి 3 కిలోమీటర్ల (1.8 మైళ్ళు) దూరంలో అత్యవసర ల్యాండింగ్ చేస్తున్నప్పుడు విమానం కూలిపోయిందని అజర్‌బైజాన్ ఎయిర్‌లైన్స్ తెలిపింది.
విమానంలో ఎంత మంది ఉన్నారు
కజకిస్థాన్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, విమానంలో 42 మంది అజర్‌బైజాన్‌లు, 16 మంది రష్యన్లు, ఆరుగురు కజకిస్తానీలు , ముగ్గురు కిర్గిజిస్తానీ పౌరులు ఉన్నారు. అజర్‌బైజాన్ ప్రెసిడెంట్ ఇల్హామ్ అలియేవ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రమాదం వెనుక కారణాల గురించి ఊహించడం చాలా తొందరగా ఉందని, అయితే వాతావరణం కారణంగా మార్గాన్ని మార్చామని చెప్పారు. అజర్‌బైజాన్‌లోని బాకు నుంచి రష్యాలోని గ్రోజ్నీకి వెళ్తున్న విమానం అత్యవసరంగా ల్యాండింగ్‌కు గురైందని నాకు అందించిన సమాచారం అని అధ్యక్షుడు చెప్పారు.
అజర్‌బైజాన్, రష్యా అధ్యక్షుడి సంతాపం
ఈ ప్రమాదంలో మృతి చెందిన, గాయపడిన వారందరి కుటుంబాలకు అధ్యక్షుడు తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నానని ఆయన అన్నారు. డిసెంబరు 26న అజర్‌బైజాన్‌లో సంతాప దినంగా ప్రకటిస్తూ డిక్రీపై సంతకం చేశారు.
అదే సమయంలో, రష్యా క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ మాట్లాడుతూ.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అజర్‌బైజాన్ అధ్యక్షుడు అలియేవ్‌తో ఫోన్‌లో మాట్లాడి, ఈ ప్రమాదంపై తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. అలాగే, సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో జరిగిన సీఐఎస్ సమావేశంలో పుతిన్ మాట్లాడుతూ, రష్యా అత్యవసర మంత్రిత్వ శాఖ విమాన ప్రమాదం తర్వాత సహాయం కోసం కజకిస్తాన్‌కు రెస్క్యూ టీమ్‌తో కూడిన విమానాన్ని పంపిందని చెప్పారు. ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నామని కజకిస్తాన్, అజర్‌బైజాన్, రష్యా అధికారులు తెలిపారు.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Kazakhstan videokazakhstan video a passenger prays to god while the plane is falling kazakhstan plane crash video goes viral
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com