Karnataka Hijab Issue: విజయవాడలోని లయోల కళాశాలలో మొదలైన హిజాబ్ వ్యవహారంలో ముఖ్యమంత్రి జగన్ ఫోకస్ పెట్టారు. రాష్ట్రంలో మతసామరస్యం వెల్లివిరిసేలా చూడాల్సిన బాధ్యతను గుర్తు చేస్తున్నారు. ప్రజల్లో ఉన్న సఖ్యతను దెబ్బతీసే ఉద్దేశంతో ఎవరైనా మత విద్వేషాలు రెచ్చగొడితే ఊరుకునేది లేదని చెబుతున్నారు .ఏపీకి ఉన్న పేరును చెడగొట్టే విధంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. లయోల కళాశాల వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారుతోంది.
ఎవరో చేసిన దానికి మరెవరో బాధ్యులు కావాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ చూఇన అత్యుత్యాహమే విజయవాడలో గొడవకు కారణం అయింది. దీంతో యాజమాన్యం దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. ఇలా చేయడంపై అందరిలో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. దీనిపై ఉన్నతాధికారులు విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు
ప్రశాంతమైన రాష్ట్రంలో ఒక్కసారిగా హిజాబ్ వ్యవహారం కలకలం రేపింది. ఎన్నడు లేని విధంగా లయోల కళాశాలలో విద్యార్థినులు బురఖా ధరించి తరగతులకు హాజరు కావద్దని చెప్పడంతో అందరు ఆశ్చర్యానికి గురయ్యారు. తక్షణమే తమ తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో వారు వచ్చి కళాశాల యాజమాన్యంతో చర్చించారు. ఇన్నాళ్లు ఇలాగే వచ్చినా ఏమి అనకపోయినా ఇప్పుడు కొత్తగా ఈ నిబంధన ఏమిటని ప్రశ్నించడంతో యాజమాన్యం దిద్దుబాటు చర్యలకు పూనుకుంది.
దీనిపై ముఖ్యమంత్రి జగన్ కూడా సీరియస్ గా ఉన్నారు. మతసామరస్యం వెల్లివిరిసే ప్రాంతంలో కొత్తగా హిజాబ్ వ్యవహారం ఎందుకు తలెత్తిందని? దీనికి ఎవరు కారకులు? వారిపై క ఠిన చర్యలు తీసుకోవాలని అల్టిమేటం జారీ చేశారు. దీంతో అధికారులు కూడా దీనిపై విచారణ కొనసాగిస్తున్నారు. బాధ్యులపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతున్నారు. కర్ణాటకలో మొదలైన హిజాబ్ లొల్లితో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో అలజడి రేగిన సందర్భంలో ఇక్కడ అలాంటిదేమీ లేకుండా చేయాలని సూచిస్తున్నారు.
దీంతో లయోల కళాశాల యాజమాన్యం తీరును అందరు ఆక్షేపిస్తున్నారు. హిజాబ్ వ్యవహారం బయటకు తీసుకొచ్చిన వారిని చట్టపరంగా శిక్షించేందుకు కూడా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హిజాబ్ గొడవను రాజేయకుండా చర్యలు తీసుకోవాలని అందరు కోరుతున్నారు.