https://oktelugu.com/

ICSIL Recruitment 2022: ఇంటెలిజెంట్‌ కమ్యూనికేషన్ సిస్టమ్స్‌లో ఉద్యోగ ఖాళీలు.. మంచి వేతనంతో?

ICSIL Recruitment 2022: ఇంటెలిజెంట్‌ కమ్యూనికేషన్ సిస్టమ్స్‌ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. మొత్తం 24 ఉద్యోగ ఖాళీల కోసం ఈ సంస్థల నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. 2022 సంవత్సరం జనవరి 1వ తేదీ నాటికి 21 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హతను కలిగి ఉంటారు. ఏదైనా డిగ్రీ చదివి ఉండటంతో పాటు సంవత్సరం అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. స్క్రీనింగ్‌ టెస్ట్‌, టైపింగ్‌ ఆధారంగా […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 18, 2022 12:36 pm
    Follow us on

    ICSIL Recruitment 2022: ఇంటెలిజెంట్‌ కమ్యూనికేషన్ సిస్టమ్స్‌ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. మొత్తం 24 ఉద్యోగ ఖాళీల కోసం ఈ సంస్థల నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. 2022 సంవత్సరం జనవరి 1వ తేదీ నాటికి 21 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హతను కలిగి ఉంటారు. ఏదైనా డిగ్రీ చదివి ఉండటంతో పాటు సంవత్సరం అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

    ICSIL Recruitment 2022

    ICSIL Recruitment 2022

    స్క్రీనింగ్‌ టెస్ట్‌, టైపింగ్‌ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ఫీజు 1000 రూపాయలుగా ఉంటుందని సమాచారం అందుతోంది. ఆన్ లైన్ ద్వారా అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 2022 సంవత్సరం ఫిబ్రవరి 22వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది. http://icsil.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

    Also Read:
    1. గౌతం స‌వాంగ్ బ‌దిలీతో జ‌గ‌న్ కు చిక్కులేనా?
    2. హిజాబ్ వ్వ‌వ‌హారంలో బాధ్యులపై చ‌ర్య‌లుంటాయా?

    అనుభవం ఉన్న ఉద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. డేటా ఎంట్రీ ఆపరేటర్, క్లర్క్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని బోగట్టా. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే వాళ్లకు, కంప్యూటర్ నైపుణ్యాలతో పాటు టైపింగ్ నైపుణ్యాలు తప్పనిసరిగా ఉండాలి. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది.

    వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు భారీ స్థాయిలో ప్రయోజనం చేకూరనుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఉద్యోగాలకు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిది.

    Also Read:
    1. రివ్యూ : “సన్ ఆఫ్ ఇండియా”
    2. ప్చ్.. బాక్సాఫీస్ వద్ద ‘ఖిలాడీ’ పరిస్థితి దారుణం