PM Modi Roadshow Bengaluru: కర్ణాటక ఎన్నికలు చివరి అంకానికి చేరుకున్నాయి. నేతలు పోటా పోటీగా ప్రచారం చేస్తున్నారు. సర్వే సంస్థలు స్పష్టమైన ఫలితాలు ప్రకటించని నేపథ్యంలో అన్ని పార్టీల నాయకులు ఓటర్ల మనసు చూరగొనేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.. ప్రధానమంత్రి నుంచి మొదలుకొని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు వరకు అందరూ కర్ణాటకలోనే తిష్ట వేశారు.
భారతీయ జనతా పార్టీకి అన్నీ తానై..
ఇక కర్ణాటక ఎన్నికల్లో ప్రధానమంత్రి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇక్కడ స్థానిక నాయకత్వం రకరకాల ఆరోపణల నేపథ్యంలో ప్రజల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నది. అయితే దానిని విజయానికి అడ్డుకాకుండా చూసుకునేందుకు భారతీయ జనతా పార్టీ రంగంలోకి దిగింది. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలుమార్లు కర్ణాటకలో పర్యటించారు. వేలకోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అంతేకాదు ప్రస్తుతం నాలుగు రోజులుగా ఆయన కర్ణాటకలోనే ఉంటున్నారు. ప్రతిపక్ష కాంగ్రెస్ చేస్తున్న విమర్శలను చాలా తెలివిగా తిప్పికొడుతున్నారు. గుజరాత్ రాష్ట్రంలో ఎలాగైతే ప్రచారం చేశారో… కర్ణాటకలో అదే స్థాయిలో ప్రచారం సాగిస్తున్నారు.
భారీ రోడ్ షో
కర్ణాటక రాజధాని బెంగళూరు ఐటి హబ్ గా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు ఉద్యోగాలు చేస్తూ సెటిల్ అయ్యారు. వారి మనసు చూరకొనేందుకు నరేంద్ర మోదీ నేరుగా రంగంలోకి దిగారు. అంతేకాదు బెంగళూరు పరిషత్ ప్రాంతాల్లోని నియోజకవర్గాలు కవర్ చేస్తూ శనివారం భారీ రోడ్ షో నిర్వహిస్తున్నారు. శనివారం ఉదయం బెంగళూరులోని కోనేన కుంట లో నరేంద్ర మోదీ రోడ్ షో ప్రారంభమైంది. నిప్పులు చెరిగే ఎండను కూడా లెక్కచేయకుండా ఆయన రోడ్డు షో లో పాల్గొన్నారు. జెపి నగర్, జయ నగర్, జయనగర్ మెట్రో స్టేషన్, మాధవ రావు సర్కిల్, సౌత్ ఎండ్ సర్కిల్ ప్రధాని సందడి చేశారు. అక్కడి ఓటర్లతో ముఖాముఖిగా మాట్లాడారు. ప్రధానమంత్రిని చూసేందుకు జనం భారీగా తరలివచ్చారు. అక్కడి నుంచి రమణ మహర్షి రోడ్డు, ఆర్ బీఐ లే అవుట్, రోస్ గార్డెన్, శిర్సి సర్కిల్, జేజే నగర్, బిన్నీ మిల్ రోడ్డు, శాలిని గ్రౌండ్స్, ఆర్ముగం సర్కిల్ మీదుగా మోదీ రోడ్ షో నిర్వహించారు.
విజయమే లక్ష్యంగా
గత ఎన్నికల్లో బెంగళూరు నగర పరిధిలో ఉన్న నియోజకవర్గాల్లో బిజెపికి మాత్రమే సీట్లు వచ్చాయి. అయితే ప్రస్తుతం అన్ని రకాల సర్వే సంస్థలు బిజెపి అధికారంలోకి రాదు అని స్పష్టం చేస్తున్నాయి. దానిని తిరగరాసేందుకు ప్రధానమంత్రి సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఆ ప్రాంతంలో రోడ్డు షో నిర్వహించిన అనంతరం బుల్ టెంపుల్ మెయిన్ రోడ్డు, కృష్ణ ఆశ్రమం రోడ్డు, ఉమా టాకీస్, టీ ఆర్ మిల్, చామరాజపేట మెయిన్ రోడ్డు, బాలే కాయ్ మండి రోడ్డు, కేపీ అగ్రహార, చోళపాళ్య, ఎంసీ సర్కిల్, బెస్ట్ కార్డు సర్కిల్, ఎంసీ లేఅవుట్, నాగరబావి మెయిన్ రోడ్డు, బి జి ఎస్ గ్రౌండ్స్, అవనూరు సర్కిల్, బసవేశ్వర నగర్, శంకరమఠ, మల్లేశ్వరం ప్రాంతాల్లో మోదీ రోడ్డు షో సాగనుంది. దీనికి సంబంధించి బెంగళూరు పోలీసులు కానీ విని ఎరిగిన స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. రోడ్ షో ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్ జామ్ కాకుండా వాహనాలను ఇతర మార్గాల మీదుగా మళ్ళించారు. అయితే వివిధ సర్వే సంస్థలు భారత జనతా పార్టీకి వ్యతిరేకంగా తీర్పు ఇస్తున్న నేపథ్యంలో.. ఈసారి అధికారంలోకి రావాలని ప్రధాని బలంగా కోరుకుంటున్నారు. అందుకే కర్ణాటక వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
This is the huge love PM @narendramodi ji is receiving in his 26 Kilometer long road show in #Bengaluru. Mesmerising “!!#KarnatakaAssemblyElection #Karnataka #BJPYeBharavase #ModiWinningKarnataka #modiroadshow #BJP #NarendraModi pic.twitter.com/FHqcEBGEEW
— Amitabh Chaudhary (@MithilaWaala) May 6, 2023