కర్ణాటక కాంగ్రెస్ లో కుమ్ములాటలు.. చీలిక తప్పదా!

కర్ణాటకలో అధికారం కోల్పోయినప్పటి నుండి కాంగ్రెస్ పార్టీ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య అహంకార పూరిత ధోరణి, ముఠా రాజకీయాల కారణంగానే ప్రభుత్వం కూలిపోయిన్నట్లు కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తున్నది. ఉప ఎన్నికలలో ఘోర పరాజయాన్ని సహితం అది వెల్లడించింది. తొలి ఉంది ముఖ్యమంత్రి కుమారస్వామి పట్ల అసహనంగా వ్యవహరిస్తూ, ఎవ్వరి కారణంగా తాను జెడి (ఎస్) నుండి బైటకు వచ్చి, కాంగ్రెస్ పార్టీలో చేరానో, ఇప్పుడు అదే వ్యక్తి ముఖ్యమంత్రి కావడానికి మద్దతుగా నిలబడతానని […]

Written By: Neelambaram, Updated On : February 22, 2020 2:55 pm
Follow us on


కర్ణాటకలో అధికారం కోల్పోయినప్పటి నుండి కాంగ్రెస్ పార్టీ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య అహంకార పూరిత ధోరణి, ముఠా రాజకీయాల కారణంగానే ప్రభుత్వం కూలిపోయిన్నట్లు కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తున్నది.
ఉప ఎన్నికలలో ఘోర పరాజయాన్ని సహితం అది వెల్లడించింది. తొలి ఉంది ముఖ్యమంత్రి కుమారస్వామి పట్ల అసహనంగా వ్యవహరిస్తూ, ఎవ్వరి కారణంగా తాను జెడి (ఎస్) నుండి బైటకు వచ్చి, కాంగ్రెస్ పార్టీలో చేరానో, ఇప్పుడు అదే వ్యక్తి ముఖ్యమంత్రి కావడానికి మద్దతుగా నిలబడతానని జీర్ణించుకోలేక పోతున్నారు.
కుమారస్వామిపై తిరుగుబాటు చేసి, బిజెపితో చేతులు కలిపి, ప్రభుత్వం పతనం కావడానికి కారణమైన ఎమ్యెల్యేలలో అత్యధికులు సిద్దరామయ్య అనుచరులే కావడం గమనార్హం. అటువంటి పరిస్థితులలో కొత్త పిసిసి అధ్యక్షుడి నియామకం రాష్ట్ర కాంగ్రెస్ కు సవాల్ గా మారింది. ఈ విషయమై సిద్దరామయ్య, పార్టీని ఆపదలో ఆడుకొంటున్న డీకే శివకుమార్ ల మధ్య ప్రచ్ఛన్న పోరు నడుస్తున్నది.

కాంగ్రెస్ అధిష్ఠానం శివకుమార్ ను పిసిసి అధ్యక్షుడిగా నియమించడానికి సిద్ద పడుతుండగా, దానిని సిద్దరామయ్య తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. తన మద్దతుదారుడి ఆ పదవి కట్టబెట్టాలని పట్టుబడుతున్నారు. ఈ విషయమై పార్టీలో చీలిక అనివార్యం అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

రాబోయే మూడు నెలల్లో కర్నాటక కాంగ్రెస్‌ ముక్కలు ముక్కలుగా చీలిపోతుందని, ప్రతిపక్ష నేత సిద్దరామయ్య నూతన పార్టీని స్థాపించనున్నారని కర్నాటక బీజేపీ అధ్యక్షుడు నలిన్ కుమార్ చేసిన ప్రకటన ఈ సందర్భంగా కర్ణాటక రాజకీయాలలో పెను సంచలనం కలిగిస్తున్నది.

ఒకవేళ పీసీసీ అధ్యక్షుడిగా డీకే శివకుమార్‌ను నియమిస్తే సిద్దరామయ్య కాంగ్రెస్ నుంచి వైదొలిగిపోతారని, ఒకవేళ సిద్దరామయ్య మనిషిని పీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తే డీకే శివకుమార్ కాంగ్రెస్ నుంచి వైదొలిగిపోతారని ఆయన వ్యాఖ్యానించారు.

దీంతో కర్నాటక రాజకీయాల్లో ఒక్క సారిగా పెను దుమారం చెలరేగింది. ఒకవేళ డీకే శివకుమార్‌ను, సిద్దరామయ్యను ఒకే తాటిపైకి తెస్తే మాజీ డిప్యూటీ సీఎం పరమేశ్వరన్ కాంగ్రెస్‌ను వీడి వెళ్తారని కూడా అంటూన్నారు. ఈ పరిణామాలతో కర్నాటక కాంగ్రెస్‌లో ముసలం పుట్టడం ఖాయమని నలిన్ కుమార్తె తెలిపారు.