Karnataka Elections 2023: దేశంలో 2024 ఎన్నికలకు మరో ఏడాది సమయం ఉందనగా కర్ణాటకలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలను ప్రధాన పార్టీలు అయిన బిజెపి, కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. వచ్చే ఏడాది జరగనున్న లోక్ సభ ఎన్నికలకు ఫ్రీ పోల్స్ గా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి. దీంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఇరు పార్టీలు ప్రచారాన్ని చేపడుతున్నాయి. ఈ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారాలు చేసి చేజిక్కించుకుంటుంది అనే దానిపై అనేక సంస్థలు సర్వేలు నిర్వహించాయి. ఇప్పటికే పలు సంస్థలు ప్రీ పోల్ సర్వేలు నిర్వహించాయి. కర్ణాటకలో పీపుల్స్ పల్స్ సంస్థ కూడా మూడు విడతల్లో ప్రీ పోల్ సర్వే నిర్వహించింది. ఈ ప్రీ పోల్ సర్వేలో కాంగ్రెస్ కు స్వల్ప ఆధిక్యత కనిపిస్తున్నట్లు తేలింది.
ఈ సర్వే నిర్వహించిన సంస్థ మహిళలు, పురుషులతోపాటు అన్ని వయసుల వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంది. ప్రధానంగా అభివృద్ధి, సంక్షేమం, సామాజిక అంశాలు ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం.. ఇలా అన్ని రంగాల్లో కాంగ్రెస్ ఇతర పార్టీల కంటే ముందుంది. కోస్తా కర్ణాటకను మినహాయించి అన్ని ప్రాంతాల్లో హస్తం తన ప్రధాన ప్రత్యర్థి బిజెపి కంటే ముందంజలో ఉన్నట్లు ఈ సర్వే చెబుతోంది.
కాంగ్రెస్ పార్టీ 100 స్థానాలకు పైగా సాధించే అవకాశం..
రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ 100 స్థానాలకు పైగా సాధించే అవకాశం ఉందని ఈ సర్వే చెబుతోంది. బిజెపి 100 స్థానాల్లో పే పరిమితం కావచ్చు అంటోంది ఈ సర్వే. అలాగే, జెడి(ఎస్) తనకు పట్టున్న స్థానాల్లో ఆధిపత్యం కొనసాగిస్తూ 24 స్థానాలకుపైగా సాధించే అవకాశం ఉంది. సౌత్ ఫస్ట్ న్యూస్ వెబ్సైట్ కోసం నిర్వహించిన సర్వే ప్రకారం.. కాంగ్రెస్ పార్టీ 105 నుంచి 117 స్థానాలు, బిజెపికి 81 నుంచి 93 స్థానాలు, జెడి (ఎస్) 24 నుంచి 29 స్థానాలు, ఇతరులు 1-3 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని ఈ సర్వే వెల్లడించింది. 2018లో 38.14% ఓట్ల సాధించిన కాంగ్రెస్ ఈ సారి 41.4% పొందే అవకాశాలు ఉన్నాయి. 2018లో 36.35 ఓట్ల శాతం పొందిన అధికార బిజెపి ఇప్పుడు స్వల్పంగా 0.3% కోల్పోయి 36% ఓట్లు సాధించే అవకాశం ఉంది. 2018లో కింగ్ మేకర్ పాత్ర పోషించిన జెడి(ఎస్) 16% ఓట్లు సాధించే అవకాశాలున్నాయి. ఇది 2018 కంటే 2.3 శాతం తక్కువ. సౌత్ ఫస్ట్ న్యూస్ వెబ్సైట్ కోసం పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ డైరెక్టర్ ఆర్ దిలీప్ రెడ్డి నేతృత్వంలో ఈ నెల ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ మధ్య ఈ సర్వే నిర్వహించారు. ప్రాబబులిటీ ప్రొఫెషనల్ మెథడాలజీ పద్ధతి ద్వారా ఎంపిక చేసిన 56 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ సర్వే నిర్వహించారు. ప్రతి నియోజకవర్గంలో మూడు పోలింగ్ స్టేషన్లను ఎంపిక చేశారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో 20 శాంపిల్స్ తీసుకున్నారు. ప్రాంతం, కులం, వయసు, పురుషులు, స్త్రీలు, పేద, సంపన్నులు ఇలా తగిన నిష్పత్తిలో ఉండేలా చూసుకుంటూ మొత్తం 3360 శాంపిల్స్ సేకరించారు.
మొదటి ప్రీ పోల్ సర్వేలో ఏం తేలిందంటే..
కర్ణాటకలో పీపుల్స్ పల్స్ సంస్థ మొదటి ప్రీ పోల్ సర్వేను 2022 డిసెంబర్ 22వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నిర్వహించింది. రెండో ప్రీ పోల్ సర్వేను 2023 మార్చి 25 నుంచి 10 ఏప్రిల్ వరకు చేపట్టారు. మూడో ప్రీ పోల్ సర్వేను 2023 మే ఒకటో తేదీ నుంచి 5వ తేదీ మధ్య నిర్వహించారు. ఈ సర్వేలో భాగంగా ముఖ్యమంత్రిగా ఎవరికి ప్రాధాన్యతనిస్తున్నారని ఓటర్ల అభిప్రాయాన్ని కోరగా మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పక్షాన 42 శాతం మంది నిలిచారు. ప్రస్తుత ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మైకు 24 శాతం, మాజీ సీఎం కుమారస్వామికి 17%, మాజీ సీఎం యడ్యూరప్పకు 14 శాతం మంది, డీకే శివకుమార్ కు మూడు శాతం మంది ప్రాధాన్యతనిచ్చారు. కర్ణాటక రాష్ట్రం అభివృద్ధికి ఏ పార్టీ మెరుగైనది అని ప్రశ్నిస్తే కాంగ్రెస్ కు 46 శాతం మంది, బిజెపి 34 శాతం, జెడి (ఎస్)కు 14 శాతం మంది ప్రాధాన్యతనిచ్చారు. బిజెపి ప్రభుత్వానికి మరో అవకాశం ఇస్తారా అని ప్రశ్నించగా 53% ఇవ్వమని, 41 శాతం మంది ఇస్తామని చెప్పగా, ఆరు శాతం మంది ఏమి చెప్పలేమని తెలిపారు.
Web Title: Karnataka elections 2023 peoples pulse survey show that congress is leading in karnataka
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com