Homeజాతీయ వార్తలుKaushik Reddy MLC Post: కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ పెండింగ్ అందుకేనా?

Kaushik Reddy MLC Post: కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ పెండింగ్ అందుకేనా?

Kaushik Reddyహుజురాబాద్ లో యువ నేత కౌశిక్ రెడ్డిని(Kaushik Reddy) సీఎం కేసీఆర్(CM KCR) ఎమ్మెల్సీగా నియామకం చేశారు. నామినేటెడ్ కోటాలో ఎమ్మెల్సీగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ కోటాలో ఆయనను ఎమ్మెల్సీగా నియమించారు. హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో వ్యూహాత్మకంగా కౌశిక్ రెడ్డికి పదవి కేటాయించారని తెలుస్తోంది. దీనిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే గతంలో కౌశిక్ రెడ్డిపై కేసులు పెండింగ్ లో ఉన్నందున ఆయన నియామకం ఫైల్ క్లియరెన్స్ కాలేదని తెలుస్తోంది.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన కౌశిక్ రెడ్డిపై పలు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఇల్లంతకుంట, సుబేదారి పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టారు. వీణవంక, హుజురాబాద్ టౌన్, కరీంనగర్, జమ్మికుంట, సిరిసిల్ల తదితర స్టేషన్లలో వివిధ సెక్షన్ల కింద కేసులు పెట్టారు. దీంతో ఆయన ఎమ్మెల్సీ ఫైల్ పై గవర్నర్ ఆమోదముద్ర వేసే క్రమంలో ఆలస్యం జరుగుతున్నట్లు సమాచారం.

2019 ఫిబ్రవరిలో వాహనం పార్కింగ్ విషయంలో తమ బంధువుపై కౌశిక్ రెడ్డి దాడి చేశారని సినీనటులు జీవిత, రాజశేఖర్ జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ల ఫిర్యాదు చేశారు. హుజురాబాద్ రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కౌశిక్ రెడ్డిని కేసీఆర్ ఎమ్మెల్సీగా ప్రకటించినా తరువాత జరుగుతున్న పరిణామాల్లో వేగం పెరగక ఆయన ఫైల్ గవర్నర్ వద్దకు వెళ్లకపోవడంతో కౌశిక్ రెడ్డి పదవి ఇంకా పూర్తి కాలేదని తెలుస్తోంది. ఈటల రాజేందర్ ను దెబ్బ తీసేందుకే కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని చూసినట్లు సమాచారం.

కౌశిక్ రెడ్డి అప్పట్లో దేశవాళీ క్రికెట్ లో రాణించారు. ఆయన తల్లి పుష్పమాల దేవి మెమోరియల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. అందుకే క్రీడా రంగంలో కృషి చేసిన కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీగా నియమించినట్లు చెబుతున్నా వాస్తవం మరోలా ఉంది. దీంతో హుజురాబాద్ టీఆర్ఎస్ నేతల్లో అసంతృప్తి నెలకొంది. దీంతో కౌశిక్ రెడ్డి పై అందిన ఫిర్యాదుల నేపథ్యంలోనే ఆయన ఆమోద ముద్ర ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తున్నట్లు సమాచారం. మన రాష్ర్టంలో గవర్నర్ కోటాలో గోరటి వెంకన్న, బస్వరాజు సారయ్య, దయానంద్ లను నామినేట్ చేయడంపై గోపాల్ రావు అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. దీంతో కౌశిక్ రెడ్డి విషయంలో కూడా ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు సమాచారం.

 

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular