Hijab Controversy: కర్ణాటకలో ముదిరిన వివాదం దేశవ్యాప్తంగా విస్తరించనుంది.సున్నితమైన అంశంలో రెండు వర్గాలు తమదైన శైలిలో పట్టుదలతో ఉండటం తెలిసిందే. ఒకరిపై మరొకరు రాళ్లు రువ్వుకునే వరకు వెళ్లడం ఆందోళన కలిగిస్తోంది ఈ నేపథ్యంలో అసలు గొడవకు కారణమేంటి? దాన్ని అడ్డుకునేందుకు ఏం చర్యలు తీసుకున్నారు? విద్యార్థుల భవిష్యత్ ఏమిటి? అనే అనుమానాలు ఎవరికి రావడం లేదు. హిజాబ్ వ్యవహారం కాస్త నివురు గప్పిన నిప్పులా మారుతోంది. విద్యార్థుల భవిష్యత్ పై పెను ప్రభావం చూపుతోంది. మూడు రోజులుగా విద్యాసంస్థలు మూసి ఉంచడం తెలిసిందే.
దీనికి కారణాలేంటి? ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు. ఎవరి పట్టుదలతో వారు ఉన్నారు. కానీ సమాజ హితం కోసం ఆలోచించడం లేదు దీంతో కర్ణాటలో చోటుచేసుకున్న వివాదానికి మూలం ఏమిటి? మూల్యం ఏమిటి? అనేది తేలాల్సి ఉన్నా ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. ఫలితంగా రోజురోజుకు సమస్య పెరుగుతుందే కానీ తగ్గడం లేదు. దీనిపై పట్టించుకోవాల్సిన వారే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.
ఉడుపిలో ప్రారంభమైన ఈ గొడవ మెల్లగా విస్తరిస్తోంది. అందరిలో అభిప్రాయ భేదాలు పెరుగుతున్నాయి. రెండు వర్గాల్లో చెలరేగిన వివాదంతో అందరు ఫలితాలు అనుభవించాల్సి వస్తోంది. అసలు హిజాబ్ ధరించడంతో వచ్చిన ఇబ్బందులేమిటో చెప్పడం లేదు. ఇన్నాళ్లు నడిచిన సంప్రదాయం ఇప్పుడు ఎందుకు పడటం లేదు. ఇందులో అభ్యంతరం ఏముంది? ఆందోళన ఎందుకు మొదలైంది.
సున్నితమైన అంశాన్ని వివాదానికి కేంద్ర బిందువుగా చేసుకుని రెండు వర్గాలు రెచ్చిపోవడం అందరిలో ఆందోళన కలిగిస్తోంది. విద్యార్థులు విషాగ్ని రగిలించి చోద్యం చూస్తున్నారనే ఆరోపణలు సైతం వస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో అల్లర్లు జరగకుండా చేయాల్సిన బాధ్యత పాలకులపై ఉందని గుర్తించుకోవాలి. సమస్య పరిష్కారానికి తగు చర్యలు తీసుకునేందుకు ముందుకు రావాల్సి ఉంటుంది. కానీ ఇవేమీ పట్టించుకోవడం లేదని తెలుస్తోంది.
దీంతో రాబోయే రోజుల్లో ఇంకా ఏం పరిణామాలు ఉంటాయో తెలియడం లేదు. ఏవో కొన్ని అభిప్రాయాలు తెరమీదకు తీసుకొచ్చి అందరిని బాధ్యులను చేయడం సరైంది కాదనే భావన కూడా వస్తోంది. కొందరి ఆచారాలను అందరి మీద రుద్దడం సమంజసం కాదని తెలుస్తోంది. సమస్య రాష్ట్రమంతా విస్తరిస్తున్న క్రమంలో ఆదిలోనే అడ్డుకట్ట వేయాల్సి ఉండటంతో ఆ దిశగా ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది.
Also Read: సినీ రంగ సమస్యలు తొలిగినట్లేనా..?ఈ భేటీతో ఎవరికి ప్రయోజనం..?
విషయం కాస్త కోర్టుకు చేరడంతో దీనిపై ఏం తేలడం లేదు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ప్రజల సౌకర్యార్థం ఏం చర్యలు తీసుకుంటున్నారో కూడా తెలియడం లేదు. దీంతో రాష్టంలో విద్యాసంస్థల మూసివేత ఇంకా ఎన్ని రోజులు అనే సందేహాలు అందరిలో వస్తున్నాయి. ఏదిఏమైనా ప్రభుత్వం గొడవ సద్దుమణిగేందుకు సత్వర చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
కర్ణాటక లో చోటుచేసుకుంటున్న పరిణామాలు మరెక్కడ కూడా జరగకుండా చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వాలు చొరవ చూపాలి. ప్రజల్లో ఉన్న ఐక్యతను దెబ్బతీసే చర్యలపై అప్రమత్తంగా ఉండేందుకు తోడ్పాటునందించాల్సిన అవసరం ఏర్పడింది. సున్నితమైన అంశాలను పరిష్కరించే క్రమంలో బేషజాలకు పోకుండా ఆలోచించి నిర్ణయిం తీసుకోవాలి. ఇందుకోసం అన్ని మార్గాలను అన్వేషించి పరిష్కరించేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలుసుకోవాలి.