Aadhaar Number: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను పొందడానికి అవసరమైన ముఖ్యమైన కార్డులలో ఆధార్ కార్డ్ ఒకటనే సంగతి తెలిసిందే. ఆధార్ కార్డ్ నంబర్ మన నిత్య జీవితంలో చాలా సందర్భాల్లో ఉపయోగపడుతుంది. ఆధార్ కార్డ్ ను పోగొట్టుకున్న సమయంలో ఆధార్ నంబర్ గుర్తు లేకపోతే ఇబ్బందులు పడక తప్పదని చెప్పవచ్చు. కొన్ని సందర్భాల్లో ఆధార్ కార్డ్ నంబర్ ఉంటే మాత్రమే బ్యాంక్ లావాదేవీలను జరపడం సాధ్యమవుతుంది.

అయితే స్మార్ట్ ఫోన్ ద్వారా సులభంగా ఆధార్ కార్డ్ నంబర్ కు సంబంధించిన వివరాలను తెలుసుకోవడం సాధ్యమవుతుందని చెప్పవచ్చు. యూఐడీఏఐ వెబ్ సైట్ ద్వారా ఆధార్ కార్డ్ వివరాలను తెలుసుకోవడం సాధ్యమవుతుంది. https://uidai.gov.in/ వెబ్ సైట్ లో మొదట మై ఆధార్ అనే ఆప్షన్ ను ఎంచుకోవాలి. ఆ తర్వాత గెట్ ఆధార్ అనే ఆప్షన్ ను ఎంచుకుని అందులో రిట్రైవ్ లాస్ట్ ఆర్ ఫర్గాటెన్ యూఐడీ అనే ఆప్షన్ ను ఎంచుకోవాలి.
Also Read: ఒకే కేసులో 38 మందికి ఉరిః గుజరాత్ ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు
ఆ తర్వాత పేరు, మొబైల్ నంబర్ తో పాటు క్యాప్చా కోడ్ ను ఎంటర్ చేయడం ద్వారా ఆధార్ నంబర్ ను తెలుసుకోవడానికి అవసరమైన వివరాలన్నీ అందజేయవచ్చు. ఆ తర్వాత సెండ్ వన్ టైమ్ పాస్ వర్డ్ అనే బటన్ పై క్లిక్ చేయాలి. అనంతరం రిజిష్టర్ అయిన మొబైల్ నంబర్ కు వచ్చే వన్ టైమ్ పాస్ వర్డ్ ను ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మొబైల్ నంబర్ కు మెసేజ్ రూపంలో ఆధార్ కార్డ్ నంబర్ వస్తుంది.
ఆన్ లైన్ లో ఆధార్ నంబర్ ను తెలుసుకునే విషయంలో ఇబ్బందులు ఎదురైతే సమీపంలోని ఆధార్ కేంద్రాన్ని సందర్శించి పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.
Also Read: అప్పుడే పవన్ కళ్యాణ్ కు సీఎం ఛాన్స్.. కానీ ఈ సింపుల్ లాజిక్ గుర్తిస్తేనే?