కర్ణాటక ముఖ్యమంత్రి ఎంపికపై కసరత్తు పూర్తయ్యింది. కర్ణాటక తదుపరి సీఎంగా ప్రస్తుత హోం మంత్రి బసవరాజ్ బొమ్మై పేరును బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది. లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన బసవరాజ్ కే సీఎం పీఠం అప్పజెపుతున్నట్టు ప్రకటించారు. లింగాయత్ సామాజిక వర్గానికి మళ్లీ సీఎంపోస్టును కట్టబెట్టారు. బీజేపీ చివరికి తర్జనభర్జనల మధ్య బసవరాజ్ కే పదవి ఖాయమైంది.
బసవరాజ్ బొమ్మై మాజీ ముఖ్యమంత్రి ఎస్ఆర్ బొమ్మై కొడుకు అనే సంగతి తెలిసిందే. జనతాదళ్ పార్టీతో రాజకీయ అరంగేట్రం చేసిన బొమ్మై 2008లో బీజేపీలో చేరారు. షిగ్గాన్ నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. యడ్యూరప్పకు బొమ్మై అత్యంత సన్నిహితుడిగా ఉండేవాడు. పార్టీలో ఎక్కువ మంది మద్దతు ఉన్న బసవరాజ్ బొమ్మైకే ముఖ్యమంత్రిగా ఎంపికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మంత్రులు బసవరాజ్ బొమ్మై, ఆర్ అశోక సీఎం యడ్యూరప్ప నివాసంలో మంగళవారం మధ్యాహ్నం సమావేశం అయ్యారు. ఈ సమయంలో పలువురు లింగాయత్ ఎమ్మెల్యేలు బసవరాజ్ కు మద్దతు తెలిపినట్లు సమాచారం. దీనిపై బసవరాజ్ మాట్టాడుతూ ముఖ్యమంత్రి ఎంపికపై తమకు ఇంకాఏ సమాచారం అందలేదన్నారు. పార్టీ నిర్ణయానిక కట్టుబడి ఉంటామని చెబుతున్నారు.
ముఖ్యమంత్రి ఎంపికపై రాత్రి ఏడు గంటల సమయంలో బీజేపీ పంపించిన ముగ్గురు పరిశీలకులు కర్ణాటక ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు. కర్ణాటక బీజేపీ వ్యవహారాల ఇన్ చార్జి అరుణ్ సింగ్, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, ధర్మేంద్ర ప్రధాన్ ఎమ్మెల్యేలతో సమావేశమై చర్చిస్తారు. వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని తెలుస్తోంది. మరొ కొద్ది సేపట్లో కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరనే దానిపై స్పష్టత వచ్చే వీలుంది.
యడ్యూరప్ప సోమవారం రాజీనామా చేసిన నేపథ్యంలో ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. సొంత పార్టీ నేతలతోనే అసమ్మతి, వయోభారం కారణంగా పదవి కోల్పోయిన యడ్యూరప్పను బీజేపీ అధిష్టానమే పక్కకు పెట్టినట్లు తెలుస్తోంది. ఢీల్లీ పెద్దల ఆధేశాల మేరకు తన పదవికి రాజీనామా చేసి పార్టీ నిర్ణయానికి విధేయుడిగా ఉంటానని ప్రకటించారు.